• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

15, డిసెంబర్ 2010, బుధవారం

అఱసున్న

అఱసున్నగురించి కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది నాకు. మనం అరసున్న ను పూర్తిగా మర్చి పోయాము అన్నాతప్పు గాదేమో కూడాను.

కొన్ని మాటల్లో అఱసున్న సహజంగానే ఉంటుంది. అలాంటి వాటిని "సిద్ధ ఖండ బిందువు" అంటారు. కొన్ని శబ్దాల్లో అఱసున్న వ్యాకరణ కార్యాల వల్ల వస్తుంది. ఇలా వచ్చే వాటిని " సాధ్య బిందువు" అని అంటారు.
శిద్ధ ఖండ బిందువు లో అంటే సహజం గా వచ్చే అరసున్నను నిండు సున్నా గా మర్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే, సున్న లేకుండా, సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట.ఉదా: తలంచు - తల(చు
ఐతే అన్ని చోట్లా ఈ సూత్రం వాడ రాదు. ఎలా అంటే.."రొండింటిని" అన్న పదం లో సున్న బదులుగా నేను అరసున్న వాడతాను అంటే కుదరదు. ఆయా సమయా సంధర్భాలను బట్టి మాత్రం అని గ్రహించాలని నా మనవి.
దీర్ఘము మీద ఉన్న అరసున్నలను నిఘంటువు ల సాయంతో మాత్రమే కనుక్కోగలము. ఎలా అంటే..
అందా(క .. ఆ(కలి .. డా(గు , చే(దు
నామ వాచకం లో సాధ్య ఖండ బిందువు ... రాము(డు.. అన్న చోట..రేను, గొను శబ్దముల 'ను" వర్ణమునకు ఏకత్వమున వైకల్పికము గానూ..బహుత్వమున నిత్యము గానూ..ఆదేశమగు 'గు" వర్ణకమునకు ముందు అరసున్న వుంతుంది. ఉదా: గో(గు..రే(గు అలా అన్నమాట.
కలన్వాదుల "ను" వర్ణకమునకు ఏకత్వం వైకల్పికము గానూ.. బహుత్వమున నిత్యము గానూ ఆదేసమగు "కు" వర్ణకమునకు ముందు అరసున్న వస్తుంది.ఉదా: కొఱ(కు, మ్రా(కు.
ఇంకా...క్రియలలో..చదువగల(డు..ప్రార్ధనార్ధక బహువచన ధాతువులకు "డు" వర్ణకమునకు ముందు (ఉదా: వండు(డు ) అలాగే వ్యతిరేక ప్రార్ధనార్ధక బహువచన ధాతువులకు ముందు ( ఉదా: వండకు(డు ) కర్మార్ధకమున ధాతువునకు చేరు "అ(బడు" అనే ప్రత్యయము లోబడు పూర్వమూ అరసున్న వచ్చును ( ఉదా: కొట్ట(బడు )
భవిష్యదర్ధకమున ధాతువునకు చేరు 'అ(గల" ప్రత్యయము లో "గల" కు ముందు అరసున్న వస్తుంది.. ( ఉదా: వండు + అగల = వండ(గల )సమాసాల్లో..నాము + చేను = నా(పచేను.. అన్న చోట్లా..ద్రుతప్రకృతికములకు పరుషములు పరమైనాకూడా..ద్రుతమునకు అరసున్న వస్తుంది..ఈ అరసున్నయే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదా: వాని(జూచితి, నాకు(బుట్టెను.
ఇంకా ఎక్కువగా చెప్తే విసుగు కలుగుతుంది. స్వస్తి..

1 కామెంట్‌:

ఆ.సౌమ్య చెప్పారు...

బావుందండీ, మంచి విషయం చెప్పారు. ఈ రోజుల్లో అఱసున్నా వాడడం మనేసాము. నాకు అంత అవసరం కూడా లేదు అని అనిపిస్తుంది. కాకపొతే కొన్నిచోట్ల మాత్రం అఱసున్న ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. అవెలాంటివంటే "చెప్పలేవేం" అనే బదులు చెప్పలేవేఁ అని వాడితే బావుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే "తీసుకుంటారేఁ, మరచిపోకండేఁ, నేను చెబితే మాత్రం చెయ్యవేఁ"....ఇలా అన్నమాట.