• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

15, డిసెంబర్ 2010, బుధవారం

అఱసున్న

అఱసున్నగురించి కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది నాకు. మనం అరసున్న ను పూర్తిగా మర్చి పోయాము అన్నాతప్పు గాదేమో కూడాను.

కొన్ని మాటల్లో అఱసున్న సహజంగానే ఉంటుంది. అలాంటి వాటిని "సిద్ధ ఖండ బిందువు" అంటారు. కొన్ని శబ్దాల్లో అఱసున్న వ్యాకరణ కార్యాల వల్ల వస్తుంది. ఇలా వచ్చే వాటిని " సాధ్య బిందువు" అని అంటారు.
శిద్ధ ఖండ బిందువు లో అంటే సహజం గా వచ్చే అరసున్నను నిండు సున్నా గా మర్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే, సున్న లేకుండా, సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట.ఉదా: తలంచు - తల(చు
ఐతే అన్ని చోట్లా ఈ సూత్రం వాడ రాదు. ఎలా అంటే.."రొండింటిని" అన్న పదం లో సున్న బదులుగా నేను అరసున్న వాడతాను అంటే కుదరదు. ఆయా సమయా సంధర్భాలను బట్టి మాత్రం అని గ్రహించాలని నా మనవి.
దీర్ఘము మీద ఉన్న అరసున్నలను నిఘంటువు ల సాయంతో మాత్రమే కనుక్కోగలము. ఎలా అంటే..
అందా(క .. ఆ(కలి .. డా(గు , చే(దు
నామ వాచకం లో సాధ్య ఖండ బిందువు ... రాము(డు.. అన్న చోట..రేను, గొను శబ్దముల 'ను" వర్ణమునకు ఏకత్వమున వైకల్పికము గానూ..బహుత్వమున నిత్యము గానూ..ఆదేశమగు 'గు" వర్ణకమునకు ముందు అరసున్న వుంతుంది. ఉదా: గో(గు..రే(గు అలా అన్నమాట.
కలన్వాదుల "ను" వర్ణకమునకు ఏకత్వం వైకల్పికము గానూ.. బహుత్వమున నిత్యము గానూ ఆదేసమగు "కు" వర్ణకమునకు ముందు అరసున్న వస్తుంది.ఉదా: కొఱ(కు, మ్రా(కు.
ఇంకా...క్రియలలో..చదువగల(డు..ప్రార్ధనార్ధక బహువచన ధాతువులకు "డు" వర్ణకమునకు ముందు (ఉదా: వండు(డు ) అలాగే వ్యతిరేక ప్రార్ధనార్ధక బహువచన ధాతువులకు ముందు ( ఉదా: వండకు(డు ) కర్మార్ధకమున ధాతువునకు చేరు "అ(బడు" అనే ప్రత్యయము లోబడు పూర్వమూ అరసున్న వచ్చును ( ఉదా: కొట్ట(బడు )
భవిష్యదర్ధకమున ధాతువునకు చేరు 'అ(గల" ప్రత్యయము లో "గల" కు ముందు అరసున్న వస్తుంది.. ( ఉదా: వండు + అగల = వండ(గల )సమాసాల్లో..నాము + చేను = నా(పచేను.. అన్న చోట్లా..ద్రుతప్రకృతికములకు పరుషములు పరమైనాకూడా..ద్రుతమునకు అరసున్న వస్తుంది..ఈ అరసున్నయే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదా: వాని(జూచితి, నాకు(బుట్టెను.
ఇంకా ఎక్కువగా చెప్తే విసుగు కలుగుతుంది. స్వస్తి..

23, నవంబర్ 2010, మంగళవారం

చంద్ర గణాలు.

ఇదివరకు మనం సూర్య గణాలూ, ఇంద్ర గణాలూ తెలుసు కున్నాము. ఇప్పడు చంద్ర గణాల గురించి తెలుసుకుందాము. చంద్ర గణాలు మొత్తం ౧౪ రకాలు.
చంద్ర గణములు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIIUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
పై గురు లఘువులను బట్టి మీరు తేలికగా గుర్తించ వచ్చు. ఐతే ఈ చంద్ర గణాలు ఎలా ఉపయోగ పడతాయో తెలుసు కోవాలి గదా.. "అక్కరలు" అనే ఛందస్సు లో ఉపయోగ పడతాయి. అక్కరల గురించి కొంచెం తెలుసు కుందాము
ఇవి ఐదు విధములు.

అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.

మహాక్కర , మధ్యాక్కర , మధురాక్కర , అంతరాక్కర , అల్పాక్కర

మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర.
ఈ పద్యాల గురించి విపులం గా తర్వాతి పోస్టింగు లలో తెలుసుకుందాము.

25, అక్టోబర్ 2010, సోమవారం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సందేశం...24.10.2010.


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, గుంటూరు లో సంపత్ నగర్ లో ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేందుకు విచ్చేసారు. వారిని కలిసి కొన్ని విషయాలలోగల సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. మీతో పంచుకోవలని అనిపించింది.
నేను: నమస్కారం అండీ.. నా పేరు టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ నుంచీ వచ్చాను. నేను తెలుగులో "పద్య మంజూష " అనే బ్లాగు నడుపుతున్నాను. మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలని అనుకుంటున్నాను.
మొదటగా.. నేడు సమిష్టి కుటుంబాలు అంతరించాయి.అన్నీ మైక్రో కుటుంబాలే. ఎవర్నీ ఎవరూ గౌరవిచడం లెదు. కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధశ్రమాల పాలవుతున్నారు. ఏమిటి? ఈ పరిస్తితి ఎందుకొచ్చింది?


సా.ష. శర్మ : నిజమే! కొంత కలియుగ ప్రభావం ఉంది. ఈ పరిస్తితి మెరుగవ్వలంటే, ఏ ఒక్కరో అనుకుంటె కుదరదు. తాతలు తండ్రులు కొడుకులు.. ఇలా వంశం లో ప్రేమ.. అనేది రావాలి. మన మన: ప్రవృత్తి లో మార్పు రావాలి.

నేను: గతం లో పాఠశాలల్లో.. నీతి కధలూ,డ్రిల్లూ, క్రాఫ్టు లాంటివి ఉండి..విద్యార్ధి ని సర్వతోముఖంగా తీర్చి దిద్దేట్టు ఉండేవి. ఇప్పుడు అన్నీ కార్పోరేటు విద్యా సంస్తలు. నేటి విద్యార్ధి పరిస్తితి ఎమిటి?
సా.ష. శర్మ : నేడు వ్యాపార దృక్పధం అన్ని రంగాల్లో ఉంది. డబ్బు సంపాదన ధ్యేయం గా తల్లి దండ్రులు కూడా..ఆ పరుగు లో భాగం పంచుకుంటున్నరు.విద్యా బోధనలో నైతికతకు ప్రాధాన్యత రాను రానూ తగ్గించటమే అన్ని అరిష్టాలకీ మూలకారణం.విద్యకి ప్రథమ ప్రయోజనం సంస్కారం. అంతిమ ప్రయోజనం సంపాదన. ప్రథమ ప్రయోజనాన్ని విద్యావ్యవస్థ విస్మరించకూడదు. తమ పిల్లలు కొత్తగా కనిపించాలనేది పెద్దల తాపత్రయం. అలా చెయ్యలేకపోతే వెనుకబడినట్లు భావించటం వల్ల విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు. పబ్ సంస్కృతి , ఆకర్షణలు , వ్యామోహాలను పెంచే వాతావరణం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి ఏకైక ఔషథం ఆథ్యాత్మిక యోగ జీవితం.


నేను: నేటి యువత లో దైవ చింతన తగ్గింది. పై పై మెరుగులకు క్షణిక సుఖాలకు ఆకర్షితులవుతున్నారు. యువత లో స్త్రీలలో కొంత మటుకూ ఈ దైవ చింతన ఉంది. మొగ వారిలో కూడా ఈ దైవ చింతన.. పాప భీతి ఉంటె.. సమాజం ఇంకా మెరుగ్గా ఉంటుందేమో కదా?

సా.ష.శర్మ: నిజమే!! ఐతే పూర్తిగా అంతరించి పోలేదు. వాళ్ళు కొంచెం వయసు వచ్చాక తెలుసుకుంటున్నారు. అలాగే. తల్లి దండ్రులూ..తమ బిజీ జీవితం లో ఉండక పిల్లలకు అన్నీ విడమర్చి చెప్పాలి. వారికి చెప్పగా చెప్పగా మంచి మర్గాన పడతారు కదా.. మార్పు అన్ని దిశల నుండీ రావాలి.


నేను : మీకు నచ్చిన గ్రంధం ఏమిటి? విద్యలన్నిటిలోనూ గొప్ప విద్య ఏది? ఏ గ్రంధం చదవకపోటే మనం ఎంతో కోల్పొయినట్టుగా లెక్క.

సా.ష.శర్మ :"భగవద్గీత" ’అథ్యాత్మ విద్యా విద్యానాం’ అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పరమాత్ముని తెలుసుకునే విద్యే అసలైన విద్య. ఆథ్యాత్మికత తర్కానికి, యుక్తికి లొంగనిది. సాధన , ఉపాసన వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల భగవద్గీత చదివి తీరాల్సిన గ్రంధం.

నేను: చివరిగా..పద్యకవిత మరుగున పడిపోతోంది. వచన కవితలూ..నానీలూ., నానోలూ..గేయ కవితలూ.. పద్యాన్ని మింగేస్తున్నాయి. పద్యం బ్రతికి బట్ట కడుతుందా?
సా.ష.శర్మ: తప్పకుండా.. బ్రతికే ఉంటుంది. ప్రతి దశలోనూ..కొత్త కొత్త ప్రక్రియలు రావడం మమూలే కదా. అంత మాత్రాన పాత పద్యం మూల పడినట్టు కాదు.(నాకు శర్మ గారు రాసిన "రామ చంద్ర ప్రభూ.." అన్న శతకాన్ని బహూకరించి హామీ ఇచ్చారు)చాలా సంతోషం స్వామీ..శెలవు. నమస్కారము"
ఆయన ఆశీస్సులు తీసుకుని "రీ-చార్జి" అయి బయటకు వచ్చాను.

15, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆధునిక సాహిత్య నిర్మాత- వీరేశలింగం పంతులు...

ఈ మధ్య కార్యాలయపనుల వత్తిడి వల్ల నేను బ్లాగు పోస్టులు చెయ్యలేకపోయాను. తెలుగు పొయిట్రీ అనే సైటు లో ఉన్న వీరేశలింగం గారి గురించిన వ్యాసం ఆకట్టుకొంది. మీతో పంచుకోవలని అనిపించింది. చదవండి.

వీరేశలింగం పంతులు బహు యోజన శాఖా సంయుతమయిన వటవృక్షం వంటివారు. ఆంధ్ర దేశమున, ఆధునిక చరిత్రయందు వారి స్థానము ఎంతో విశిష్టమయినది.. వీరితోనే ఆధునిక యుగం ప్రారంభమయిందని చెప్పుకోవచ్చును.. వీరికి పూర్వమే ఆయా సాహిత్య ప్రక్రియలు తెలుగునా వెలయుటకు శ్రీకారం చుట్టిన మహనీయులు కొందరున్నను ఒక ఉద్యమము వలె ఆయా రంగాములందు కృషి చేసిన మేధావి వీరేశలింగం పంతులు గారే... ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటికి స్థితిని, ప్రాచుర్యమును కల్పించిన వారు వీరేశలింగం...
వీరేశలింగం పంతులు పున్నమ్మ,సుబ్బారాయుడు, దంపతులకు 1848 ఏప్రిల్ 16 న జన్మించారు.. వీరి విద్యాభ్యాసం వీధి బడిలోనే జరిగింది.. 1861 లో రాజ్యాలక్ష్మమ్మ గారితో వివాహమయింది.. కేశవ చంద్రసేన్, ఆత్మురి లక్ష్మి నృశింహం గార్ల ఉపన్యాసాలు, భోదనలు వల్ల కందుకూరి బ్రహ్మ మత ప్రభావితులయ్యారు.. 1868 -69 కాలంలోనే రెండు శతకాలు రచించారు. 1870 లో సర్వ కళాశాల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై అదే సంవత్సరంలో శుద్ధాంధ్ర నిరోష్త్య నిర్వచన నైషధం రచించారు.. 1871 లో రాజమహేంద్రవరం దొరతనం వారి మండల పాటశాలలో సహాయోపాధ్యాయ పదవిలో నియమించపడ్డారు..ఆ తర్వాత కోరంగిలో ఇంగ్లిషు పాటశాలకి ప్రదానోపాధ్యాలుగా పనిచేసారు..
కందుకూరి వారు తెలుగులోకి ఆధునిక ప్రక్రియలలో చాలా వరకు 'నేనే మొదట రచించితి ' అని స్వీయ చరిత్రలో పేర్కొన్నారు.. తొలి నాటకం, తొలి ప్రహసనం, తొలి వచన ప్రభందం, తొలి కవుల చరిత్ర, తొలి శాస్త్రీయ గ్రందాల నిభందనం- కందుకూరి రాసినట్లు తెలుస్తున్నా అంతకుముందే నాటకరచన, వచన ప్రభంద రచన లేకపోలేదు.. అయితే వివిధ ప్రక్రియల్ని చేపట్టి వాటికి ప్రాధాన్యాన్ని, ప్రాచుర్యాన్ని, కలిగించింది కందుకూరి మాత్రమే..ఆ ధృక్పదంతో ఆధునిక సాహిత్య నిర్మాతగా పేర్కొనడం సమంజసమే...
''తిగకొటికలదాయా తెల్లయేరున్నరాయా
సెగకను గల దంతా చేదు గొన్నట్టి జంటా
సొగసుల తలకట్టా, సూడులంగొట్టు దిట్టా
జిగియర చెలికాడా చిలకరా రౌతుసూడా ''
1870 వ సంవత్సరం ప్రాంతంలో చిత్ర కవిత్వంతో, సృన్గారంతో 'రసిక జన రంజనం' అనే ప్రభందం రచించారు. తర్వాత స్వీయ చరిత్రలో అటువంటివి రచించడం సరికాదని కాలక్రమేణా మానేసానని పేర్కొన్నారు..
నాటకరచన లో దృశ్యకావ్య ప్రధాన ప్రయోజనమయిన 'ప్రదర్శన' కి ప్రాధాన్యం ఇచ్చిన నాటకాన్ని రచించడంలో కందుకూరే ప్రధములు.. 1880 లో పంతులు 'ది కామెడి ఆఫ్ ఎర్రర్స్ ' నాటకాన్ని ''చమత్కార రత్నావళి ' అనే సంస్కృత రుపకానువాదం కూడా చేసారు..పౌరాణిక ఇతివృత్తంతో దక్షిణ గోగ్రహం, 'సత్య హరిశ్చంద్ర' అనే నాటకాన్ని రచించారు.మాళవికాగ్ని మిత్రం మొదలైన పన్నెండు నాటకాలలో బ్రమ్హ వివాహం, స్త్రీ పునర్వివాహం, సభా నాటకం, వంటి సాంఘిక రూపకాలు ఉన్నాయి.. అసంపూర్ణంగా రాసిన నాటకాలన్ లెక్కిస్తే మొత్తం దాదాపు ఇరవై నాటకాలు రచించినట్లు రమాపతిరావు గారు పేర్కొన్నారు..
నవలా రచనలో కందుకూరి వీరేశలింగం ప్రప్రధములని చాలామంది అభిప్రాయం.. .. నరహరి గోపాల కృష్ణమశెట్టి రచించిన ' శ్రీ రంగ రాజ చరిత్రము' తొలి తెలుగు నవల అని కొందరి అభిప్రాయం. కానీ వీరేశలింగం రచనలపై పరిశోదన చేసిన అక్కిరాజు రమాపతిరావు తొలి సాంఘిక నవల '' రాజశేఖర చరిత్ర'' అని సోదాహరణంగా తులనాత్మకంగా వివరించారు. పంతులుగారు నవలలు ;
1 రాజశేఖర చరిత్ర
2 సత్యరాజా పుర్వదేశ యాత్రలు,
3 . సత్యవతీ చరిత్రము
4 . చంద్రమతి చరిత్రము.
ఇందులో మొదటి రెండు నవలలు పురుషుల్ని దృష్టిలో పెట్టుకుని రాయగా, తర్వాతి రెండు నవలలు స్త్రీలను దృష్టిలో ఉంచుకుని రాసారు...
ప్రహసనాలు:- తెలుగులో ప్రహసనాలు కన్డుకురివారే ఆద్యులు.ఆంగ్ల సాహిత్య ప్రభావంవల్ల రాజకీయ దురాచారాలను వినోదకరంగా, సంభాషనాత్మకంగా , వివరించి మాన్పించాలనే సంఘ సంస్కరణ దృష్టి వల్ల కందుకూరి ప్రహసనాలు రచించారు... చాలావరకు ప్రహసనాలు 'వివేక వర్దిని' పత్రికలో ప్రచురితమయ్యాయి.. ' పెళ్లి తర్వాత పెద్ద పెళ్లి'' , లోకోత్తర వివాహము'. అనే ప్రహసనాలలో వేస్యభిమానం, చాదస్తపు ఆచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్థం, అనేవి అత్యంత సహజంగా వ్యంగ్య వైభవంతో చిత్రీకరించా పడ్డాయి.. అంతే కాకుండా 'వినోద తరంగిణి' లో వ్రుద్హ వివాహం వల్ల నష్టాలు వివరించపడ్డాయి.. అపూర్వ బ్రహ్మ చర్య ప్రహసనం, విచిత్ర వివాహ ప్రహసనం' మహా భాధిర ప్రహసనం, మొదలైనవి ఆంగ్లంలో 'farce' లు ఆధారంగా రచించబడ్డాయి.. వీరి తర్వాత ప్రహసనాల పరంపరను చిలకమర్తివారు కొనసాగించారు...
కధారచన పంతులుగారు మహిలాభ్యుదయంకోసం చేపట్టారు.. స్త్రీ విద్యని ప్రోత్సహించడానికి సాంఘిక దురాచారాల్ని తెలియజేయడానికి 'నీతి కధలు' గా రచించారనిపిస్తుంది.. స్త్రీల పత్రిక 'సతీ హితబోధిని' నడుపుతూ ఈ కధల్ని అందులో ప్రచురించేవారు.. స్త్రీలకోసం, బాలబాలికల కోసం నీతి భోధ ప్రధానంగా '' నీతి కదా మంజరి'' చిత్ర పటాలతో రెండు భాగాలుగా ప్రచురించారు.. మొత్తం 158 కధలతో ప్రతి కధ చివర ఒక నీతి పద్యంతో మనోహరంగా రచించాబదినట్లు విమర్శకులు ప్రశంసించారు
వ్యాసరచన విషయంలో పంతులుగారు ఉపన్యాసము, వ్యాసములను, పదములను, సమానార్ధకములుగాను.,పర్యాయ పదములుగాను, గ్రహించిరనుట ఉదాహరణములు చుపవచ్చును. ప్రత్యేక సమావేశములందు గాని, ప్రార్ధనా సమాజమునందు కానీ ,ఉపన్యసించిన విషయములనే గాక, వివిధ విషయములపై రచించిన వ్యాసములను కూడా పంతులు ఉపన్యాసములుగానే వ్యవహరించిరి'' కందుకూరి వారు వివిధ అంశాలపై రచించిన వ్యాసాలూ దాదాపు నూట తొంబై దాకా ఉన్నాయి.. సత్యవాదిని, వివేకవర్ధిని, సతీహిత బోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా, మొదలైన పర్త్రికాలలో ప్రచురింపబడి తర్వాత సంపుటాలుగా ప్రచురింప పడ్డాయి.. ఇంతే కాకుండా పంతులుగారు స్వీయ చరిత్ర, కూడా ప్రప్రధమంగానే రచించుకుని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు.
ఆరుద్ర గారు అన్నట్లు '' అదే౦ చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్టం చేసి దేశాభివ్రుద్ధిని, భాషాభివృద్ధిని,సాధించిన మనోబల భీములలో పంతులు గారు ప్రప్రధములు.. రెండోవారు గురుజాదవారు...ఇటువంటి ఉజ్వల చరిత్రుడిని ఈ బిరుదుతో వర్ణించినా అది సమగ్రమే అవుతుంది.. వీరు అభినవాంధ్రకు 'ఆధ్యబ్రహ్మ"

26, ఆగస్టు 2010, గురువారం

పురాణాలు

తెలుగు దనం వారికి కృతజ్ఞలతో.... ఈ కింద వారి సైటు లో ఇచ్చిన విశేషాలు ఇస్తున్నాను.
పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి. పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. మన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ ప్రబంధాలన్నీ పురాణాలలోంచే ముడి సరుకుని తీసుకున్నాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామక్రుష్ణుడు తన పాండురంగ మహాత్యానికి స్కాంద పురాణమే ఆధారమన్నాడు. రాయల వారు అముక్తమాల్యదలోని కొన్ని కథలను విష్ణు పురాణం నుంచి తీసుకున్నాడు. మానవ జీవితానికి కావలసిన శాస్త్ర విషయాలను పురాణాలలో మన ఆదిమ ఋషులు చేర్చేవారు. ఋషి ప్రోక్తాలు కాబట్టే పురాణాలను కూడా వేదాలలాగే ప్రమాణద్రుష్టితో చూసేవారు. నిజానికి మనకు వేదకాలంలో కూడా పురాణ సాహిత్యం ఉంది. అధర్వ వేదం పురాణాన్ని పేర్కొంది. ఉపనిషత్తులు కూడా పురాణ ప్రాముఖ్యాన్ని శ్లాఘించాయి. వేద కాలం నాటి పురాణ సమ్హితలో 4 వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి. అవి నేటికి పెరిగీ పెరిగీ కొన్ని లక్షల స్లోకాలుగా పరిణామం చెందాయి. 18 మహా పురాణాలలోని శ్లోకాలు 4,11,000 అని లెక్కతేలుతున్నాయి. ఉప పురాణాల శ్లోక సంఖ్య అంచనా కట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు. సిద్ధాంతాల ఘాటునుబట్టి పురాణాలను సాత్విక, తామస, రాజస పురాణాలని 3 గుణాలవారీగా వర్గీకరించవచ్చు. పురాణంలోని ప్రతి ఒక్క కథకూ ఫలశ్రుతి చెప్పారు. ఫలానా ఫలం కావాలంటే ఫలానా నోము నోచమన్నారు. ప్రతి పురాణాన్నీ వ్యాసుడు వ్రాస్తే దాన్ని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహా మునులకు చెప్పాడు. అయితే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పంలో పుడుతుంది. కల్పమంటే బ్రహ్మ దినం. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మకల్పం అన్నమాట. విశ్వము యొక్క సృష్టి స్ధితి లయములు, రాజవంశములు మున్నగు వాని చరిత్రములను పురాణములు వివరించును. మరియు భగవంతు డొనర్చు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణములను, మనుజులు పాటింపవలసిన ధర్మములను, ఆధ్యాత్మిక సాధనలను పురాణములు ప్రబోధించుచున్నవి. పవిత్ర క్షేత్రములు, తీర్ధస్ధలములు మున్నగువాని మహత్యములను గూడ పురాణములలో వర్ణింపబడినవి. శబ్దప్రధానములైన వేదములు ఏ విషయములను ప్రభువువలె శాసించునో ఆ విషయములనే అర్ధ ప్రధానములైన పురాణములు మిత్రుని వలె కథలద్వారా మనకు తెలియపరచును. అందువలన హిందూ సాహిత్యములో పురాణములు మిక్కిలి ప్రధానములై యున్నవి.
అష్టాదశ పురాణాలు
మత్స్య పురాణము
మార్కండేయ పురాణము
భాగవత పురాణము
భవిష్య పురాణము
బ్రహ్మ పురాణము
బ్రహ్మాండ పురాణము
బ్రహ్మ వైవర్త పురాణము
వరాహ పురాణము
వామన పురాణము
వాయు పురాణము
విష్ణు పురాణము
అగ్ని పురాణము
నారద పురాణము
స్కంద పురాణము
లింగ పురాణము
గరుడ పురాణము
కూర్మ పురాణము
పద్మ పురాణము

1.మత్స్య పురాణము
దీనిలో 1400 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడినవి.
2.మార్కండేయ పురాణము
ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హొమము, శతచండీ, సహస్ర చండీ హొమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే.
3.భాగవత పురాణము
దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి.
4.భవిష్య పురాణము
దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.
5.బ్రహ్మపురాణము
దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గూర్చి వివరించబడినవి.
6.బ్రహ్మండ పురాణము
దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.
7.బ్రహ్మ వైవర్త పురాణము
దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడింది.
8.వరాహ పురాణము
దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతార మెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు. పుణ్యక్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.
9.వామన పురాణము
దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము - ఋతు వర్ణనలు వివరించబడినవి.
10. వాయు పురాణము
దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము
ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహత్మ్యము, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.
12. అగ్ని పురాణము
దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.
13. నారద పురాణము
ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివస్తోత్రము) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.
14.స్కంద పురాణము
దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు)చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహ్మొత్తర ఖండము (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహకాల మహత్మ్యము) మొదలగునవి కలవు.
15.లింగ పురాణము
ఇది శివుని ఉపదేశములు, లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతోపాటు వ్రతములు. ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.
16.గరుడ పురాణము
ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహవిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ - నరక ప్రయాణములు తెలుపబడినది.
17.కూర్మ పురాణము
ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నరసింహావతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.
18.పద్మపురాణము
ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్ధసారం - పఠనమహత్మ్యం, గంగామహత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహత్మ్యం, పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలుయజేయబడింది.
మరొక్కమారు తెలుగు దనం వారికి కృతజ్ఞలు.

23, ఆగస్టు 2010, సోమవారం

చతుర్విధ కంద పద్యాలు - పద్య గారడీలు.

కంద పద్యం రాయడమే కష్తం అనుకుంటారు అందరూ.. కానీ కందం తో సాము గరిడీలు (వ్యాయామాలు), గారడీలు చేసిన వాళ్ళను చూస్తే ఒకింత ఆశ్చర్యం విస్మయం కలుగక మానదు. నన్నెచోడుడు ఆ విధమైన గారడీలు ఎన్నో చేసాడు. ఒక పద్యం ద్వారా మీకు ఆ గారడీ ఎమిటొ మనవి చేసుకుంటాను.

చతుర్విధ కందం అంటె కవి ఒక కంద పద్యాన్ని రాస్తాడు. దానిలో నుండి ఇంకో మూడు కంద పద్యాలను ఏ అక్షరమూ మార్చకుండా తయారు చేసుకోవాలి.అలా చేయ్యలంటే కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. మొదటి కంద పద్యం లోని రొండవ చరణం లోని రొండవ గణాన్ని తీసుకుని అక్కడనుండి చదివితే కొత్త పద్యం రావాలి. ఈ కొత్త పద్యం రొండవ గణాన్ని తీసుకుని అక్కడనుండి చదివితే మరలా ఇంకో కొత్త పద్యం రావాలి.
కుమార సంభవం లోని ఒక పద్యం చూద్దాము.

మొదటిది:సుజ్ఞాన యోగ తత్వవి - ధిజ్ఞుల్ భవ భందనముల ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక - ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచన భావన దవులన్.

రెండవది:రెండవ చరణం "భవభం" అనే అక్షరాలతో మొదలైంది.
భవ భందనముల ద్రెంచుచు - భువిలో నజ్ఞానపదము బొందక ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచన భావన - దవులన్ సుజ్ఞాన యోగ తత్వవిధిజ్ఞుల్.

చూసారా ఎంత తమాషానో: మొదట్లో ఉన్న పాదం మళ్ళీ చివరలో తగిలించేసాడు.
ఇంకా ఉంది ఈ గారడీ:

మూడవది: అజ్ఞాన అనే పదం తో మొదలవుతుంది.
అజ్ఞాన పదము బొందక - ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచన భావన దవులన్సుజ్ఞాన యోగ తత్వవి - ధిజ్ఞుల్ భవ భందనముల ద్రెంచుచు భువిలో.
మళ్ళీ ఇంకో కందం ఇలాగే:
శివుగొల్తు రచన భావన-దవులన్ సుజ్ఞాన యోగ తత్వవిధిజ్ఞుల్ భవ భందనముల ద్రెంచుచు - భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్.
ఆది కవి అన్న బిరుదు లేకుండా పోయినా నన్నె చోడుడు మంచి మొనగాడు. ఆద్యుడు. కొన్నిటికి ఒరవడి పెట్టాడు. ప్రభందాలలో: ఇష్త దేవతా ప్రార్ధన, పూర్వ కవిస్తుతి, కుకవి నింద, గ్రంధ కర్త స్వవిషయాలు, కృతిపతి వర్ణన, షష్త్యంతాలు మొదలైనవాటికి ఆద్యుడు. ఈయన ఒరవడి తర్వాతి తరాల వారికి మార్గ దర్శకమైంది.
నన్నె చోడుడు మొదలెట్టిన విధానాలు తర్వాతి కాల కవులు విపరీతంగా అనుసరించడం తో వెర్రి వెయ్యి విధాలు అన్న రీతికి వచ్చింది. తర్వాతి కాలలో వచ్చిన చిత్ర కవిత్వం వింత గానే ఉంది. వేలం వెర్రీ అయింది.
ఇలాంటి చిత్ర కవిత్వ ప్రక్రియలను చేసిన గ్రంధాల పట్టిక చాలా పెద్దగానే ఉంది. మొత్తం ముప్పై నాలుగు గ్రంధాలు తేలాయి లెక్కకు. ఐతే చిత్ర కవిత్వం చిత్రాల కోసమేనా? నేతి బీర కాయలో నెయ్యి ఎంత వుందో వెదికినట్టు ఈ చిత్ర కవిత్వాలలో కవిత్వం కోసం వెదకడం కూడానా!

కంద పద్యము

కంద పద్యము ఎలా రాయలో చూసాము. ఇప్పుడు ఒక పద్యం గణవిభజన చేసి చూద్దాము.
బలవంతుల సొత్తాయెను స్తల జల తరునిధులు వసుధ సామ్మన్యులకున్.
ఇవి ఒకటి రొండు పద్య పాదాలు.
మొత్తం 8 గణాలు ఉండాలి కదా! చూద్దాము.
మొదటి పాదం - మూడు గణాలు ఉండాలి.
బలవం - సగణం
తులసొ - సగణం
త్తాయెను - .భగణం
చతుర్మాత్రా గణాలలోవి వచ్చాయి కదా! (భ, జ, స, నల, గగలు)
ఒకటి, మూడు, ఐదు, యేడు గణాలలో "జ" గణం ఉండ రాదు.ఒకటి, మూడు గణలలొ జగణం లేదు.
ఇక రొండో పాదం చూద్దాము.
స్తలజల - నలము తరునిధు - నలము లువసుధ - నలము సామా - గగము న్యులకున్ - సగణం
మిగతా నియమాలు చూద్దాము.ఒకటి, మూడు, ఐదు, యేడు గణాలలో "జ" గణం ఉండ రాదు.
ఐదు, యేడు లలో జగణం లేదు.
ఆరవ గణం జగణం లేక నలము కానీ ఉండాలిఆరవ గణం నలము ఉంది.ఎనిమిదవ గణం చివర గురువు ఉండాలి.ఎనిమిదవ గణం "కున్" కనుక గురువు, సరిపోయింది.
రొండవ పాదం లో మొదటి గణమైన "స్త" కు నాల్గవ గణమం లో మొదటి అక్షరం "స" కు యతి మైత్రి సరిపోయింది.
పాదాలలో ప్రాస నియమము "ల" సరిపోయింది.
ఇదే విధంగా కొన్ని పద్యాలు చూసి గణవిభజన చేసి, తర్వాత రాయడంప్రారంభించండి. స్వస్తి.

4, ఆగస్టు 2010, బుధవారం

కంద పద్యము.

మనం ఇంతకు ముందు నేర్చుకున్న పద్యాలన్నీ ఒక ఎత్తైతే, కంద పద్యం ఒక యెత్తు. కంద పద్యానికి నియమాలు ఎక్కువ. అందుకే కందం రాసిన వాడే కవి, పందిని (ముళ్ళ పంది/అడవి పంది) ని బొడిచిన వాడే బంటు అంటారు. ముఖ్యం గా శతకాలు ఈ చందస్సు లో ఉంటాయి. దీని నియమాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొవలసిన అవసరం ఉంది.

1. ఈ పద్యానికి చతుర్మాత్ర గణాలు మాత్రమే వాడాలి.
2. 1, 3 పాదాలలో మూడేసి గణాలూ..2, 4 పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి.
3. అంటే 1, 2 పాదాలలో 8 గణాలు, 3, 4 పాదాలలో 8 గణాలూ ఉంటాయి.
4. 2 పాదాలను ఒక "సెట్టు" గా (అంటే మొదటి 2 పాదాలలో ఉన్న 8 గణాలూ) భావించాలి.
5. 1, 3, 5, 7 గణాలలో "జగణం" ఉండరాదు.
6. 6 వ గణం లో తప్పనిసరిగా "జగణం" లేక "నలము" ఉండాలి.
7. 8 వ గణం లో చివర తప్పనిసరిగా గురువు ఉండాలి.
8. మొదటి పాదం గురువు తో మొదలైతే, అన్ని పాదాలూ గురువు తో, మొదటిపాదం లఘువు తో మొదలైతే, అన్ని పాదాలూ లఘువు తో మొదలవ్వాలి.

9. 2,4 పాదాలలో యతి మైత్రి ఉంది. ఈ పాదాలలో, మొదటి గణం మొదటి అక్షరానికీ..నాల్గవ గణం మొదటి అక్షరానికీ ఈ నియమము ఉన్నది.
10. ప్రాస నియమము ఉన్నది.

దీన్ని గురించి చాలా వివరంగా తెలుసుకోవలసి ఉన్నది.

ప్రస్తుతానికి చతుర్మాత్రా గణాలు అంటే ఎమిటో చెప్పి ముగిస్తాను.

అ. భగణం UII
ఆ. జగణం IUI
ఇ. సగణం IIU
ఈ.నలము IIII
ఉ.గగము. UU

పై ఐదు గణాలను మాత్రమే కంద పద్యం రాయడానికి ఉపయోగించాలి.

తరువాటి పాఠం లొ మరిన్ని వివరాలను చూద్దాము. స్వస్తి.

31, జులై 2010, శనివారం

తత్సమము, తత్భవము, దేశ్యము, గ్రామ్యము.

౧.తత్సమము: సంస్కృత, ప్రాకృత తుల్యమైన బాష తత్సమము అనబడును.
ఇంకా వివరంగా చెప్పాలంటె, సంస్కృత శబ్దముల యొక్క, ప్రాకృత శబ్దముల యొక్క, దీర్ఘ విసార్గాదులను శాస్త్ర సమ్మతముగా మార్చి, లింగ బేదముల ను బట్టి, విభక్తులు చేర్చడం తత్సమాలని ఆర్యోక్తి.
ఉదా: "రామః" అని సంస్కృతం లో ఉన్న మాటను "డు" చేర్చి... రాముడు గా వాడడం.
"అగ్గీ" అని ప్రాకృతం లో ఉన్న మాటను "అగ్గి" గా మార్చుకోడం. మొదలైనవి.
౨. తత్భవము: సంస్కృత ప్రాకృత భావమగు బాష తత్భవము అంటారు.
వివరంగా చెప్పాలంటే..ఇది వర్ణ లోప, వర్ణాగమ, వర్ణ ఆదేస, వర్ణ వ్యత్యమములు అను నాలుగు విధములుగ మార్పు చెంది శాస్త్ర ప్రకారంగా ఆంద్ర బాష లోకి రావడం అన్నమాట.
ఇంకా వివరంగా ఉదాహరణ లో చూద్దాము.
౧. వర్ణ లోపము: తామరసం - తామర (ఇందులో సకార లోపం జరిగింది)
౨. వర్ణ ఆగమము: రదః - ఇందులో అకారం చేరి "అరదము" గా మారింది.
౩.వర్ణ ఆదేశము: అంగణం. అనే మాట - అంకణము గా మారింది. ఇందులో గకారం ను త్రోసివేసి క కారం వచ్చింది.
౪. వర్ణ వ్యత్యయము: శుచి: అనే మాట చిచ్చు గా మారింది. సంస్కృతమున అంత్యమగు చి వర్ణము ఆంధ్ర పదమున ఆద్యపదముగ మారింది.
3. దేశ్యము: త్రిలింగ దేస్య వ్యవహారంబగు బాషశ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరము, వీని మధ్యన ఉండే ప్రదేశమే త్రిలింగ దేశము
యిది మరలా రొండు విధాలు1. ఆంధ్ర దేశ్యములు: ఊరు, పేరు, ఇల్లు, ముల్లు మొదలైనవి.
అన్య దేశ్యాలు: బిడారు, రోడ్డు. మొదలైన ఇతర దేశ పదాలు.
గ్రామ్యము: లక్షణ విరుద్ధమగు బాష:
వస్తాడు, తెస్తాడు.

అయితే అనింద్య గ్రామ్య బాష కూడా ఉంది. జీవగర్ర, కపిల కన్నులు మొదలైనవి. పెద్దలు గ్రంధాలలో ఉపయోగించిన పదాలను అనింద్య గ్రామ్యాలు గా భావించవచ్చు.
ఇంకా వివరంగా వచ్చే టపాలలో చూద్దాము.

23, జులై 2010, శుక్రవారం

సీస పద్యం విశేషాలు

సీస పద్యం గురించి మీకు కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు తెలియజేయలనుకుంటున్నాను. సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (క్రీ.శ.850 సం!!) లో చూసారు. అంతకు ముందే ఎన్నో సవత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. అయితే మనకు తెలిసింది మాత్రం 1160 సంవత్సరాల క్రితం. ఈ పద్యం చాల వరకూ శిధిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఇచ్చారు. చూద్దాము.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం లో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఎ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా.

అలాగే ప్రాచీన కాలం లో ఉన్న పద్యాలను (అంటే అవి ఆవిష్కరింప బడ్డ సంవత్సరాల ద్వారా) మనకు దొరికిన శిలా శాసనాల ద్వారా వాటిని చూద్దాము.
తరువోజ - పండరంగుని అద్దంకి శాసనం - క్రీ.శ 848
ఆట వెలది - గునగ విజయాదిత్యుని ధర్మవరం - క్రీ.శ 850
తేట గీతి - గుణగ విజయాదిత్యుని ధర్మ వరం శాసనం - క్రీ.శ ౮౪౮
మధ్యాకర - బెజవాడ యుద్ధ మల్లుని శాసనం - క్రీ.శ. ౮౮౫
కందం - జిన వల్లభుని కుర్కియాల శాసనం - క్రీ.శ. ౯౪౧
చంపకమాల - గుణగ విజయాదిత్యుని సాతలూరి శాసనం - క్రీ.శ ౮౪౮
ఉత్పలమాల - విరియాల కామసాని శాసనం - క్రీ.శ.1000 ప్రాంతం లో.
మత్తేభం - సర్వదేవుని ఆది పురాణం - క్రీ.శ. 953.
రగడ - రాజ రాజు కోరుమిల్లి శాసనం - క్రీ.శ 1022.
పై పట్టిక ద్వారా ముఖ్యమైన చందస్సులు ఆది నుంచీ ఉన్నయన్న విషయం తెలుస్తోంది. వచన రచన అనేది లేక పొయినా, చక్కని పద్య రచన కు ఆనాడే బీజం పడిందన్న విషయం బోధ పడుతోంది. వచన రచన కేవలం శాసనల్లో మాత్రమే చూడగలం.
నన్నయార్యునికి ముందే కవులు వున్నారు. దానికి సాక్ష్యం ఉంది. ఐతే అవి సమగ్రం గా లేవు. సంపూర్ణ కావ్యాలేవీ దొరకలేదు. సర్వదేవుదనే కవి ఆది పురాణం రాసాడని అంటారు. ఆది పురాణం దొరికితే సర్వదేవుడు ఆది కవి లేకపోతే ఆది కవి అభ్యర్ధి గా మిగిలి పోతాడని ఆరుద్ర అన్నారు. ఏది ఏమైనా మనకు ఆనాడు పద్యాలను గ్రంధస్తం చేయక పోవడం వలన కానీ మరి ఇతర కారణాల వాళ్ళ కానీ, చారిత్రక విశేషాలు లభింపక పోవడం తెలుగు జాతికి తీరని లోటు. కాదంటారా!!!! స్వస్తి.

22, జులై 2010, గురువారం

తెలుగు భాష చరిత్ర.

నేను ఇటీవల తెలుగు బ్లాగులు చూస్తూ ఉంటె, "వసంత మాలిగై" అనే బ్లాగు లో ఉన్న ఆంధ్రుల చరిత్ర వ్యాసం నన్ను బాగా ఆకర్షించింది. మీతో పంచుకుందామని మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను. చదివి ఆనందించండి.

తెలుగు,భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు.తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.

తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు వెళ్తే తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినది.
ఆంధ్రులగురించి చెప్పిన పద్యములలో ఒక పద్యం
"పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"
(ఈ విషయం నేను ఇంతకూ ముందే నా బ్లాగు లో ఇచ్చాను)
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.
అజ్ఞాత యుగము: క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:
ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం లబ్ధ సారస్వతము: క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం క్రీ.పూ. 28 ముందు:ఆంద్రదేశం అనే పదం ఎలా వచ్చిందంటే: ఈ కాలంలో "ఆంధ్ర" అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలలో ఉంటున్నది గాని "తెలుగు" అనే పదం ఎక్కడా లభించడంలేదు. అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కాని భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు.
అయితే ఆంధ్రులు, తెలుగులు కలసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపు దిద్దుకొన్నది గనుక "ఆంధ్ర దేశం" ప్రస్తావననే కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు. తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణా గోదావరీ ప్రాంతం తెలుగు దేశమని పిలువబడేదని,తమిళ,మళయాళ,కన్నడ భాషలలాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. క్రమంగా మిగిలినవానికి భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటివారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏమైనా తెలుగు భాష తక్కిన (మాతృక) భాషలనుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కాలేదు.
మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతోంది.
తెలుగుబాష వ్యవాహారం :భాషనుబట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాఙ్మయం పుట్టదు. ఇలా చూస్తే క్రీ.శ. 1000 ప్రాంతంలో పరిణత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాలనుండి వ్యవహారంలో ఉండి ఉండాలి. భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనినిని ఉపయోగించాలని వ్రాశాడు. పై కారణాల వలన "ఆంధ్ర భాష" లేదా "తెలుగు భాష" క్రీ.పూ. నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది
"తెలుగు భాష వయస్సెంత?" అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు కాని కొంతమంది రచయితలు తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశారు.
క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు (అజ్ఞాత యుగ0):క్రీ.పూ. 500 - క్రీ..త. 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మతోన్నతులు, పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్ర కారుల అభిప్రాయం.
ఈ కాలానికి సబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
***ఇప్పటికి తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. "లిపికి ముందే సారస్వతము ఉండవచ్చును గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానములో, మోహపుం గాసట బీసట యల్లికలో యై శృతి పరంపరాగతములై యుండును. లిపి మూలమున వాఙ్మయము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందునను తెనుగున వాఙ్మయము లిపి నిర్మాణానంతరమే ఆరంభమై యుండును". కనుక ఈ కాలంలో తెలుగు సారస్వతం లేదనే భావించవచ్చు.
***శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చు.
***బౌద్ధ జైన మతాలు విలసిల్లిన కాలలో ఎంతో కొంత సాహిత్యం లిఖితంగా కాని, మౌఖికంగా గాని ఉండి ఉండాలి. అయితే తరువాత విజృంభించిన శంకరవాదము, వీరశైనం కాలంలో మతోద్రేకాల కారణంగా బౌద్ధ జైన మత సంస్థల నాశనంతో పాటు ఎంతో సారస్వతం కూడా దగ్ధమైయుండవచ్చును. మతోద్రేకము ఎంతకైనా దారి తీయగలదు. కాకుంటే నన్నయ భారతం వంటి ఉద్గ్రంధం ఒక్కమారు ఆకసంనుండి ఊడిపడదు కదా? జైనపండితులు ఆ సమయంలో కన్నడ దేశానికి తరలిపోయి ఉండవచ్చు.
***ప్రాచీనాంధ్ర వాఙ్మయం లభించకున్నాగాని పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి మొదలైన తెలుగువారు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలను బట్టి చూస్తే తెలుగు భాషలో సాహిత్య పరంపర ఉండదనుకోవడం అసహజంగా కనిపిస్తుంది.
ఆంధ్రులు కవులుగా నున్నయెడల ఆంధ్రమున కవిత్వము లేదనుట ఆశ్చర్యం. అయితే అప్పటిమత ఘర్షణలలో "విజయం" సాధించిన స్థానిక బ్రాహ్మణులకు సంస్కృతమే ఆదరణీయంగా ఉండేది గనుక తెలుగు లిఖిత సాహిత్యం పూర్తిగా నిరాదరణకు గురై ఉండవచ్చు.
మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదములు:
""అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం""అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ "" పూర్వాంధ్రభాష (తెళుగు) లక్షణాలు ఇవి కావచ్చు: 1.ఆర్యావర్తంలో సామ్రాజ్యం స్థాపించి సప్తశతివంటి ప్రాకృత గ్రంధాలు వ్రాసిన "కర్ల తెల్లంగు" రాజుల మాతృభాష కనుక శుద్ధ సంస్కృతంకంటే ప్రాకృత పదాలే ఎక్కువగా ఉండవచ్చును. 2.అప్పటికి బౌద్ధ జైన ప్రాబల్యమే తెలుగు సీమలో అధికం గనుక సారస్వతం కూడా వారిదే అయిఉండవచ్చును. 3.అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు. క్రీ.త. 500 నుండి 1000 వరకు (శాసనాధారాలు): సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు. వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో, లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు. కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది.కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశొకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి. తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు.నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియ జేస్తాను. సెలవు.

20, జులై 2010, మంగళవారం

సీస పద్యం గణ విభజన ఒకటి చేసి చూడాలి కదా! ఈ దిగువ ఇస్తున్నాను చూడండి.
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

ఆహా ఎంత మంచి పద్యమో చూశారా!
దీనికి గణ విభజన చెయ్యాలి కదా!
ఒక సారి ఈ నియమాలు స్ఫురణ కు తెచ్చుకుందాము.
ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.దీని స్వరూపం ఇలా ఉంటుంది.
ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.
మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.
నల, నగ, సల, భ, ర, త లు. ఇంద్ర గణాలు.
గల లేక హ మరియూ న గణాలు సూర్య గణాలు
ఇవి ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉంటేనే మనం పద్యాల్ని సమర్దవంతం గా రాయగలము అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
మొదటగా పెద్ద పాదం చూద్దాము.
కమలాక్షు IIUI
నర్చించు UUI
కరములు IIII
రములు IIII
పైన పెద్ద పాదం లో సల, త, నల, నల వచ్చయి కదా..
చిన్న పాదము :

్రీనాధు UUI

ర్ణించు UUI

ిహ్వ UI

జిహ్వ UI

త, త, గల లేక హలం వరుసగా రొండు సార్లు వచ్చాయి కదా. రొండు పాదాలలో మొత్తం

ఆరు ఇంద్ర గణాలు, చివరలో రొండు సూర్య గణాలు ఉన్నాయి కదా!

ఇక యతి విషయం లో శ్రీ నాదు లో ని "శ్రీ" కి జిహ్వ లోని "జి" కి సరి పోయింది కదా.

ఇలాగే మిగతా పాదాల్ని గణవిభజన చేసి చూడండి. ఇవాల్టికి స్వస్తి.

19, జులై 2010, సోమవారం

తిట్టు కవిత్వం

తెలుగు దనం వారి సౌజన్యం తో తెలుగు లో తిట్టు కవిత్వం గురించి ఇస్తున్నాను.
లలిత కళలలో అత్యంత విశిష్టమైనది కవిత్వం. ఇది అనేక విధాలుగా రంజింపజేస్తుంది. ఆశుకవిత్వం, చిత్ర కవిత్వం, మధుర కవిత్వం, విస్తర కవిత్వం, శాస్త్ర కవిత్వం, తిట్టు కవిత్వం అను అనేక రూపాల్లో కవిత్వం చెప్పబడుతున్నది. వీటిలో తిట్టు కవిత్వం యొక్క స్థానం ప్రత్యేకమైనది. ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి ఆవిర్భవించిన మొట్టమొదటి కవిత్వం తిట్టు కవిత్వం కవిత్వమంటే ఆశ్చర్యం కలగకమానదు.
మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమ శ్శాశ్వతీ స్సమా:యత్క్రౌచ మిథునా దేక, మవధీ: కామ మోహితం"
క్రౌంచ మిధునములో నొకదానిని గూలనేసిన నిషాదుని చూసి వాల్మీకి తిట్టిన తిట్టు, శోకంతో బహిర్గతమైంది. దీనినే దూషణ కవిత, నిందాహేళన కవిత అని కూడా అంటారు. సాధారణంగా ఈ కవిత్వం ఆవేశపూరితంగా ఉంటుంది. తెలుగులో తిట్టు కవిత్వం చాటుపద్య రూపంగానూ, గ్రంధస్థ కుకవినిందాది రూపముగాను భాసిస్తున్నది. తిట్టుకవుల పద్యాలు చాలావరకు చాటువులుగానే ఉన్నాయి.
పల్లెల్లోనూ, పట్టణాలలోనూ కొందరు ముదుసళ్ళు అలవోకగా చెప్పే అనేక చాటుపద్యాల్లో తిట్టు కవిత్వం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. 12వ శతాబ్దానికి చెందిన వేములవాడ భీమకవి తిట్టు కవిత చెప్పడంలో దిట్ట. ఇతడు శ్రీనాధ కవిచే ప్రశంశించబడినవాడు. భీమన తిట్టు కవితలో తెలుగులో ఆదికవి.
"గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీత్రిప్పుడు బాపలందరును దిట్టిరి కావున నొక్కమారు నీయప్పములన్ని కప్పలయి యవ్నము సున్నముగాగ మారుచున్బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన్"
అని తనని ముండ కొడుకంటూ భోజనానికి రానివ్వని పెద్దని తిడుతూ ఆ భోజన పదార్ధాలను చూసి పద్యం చెప్పాడు. 13వ శతాబ్దానికి చెందిన ఖడ్గ తిక్కన యుద్ధ రంగమునుండి పారిపోయి ఇంటికి రావడంతో అతని భార్య చానమ్మ అతని స్నానానికి మంచం అడ్డుపెట్టి పసుపు ఉండ పెట్టడంతో ఇదేమిటని అడిగిన భర్తతో ఆమె ..
"పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపు నాయకులెల్లన్ముగురాడువారమైతిమి, వగపేటికి జలకమాడ వచ్చినచోటన్" అంది.
ఆ ఇల్లాలు చెప్పిన సమాధానం సుతిమెత్తని తిట్టు కవితగా లోక ప్రచారమైనది. స్ఫూర్తిదాయకమైనది కూడా.
వేములవాడ భీమకవి తరువాత తిట్టు కవిత్వంలో ఉద్దండత చూపిన వాడు 14-15 శతాబ్దాలకు చెందిన శ్రీనాధుడు. పల్నాటి సీమలో జొన్న కూడుతప్ప వరి అన్నం దొరకని పరిస్థితి ఏర్పడడంతో ....
"జొన్నకలి జొన్నయంబలి, జొన్నన్నము జొన్నపిసరు జొన్నలె తప్పన్సన్నన్నము సున్న సుమీ, పన్నుగ బల్నాటిసీమ ప్రజలందరికిన్" అని పరిహసించాడు.
పల్నాటి సీమలొనే త్రాగ నీరు లభించకపోవడంతో పరమశివుణ్ణి నిందిస్తూ...
"సిరిగల వానికి జెల్లును దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్దిరిపమున కిద్దరాండ్రీ, పరమేశా! గంగ విడువు, పార్వతిచాలున్" అన్నాడు.
శ్రీనాధుని తర్వాత 16వ శతాబ్దానికి చెందిన తెనాలి రామకృష్ణుడు అత్యంత సమర్ధుడైన తిట్టు కవి, చాటుకవి. ఇతడు హాస్య కవితా సామ్రాజ్యాధిపతి. వికటకవిగా ఈయన ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలానికీ చిరపరిచితుడు. రాయల వారి ఆస్థానమునకు వచ్చిన బట్టు కవి ఆస్థాన పండితుల సామర్ధ్యానికి పరీక్ష పెడుతూ ....
"కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్"
అని సమస్యనీయగా రామకృష్ణుడు వెంటనే ....
"గంజాయి త్రాగి తురకల సంజాతులగూడి కల్లు చవిగొన్నావా?లంజెల కొడకా! యెక్కడ, కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్" అని పూరించాడు. ఐతే రాయలవారు యిది సరియైన పూరణ పద్ధతి కాదని మందలించడంతో రామకృష్ణుడు "పెద్దనాది మహా కవులకు బట్టు కవి ఇటువంటి సమస్యనివ్వడంతో అట్లు పూరించితిని. వీనికీ పూరణమే సరియైనది" అని బదులిచాడు. వెంటనే రాయలు ఐతే ఆ సమస్య నేనే యిస్తే ఏవిధంగా పూరిస్తావు?" అనడంతో రామకృష్ణుడు....
"రంజనచెడి పాండవులరి, భంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా!సంజెయ! యేమని చెప్పుదు, గుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్"
అని పూరించి రాయల వారి అనుగ్రహాన్నీ, అభినందనలనూ పొందాడు.
ఈ కోవలోనే కాలము, కర్తృత్వము తెలీని తిట్టు పద్యం తప్పులెన్నువారి గూర్చినది...
"నక్కలు బొక్కలు వెదకును, నక్కరతో నూరబంది యగడిత వెదకున్కుక్కలు చెప్పులు వెదకును, దక్కడి నా లంజెకొడుకు తప్పే వెదకున్".
అబద్ధాలాడువాని గూర్చిన హేళనతో కూడిన పద్యం....
"ఆడినమాటలు దప్పిన, గాడిదకొడుకంచు దిట్టగా వినియయ్యో!వీడా నా కొక కొడుకని, గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!"
లోభిని గూర్చిన తిట్టు పద్యం ...
తిట్టిన రోసముంబడడు దీవనయిచ్చిన సంతసింప డాకట్టిడి లోభి కెంత యధికారము గల్గిననేమి? లేకయేబెట్టుగ నున్న నేమి? నడపీనుగుకున్ మణిభూషణంబులన్ బెట్టిన న్సరియె మెచ్చునొ నొచ్చునొ కాళికేశ్వరీ!"
తిట్టు కవిత్వంతోనే సంతృప్తి చెందని కొందరు కవులు తిట్టు గ్రంధాలను సైతం రచించి ఆ వాజ్ఙయముకు శాశ్వత స్థానాన్ని కల్పించారు. తిట్టు కావ్యాలకే అధిక్షేప కావ్యములని పేరు. ఇవి ఒక వ్యక్తి లేదా ఒక సంఘం యొకా దోషాలను యెత్తి చూపుతాయి. వీటిలో అధికంగా వచ్చినవి శతకాలు. పలు శతకాల్లో తిట్టు కవిత్వం కలదు. తెలుగు శతకాలాలొ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిన సుమతీ శతకంలో అనేక తిట్టు పద్యాలు కలవు.
"అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్య విద్య కోమలి (టి) నిజమున్బొల్లున దంచిన బియ్యము, తెల్లని కాకులుని లేవు తెలియర సుమతీ"
అనే పద్యం ఒక ఉదాహరణ మాత్రమే. వేమన తిట్టు పద్యాలలో ప్రముఖ స్థానం వహించాడనడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఇతని తిట్టు కవిత హాస్య గర్భితమై ఉంటుంది. "తలలు బోడులైనా తలపులు బోడులౌనా", "తల్లి శూద్రురాలు తానెట్లు బాపడు", "మంత్ర జలముకన్న మంగలి జలమెచ్చు" వంటి పద్యాలలో ఎంతో సందేశముంది. 17వ శతాబ్దికి చెందిన చౌడప్ప కవి తిట్టు కవిత్వంలో దిట్టగా పేరెన్నికగన్నవాడు. వేమన ఆటవెలదిలో ఏల అందెవేసిన చెయ్యో చౌడప్ప కందములో అంతటి ప్రతిభాశాలి. చౌడప్ప తన శతకములో బూతులు, శృంగారాల గురించిన అనేక పద్యాలు వ్రాశాడు. "పది నీతులు పది బూతులు, పది శృంగారములు గల్గు పద్యములు సభన్ జదివినవాడే యధికుడు....", "నీతులకేమి యొకించుక, బూతాడక దొరకు నవ్వు పుట్టదు" అని తన ఉద్దేశాన్ని బహిరంగంగా చాటాడు.
చౌడప్ప పద్యాలలో మచ్చుకు కొన్ని...
"ఇయ్యగ నిప్పించంగల, యయ్యలకేగాక మీసమందరికేలా,
రొయ్యకు లేదా బారెడు....""ముండల కొడుకుల సంపద,
దండులకెగాని దానధర్మములకు రాకుండు..."
"లంజెలు రాకుండిన గుడి రంజిల్లదు ప్రజల మనసు రాజిల్లదురాలంజెలనేల సృజించెనొ, కంజుకుడు...""దినము లోపల నుత్తమ,
దినమే తద్దినము నాటి తిండికి సమమే...""బూతని నగుదురు కడుతమ, తాతలు ముత్తాత మొదలు తరతరముల వా'రే తీరున జన్మించి రొ...."తిట్టు కవిత్వం, పద్యాల వలనే తిట్ల దండకం కూడా తెలుగులో ప్రసిద్ధమైంది.
అధిక్షేప కృతుల రచనలో కందుకూరి వీరేశలింగం గారు కూడా పేరెన్నికగన్నవారు. అనేక ప్రహసనాలను వీరు రచించారు. అలాగే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వేలూరి శివరామ శాస్త్రి, వసురాయ కవి, తదితరులు తిట్టు కవిత్వాన్ని అందించి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు. తిట్టు కవిత్వాన్ని తిరుపతి వేంకట కవులు సైతం చెప్పారు. తిట్టు కవిత సాధారణంగా ఆశు కవితయే. ఆశు కవితకు ఆవేశం సాధారణ లక్షణం కావున తిట్టు కవితలో కూడా ఆవేశం ఉండడం సహజం. తిట్టు కవిత నేడు కూడా లేకపోలేదు. ఐతే తెలుగులో ఉన్న తిట్టు కవిత మరి ఏ ఇతర భాషలోనూ లేదు. తిట్టు కవితను కవితా వినోదంగా భావిస్తే ఇది అధిక్షేపణీయం కాదు.

14, జులై 2010, బుధవారం

తెలుగు వ్యాకరణ గ్రంధాలు - ఒక పరిశీలన

తెలుగు భాష చరిత్ర గురించి అప్పుడప్పుడూ కొంచెం కొంచెం తెలుసుకోవడం ఆసక్తి దాయకంగా ఉంటుందని భావిస్తూ.. "తెలుగు లో వ్యాకరణ గ్రంధాలు" వాటి గురించి తెలుసుకుందాం. ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు పద్య రచనకు దోహదం కలిగిస్తాయి. మొదట ఛందో గ్రంధాలలోనే, అక్కడక్కడ వ్యాకరణ అంశాలను చర్చించడం కనపడుతుంది. మనకు లభించే ఛందో గ్రంధాల్లో " కవిజనాశ్రయము" మొదటిది. దీని కాలం వివాదాస్పదము అయినా..కేతన రచించిన "ఆంద్ర భాషా భూషణం" కంటే ప్రాచీనమైనదని చరిత్ర కారుల అభిప్రాయం. కవి ఎవరో కూడా తెలియ రాక పోవడం గమనించ దగ్గ విశేషం. దీనిలో దోషాదికారం అనే విషయం చెప్తూ.. విసంధి, దుస్సంధి, కుసంధి మొదలైన వ్యాకరణ విశేషాలు ఉదాహరణలతో తెలుప బడ్డాయి.

కేతన రాసిన "ఆంద్ర భాషా భూషణం" పద్య వ్యాకరణ గ్రంధం. ఇందులో ముఖ్యంగా వ్యాకరణ విశేషాలు తెలుపబడ్డాయి. తర్వాత విన్నకోట పెద్దన "కావ్యాలంకార చూడామణి" లో ఛందో అంశాలతో బాటుగా, వ్యాకరణ విశేషాలు పలు పేర్కొన బడినవి.

నన్నయ భట్టు దే అని నమ్ముతున్న " ఆంద్ర శబ్ద చింతామణి" పైన పేర్కొన్న రెండు గ్రందాల కంటే కూడా మంచి సూత్రా నియమాలతో రాయబడింది. ఐతే, దీనిలో ఛందస్సు గురించి లేక పోవడం కొరతే! కొందరు దీనికి పాఠ బేధాలు కల్పించి, అప్పకవీయానికి మూలమైన "చింతామణి" తయారు చేసారు.అందువల్లనే, అప్పకవీయం.. ప్రామాణిక చదో గ్రంధంగా రూపు దిద్దుకుంది. దానికి ముందే తెలుగు లో వచ్చిన "బాల సరస్వతీయం", అహోబల పండితీయ రూపం లో చింతామణికి వ్యాఖ్యానం వచ్చే వరకూ కూడా. బల సరస్వతీయానికి ప్రాముఖ్యత కలుగలెదు.

మనం ఈ గ్రంధాలను ముఖ్యంగా, 1) ఫద్య వ్యాకరణ గ్రంధాలు 2) సంస్కృత శ్లోక బద్ధ వ్యాకరణ గ్రంధాలు 3) సంస్కృత సూత్ర బద్ధ వ్యాకరణాలు 4) చింతామణి కి వ్యాఖ్యానాలు 5) తెలుగు సూత్రములతో రచించిన వ్యాకరణాలు 6) గద్య మయములైన వివరణాత్మక వ్యాకరణాలు గా విభజించ వచ్చు.

ఐతే బహుళ ప్రచారాన్ని పొందిన వాటిల్లో.. కేతన రాసిన ఆంధ్ర భాషా భూషణం, విన్నకోటపెద్దన రాసిన కావ్యాలంకార చూడామణి, అనంతా మాత్యుని చందో దర్పణం, ముద్దరాజు రామన రాసిన కవిజన సంజీవిని కొన్ని. వీటిల్లో ఏమేమి రాసారో తర్వాత తెలుసుకుందాము. కావ్య రచనకు మార్గ నిర్దేశనం గా తెలుగులో వ్యాకరణ రచన ఆరంభమయింది. దానితో భాషా స్వరూప స్వభావాలు నిరూపించ బడ్డాయి. సంధి సమాసాలలో ద్వైరూప్య సాధనకై రూపాంతరాలున్న తావులను అన్వేషించి చందస్సు లో వివిధ స్తలాలలో, గణ యతి ప్రాసాదులకు అనువుగా వాటిని వాడుకునేందుకు కవులకు శాస్త్ర నిర్దేశనము చేయుట వ్యాకరణ గ్రంధాల ప్రధాన ఉద్దేశ్యము.
చివరిగా ఒక మాట. "యదధీత మవిఙాఞతం నిగదేనైవ శబ్ద్యతే, అనగ్నా వివ శుష్కైధో న తజ్జ్వలరి కర్హిచిత్ తస్మా దనర్ధకం మాధీగీష్మహీ త్యధ్యేయం వ్యాకరణం"అంటె..మన జాతి ప్రాచీన సాహిత్యాన్ని తద్ద్వారా మన సంస్కృతి సాంప్రదాయలను నిలబెట్టుటకు వ్యాకరణం ఎంతో ప్రయోజనం.




13, జులై 2010, మంగళవారం

సీస పద్యం.

మనం పాట లాగా పాడుకోవడానికి బాగా వీలుండే పద్యం సీసమే! పూర్వం పౌరాణిక నాటకాలలో, ఇలాంటి సీసాలు ఎక్కువ గా ఉండేవి. ఇంకా రాయడం సులువు. మళ్ళీ, ఇంటి పేర్లు, పేర్లు కష్టమైన గురు లఘువులు ఉన్నవి, అన్నీ ఇందులో సులభంగా ఇమిడి పొయ్యే పద్యం ఇది. బాగా ప్రాక్టీసు చేసుకుంటే అన్ని విధాల ఉపయోగ పడుతుంది. ఇది కూడా ఇంద్ర, సూర్య గణాలు లతో ఉండేదే కాబట్టి, ఆటవెలది, తేట గీతి లాగ ఆడుకుంటూ పాడుకుంటూ రాసెయ్యొచ్చు.

ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు.

దీని స్వరూపం ఇలా ఉంటుంది.

ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం.
రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం.

మూడు నాలుగూ... ఐదూ ఆరూ... ఏడు ఎనిమిదీ.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే..
ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు.
పై సీస పద్యం రాసిన తర్వాత దాని కింద ఒక తేటగీతి లేక, ఒక ఆట వెలది ని గానీ రాయాలి. అప్పుడే.. సీసం పూర్తి అయినట్టు లెక్క. ఇలా రాయడాన్ని ఎత్తు గీతి అంటారు.
ఇక ఒక పద్యానికి గణ విభజన చేసి చూద్దామా.. స్వస్తి.

12, జులై 2010, సోమవారం

స్పందన బాగానే ఉంది.

పద్య మంజూష మొదలెట్టి 2నెలలు అయిన సందర్భంగా, అసలు ఎంతమంది ఆసక్తి కరంగా చూస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలని, ఒక "పోలు" నిర్వహించాను. మొత్తం 9 మంది ఓటు వేయగా.. ఏడు మంది బాగుంది అని, ఒకరు పర్వాలేదు అనీ, ఒకరు మాత్రం బాగా లేదు అన్నట్టు గా చెప్పారు. బాగానే ఉంది. వారు ఎందువల్ల బాగా లేదు అన్నారో తెలీదు. వారు సింపుల్ గ, బాగాలేదు అని సర్టిఫికేటు ఇచెయ్యడం గాకుండా, ఎందువల్ల బాగోలేదు, వారు ఏమైనా మెరుగు అవడానికి సలహాలు ఇవ్వగలరా! అనేది ముఖ్యం. అని నా అభిప్రాయం. అయినా 88% మంది బాగుంది అన్నాక బ్లాగు ఆపేది లేదు లెండి. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ పోయిన వారం ఎక్కువ టపాలు ఇవ్వలేక పొయ్యాను. నమస్కారాలతో. టేకుమళ్ళ వెంకటప్పయ్య.

6, జులై 2010, మంగళవారం

ఆటవెలది రాద్దాం ఇలాగా..

పద్యాలు రాయడంలో, ఆటవెలది గానీ, తేటగీతి కానివ్వండి, మన మనసులో ఒకట్యూనింగు లాగా ఏర్పడే వరకూ ప్రాక్టీసు చెయ్యాలి. మీరేమి అనుకున్న విరామ సమయంలో, మనసులోనే గణ విభజన చేసుకోండి. ఉదా: ఆటవెలది అయితే, మొదట ఒక సూర్య గణం రావాలి కదా. మూడు లఘువులతో గానీ.. (III) లేక UI తో ప్రారంభించాలి అనే విషయం మనసులో పెట్టుకోండి. అంటే, పద్యం చెప్తూ ఉన్నప్పుడే , సరిగా వెళ్తోందా మన ఆటవెలది బండి అని ఆలోచించుకుంటూ వెళ్ళండి.
ఒక ఉదాహరణ చూద్దాము. ఆటవెలది గురించి ఒక పద్యం రాయాలనుకుంటే మొదట, ప్రారంభం.. "ఆట" అని చేద్దాము తర్వాత, మళ్ళీ ఇంకో రొండు సూర్య గణాలు రావాలి. "వెలది" సరిపోతుంది. "రాయ" సరిపోతుంది. ఇక ఇంద్ర గణాలు రొండు ఎన్నుకోవాలి. నల, నగ, సల, భ, ర, త ఉండాలి కదా. ఇక యతి చూచుకుంటూ.. ఇంద్ర గణము రాయాలి. "ఆదరను" మళ్ళీ.. "బెదరను". అనే మాట వేద్దాము. కాబట్టి మనకు మొదటి పాదం తయారయింది. ఇలా పదాల అటూ ఇటూ తిప్పుతూ.. గణాలు చెదరకుండా.. యతి భంగం కాకుండా.. రాయడం ప్రాక్టీసు చేసుకోవాలి.

మొదట సంధులు సమాసాల గొడవ వదిలేసి, చిన్న చిన్న పదాలతో. ప్రారంభించండి. పదాలు పద్యం లో అటూ ఇటూ మార్చుకోవచ్చు. భావం చెడకుండా చూసుకోవాలి అంతే. .. ఇవాల్టికి ఇది ప్రాక్టీసు చేయండి. రేపు ఇంకో ఛందస్సు తో కలుద్దాము. స్వస్తి.

2, జులై 2010, శుక్రవారం

ఒక ముఖ్య విషయం గమనించండి.

ఒక విషయము మీకు చెప్పాలి. సంయుక్తాక్షరానికీ, ద్విత్వక్షరాలకీ ముందున్న లఘువు, గురువు గా మారుతుందని ఇంతకూ ముందు అనుకున్నాం కదా! అక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక పదం లో మొదటి అక్షరమే, సంయుక్త లేక ద్విత్వాక్షరం అయింది అనుకోండి. అప్పుడు, దాని కన్నా ముందు లఘువు వేరొక పదం లో ఉంటే, గురువు అవదు. ఎట్టి మార్పూ ఉండదు. గమనించండి.
చంపక మాల లోని ఒక పాదం ద్వారా మీకు ఆ విషయం చెప్తాను.
కలిపి - నద్రాక్ష - పాకమ - నాకమ్మ - దనంబు - నకమ్ము - యౌచురా.
న జ భ జ జ జ ర
III, IUI, UII, IUI, IUI,IUI, UIU.
"ద్రా" అనే సంయుక్తాక్షరం ముందు "న" లఘువు ఉన్నప్పటికీ, కలిపిన - ద్రాక్ష వేరు వేరు పదాలు అవడం వల్ల, న లఘువు గానే ఉండి పోయింది. ఇలాంటి విషయాలు గమనించుకోవాలి.

1, జులై 2010, గురువారం

నానార్ధములు

సాధారణముగా ఒక పదమునకు ఒకే అర్ధముండును. కానీ కొన్ని పదములకు ఒకటి కంటే ఎక్కువ అర్ధములుండును. అట్టి పదముల అనేక అర్ధములను నానార్ధములు అని అందురు. తెలుగుదనం వారి సౌజన్యం తో కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇవి మన పద్యాలు రాయడానికి ఉపయోగ పడతాయి.

అంకము - నాటకభాగము, సమీపము, చిహ్నము, అంకె.
అంగము - శరీరము, ఉపాయము, భాగము, అవయవము.
అంటు - మైల, తాకు, నేలపైపాతిన కొమ్మ.
అంబ - తల్లి, పార్వతి, అంబిక.
అంబరము - ఆకాశము, వ్యసనము, వస్త్రము.
అక్షరము - ఓం కారము, తపస్సు, ధర్మము, వర్ణము, యజ్ఞము.
అని - చెప్పి, యుద్ధము, సేన, అన్ని, ప్రసిద్ధి.
అనువు - అనుకూలము, తీర్పు, అవకాశము, ఉపాయము, విధము.
అబ్దము - మేఘము, సంవత్సరము.
అభ్రకము - రెల్లు గడ్డి, మబ్బు, కర్పూరము, స్వర్గము, ఆకాశము.
అమృతము - సుధ, పాలు, నీరు, నెయ్యి .
గంగ - నది, గోదావరి, నీరు, గంగానది.
గతి - నడక, వలె, స్థితి.
గణము - జాతి, సమూహము, సమాజము, అక్షర సముదాయము.
గాత్రము - కంఠము, దేహము, అవయవము.
గుణము - స్వభావము, వింటినారి.
గురువు - బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి , తాత, అన్న.
ఘనము - మేఘము, గొప్ప.
తపసు - తస్సు, అగ్ని, వేసవి, పక్షి.
తమస్సు - చీకటి, అంధకారము, అజ్ఞానము.
తరంగం - కెరటము, గుర్రపుదాటు, వస్త్రము.
తీర్ధము - రేవు, పుణ్యక్షేత్రము, పవిత్ర జలము, అగ్ని.
తెగ - కులము, పొడవు, పక్షము, వింటినారి.
తోయము - నీరు, స్నేహము.
త్రోవ - దారి, ఉపాయము, పద్ధతి.
దానము - మదజలము, ఈవి.
దిక్కు - ఉపాయము, దిశ, మార్గము, గతి.
దేవి - సరస్వతి, దేవపత్ని, పార్వతి.
దైవము - దేవత, భాగ్యము, కొతావు, ఒకరకమైన వివాహ పద్ధతి.
దోషము - పాపము, పొరపాటు, ఆవుదూడ, చేటు భుజము.
ధ్వని - చప్పుడు, వ్యంగ్యము.
ధర్మము - ఆచారము, న్యాయము, గుణము, పుణ్యము, యజ్ఞము, విల్లు.
ధార - ప్రవాహము, కత్తి పదును పరంపర, నీటివాలు.
నరుడు - మానవుడు, అర్జునుడు, ఒకముని.
నాగము - పాము, ఏనుగు.
నింగి - ఆకాశము, స్వర్గము.
నీరజ - నీటిలో పుట్టినది, తామర ముత్యము.
పుండరీకము - పెద్ద పులి, తెల్ల తామర, మామిడి పండు తీర్ధము.
పక్షము - రెక్క, 15 దినముల కాలము, ప్రక్క అర్ధదేహము, సమూహము.
పదము - పాలు, శబ్దము, పాదము.
పాడి - తీర్పు, ధర్మము, వివాదము, తగవు, న్యాయము.
పాదము - కాలు, పద్యపాదము, నాలుగవ వంతు.
పితామహుడు - బ్రహ్మ, తాత.
పుణ్యము - ధర్మము, నీరు, బంగారము, పుష్పము.
పురము - పట్టణము, శరీరము, ఇల్లు, మేడ.
పూట - దినము, సగము, పూచి.
పేరు - నామము, ప్రసిద్ధి, పెద్ద, నగ.
ప్రవాహము - వరద, పారుదల, ధార, ఉత్తమాశ్వము.
ప్రాణము - ఊపిరి, గాలి, ఉసురు, బలము, హృదయము.
ప్రియము - వెల, ప్రీతి, ఇష్టము, ఎక్కువైనది.
ప్రీతి - సంతోషము, ఛంధస్సులో ఒకటి, మన్మధుని భార్య.
బలము - సత్తువ, దేహము, రక్తము, బలాత్కారము, శక్తి, సైన్యము, దండు.
భగము - అల, అవమానము, ఆటంకము, విరచుట.
భరణము - పోషించుట, కూలి, భోజనము, మోయుట.
భాష - మాట, వివరణము, సరస్వతి.
భూతము - ప్రాణి, గడచినకాలము, సత్యము, పిశాచము, గతకాలము.
భూరి - బంగారము, గొప్ప.
మండలము - నలుబది దినములు, బింబము, జిల్లా.
మది - మనస్సు, కోరిక, తెలివి.
మాంసము - కాలము, పురుగు.
మానము - కొలత, అభిమానము.
మార్గము - త్రోవ, పద్ధతి, పరిశీలన, ఉపాయము.
మాలిక - పుష్పములదండ, రాజగృహము, విరజాజిచెట్టు.
ముఖము - నోరు, విధము, మొగము.
ముని - బుద్ధుడు, ఋషేశ్వరుడు, మామిడిచెట్టు.
మేలు - ఉపకారము, పుణ్యము, శ్రేష్ఠత, న్యాయము, అందము.
మౌళీ - కిరీటము, కొప్పు, శిరస్సు, జటాజూటము.
యుగము - జంట, వయస్సు, కాలము.
రంగము - యుద్ధభూమి, నృత్యము, రంగు, నాట్య ప్రదర్శన, స్థలము.
రంధ్రము - కన్నము, నింద, తప్పు, నవసంఖ్య.
రతి - సంభోగము, అనురాగము, మన్మధుని భార్య.
రత్నము - మణి, వజ్రము, అమూల్యమగు వస్తువు, నీరు.
రథము - తేరు, రెల్లు, శరీరము, పాదము.
రసము - ద్రవము, నీరు, పాదరసము, నవరసములు.
రాజు - చంద్రుడు, ప్రభువు, ఇంద్రుడు.
రూపు - ఆకారము, దేహము, చక్కదనము, నిజము.
లీల - ఆట, వినోదము, పోలిక, సొగసు, చులకన.
లోకము - జగత్తు, జనము, చూపు, గుంపు.
వంశము - కులము, వెదురు, సమూహము.
వనము - నీరు, అడవి.
వాహిని - సైన్యము, నది.
విభుడు - శివుడు, ప్రభువు, సర్వవ్యాపకుడు, బ్రహ్మ.
విరోధము - పగ, ఎడబాటు, అడ్డంకి, ఒక అలంకారము.
విషయము - సమాచారము, దేశము, ఇంద్రియము.
వీధి - త్రోవ, పంక్తి, వాడ, నాటకభేదము.
వృషభము - ఎద్దు, పుణ్యము, నెమలిపింఛము, వృషభరాశి.
వెరవు - విధము, తగినది, తగిన విధము, బ్రతుకుతెరవు.
శరము - బాణము, రెల్లు, నీరు.
శిఖి - నెమలి, బాణము, అగ్ని సిగగలవాడు.
సత్యము - నిజము, మంచితనము, ఒట్టు కృతయుగము.
సిరి - సరస్వతి, సంపద, లక్ష్మి, విషము, సాలిపురుగు.
సొమ్ములు - నగలు, పశువులు, డబ్బు.

ఆటవెలది.

ఆటవెలది పద్య పాదం లో నాలుగు పాదాలు ఉంటాయి. ౧, ౩ పాదాలలో..వరుసగా ౩ సూర్య గణాలు, ౨ ఇంద్ర గాణాలూ ఉంటాయి. ౨, ౪ పాదాలలో..ఐదేసి సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికీ యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ప్రాస యతి వాడవచ్చు.
సూర్య, సూర్య, సూర్య, ఇంద్ర, ఇంద్ర.
సూర్య, సూర్య, సూర్య, సూర్య, సూర్య.
మొదటి రొండు పాదాల గణాలు పై విధంగా ఉంటాయి. అలాగే తర్వాతి రొండు పాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక పద్యం చూద్దామా?
వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!
వేష బాషలను చూసి భ్రమ పడవద్దు అని చెప్తున్నాడు వేమన.
మొదటి పాదం లో.. వేష, ధారి, నెపుడు...అనేవి మూడు సూర్య గణాలు కదా..(UI, UI, III).. విశ్వసిం. పగరాదు.. అనేవి. ఇంద్ర గణాలు.. కదా.. ( UIU...IIUI...) ర గణం, సల.. అనేవి సరిపోయాయి. అలాగే.. రొండవ పాదం లో.. చూద్దాము.
వేష, దోష, ములొక,విధయె, యగును. ఇవన్నీ సూర్య గణాలే కదా...(UI, UI, III, III, III) కాబట్టి రొండో పాదం సరి పోయింది కదా.. ఇలాగే ౩, ౪ పాదాలు చూడండి.
ఆటవెలది సులభంగా రాయాలంటే ఎలా అనే విషయం రేపటి టపా లో చూద్దాము.

29, జూన్ 2010, మంగళవారం

ఆటవెలది.

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె దాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు !
ఈ పద్యం అందరం చిన్నప్పుడు చదువుకున్నదే కానీ, మనలో చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇది తాళ్ళపాక అన్నమాచార్యుడు వ్రాసిందని. "చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు" అంటూ ఒక శతకాన్ని వ్రాసాడట ఆ మహానుభావుడు. కానీ అందులో ఇప్పుడు మనకు దొరికిన పద్యాలు కేవలం ఎనిమిదేనట. మిగిలినవి ఏమయ్యాయో ఇంకా తెలియదు. ఇది ఆటవెలది కి ప్రారంభం. ఇంకా మన వేమన గురించి చెప్పాలంటే మన హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద చూసే ఉంటారు ఆయన విగ్రహం. కింద ఆయన గురించి.. "ఆటవెలది ని ఈటె గా విసరిన దిట్ట. చాందస భావాలకు తొలి అడ్డు కట్ట." ఆయన ఆటవెలది లో దిట్ట. అయన రాసిన సరళ ఆటవెలదులు మనం ఎ గ్రంధం లోనూ చూచి ఉండము కూడా.
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
లక్షణములు
ఆ.ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబునుహంస పంచకంబు ఆటవెలది.'
పాదాల సంఖ్య నాలుగు 1, 3 పాదాలు మెదటి 3 గణాలు సూర్య గణాలు ,తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి 2, 4 పాదాల్లో 5 సూర్య గణాలు ఉంటాయి యతి ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం. ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ఉదా:- 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే. ఇదీ స్తూలంగా ఆటవెలది కి ప్రారంభం. ఇక మనం పద్యం లో ప్రవేశించి, గణవిభజన తో సహా నేర్చుకుందాము.

27, జూన్ 2010, ఆదివారం

పద్యానికి యతి ప్రాసలే హృద్యం, హృదయమూ....

పద్యానికి యతి, ప్రాస.. హృద్యం,ప్రాణం,అందం.. ఇవి ఏదోవిధంగా పెట్టడం కాదు. సరిగా ఉండాలి. అప్పుడే పద్యం అందగిస్తుంది. తిక్కన సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణం లో (1-7)... యతి ప్రాసల గురించి ఇలా చెప్పాడు.
తెలుగు కవిత్వము చెప్పందలచిన కవి యర్ధమునకు దగి యుండెడు మాటలు గొని వళులం బ్రాసంబులు నిలుపక యొగిని బులిమి పుచ్చుట చదురే!
తిక్కన ఎంత చక్కగా చెప్పడో చూడండి. పులమొద్దు అంటున్నదు. కనుక యతి ప్రాసలు ఏవో వేసేసి పద్యాన్ని లాగించెయ్యడం సరి కాదు. అర్ధవంతం గా ఉండాలి. అలాగే వేరొక చోత "ప్రాసము ప్రకారం వేరగు నక్షరంబులన్ శృత్య రూప మంచు నిడ" అన్నాడు. దాని అర్ధం ఏమిటంటె.. బండి "ఱ" మామూలు "ర" పలకడానికి వొకే విధంగా ఉన్నయి కదా అని ప్రాస లో వాడడం సరి కాదు అని సున్నితం గా ప్రభోదించాడు. అలాగే పెద్దలు వాడారు కదా అని మనం వాడడం కూడ సబబు కాదు అని పరవస్తు చిన్నయ సూరి "ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు" అన్నడు.
కనుక యతి ప్రాసలకు పనికి వచే పదాలు తెలుసుకోంది అర్ధవంతం గా వాడండి. ఒకే పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి కదా? మీకు ఒకే పదాన్ని అన్ని గణాలకు పనికి వచ్చే విధంగా ఎలా ఉపయోగించాలో రేపు చెప్తాను.

24, జూన్ 2010, గురువారం

ప్రయత్నమే పద్య రచనకు తొలి మెట్టు.

మీకు తేటగీతి లోని కొన్ని ముఖ్య విషయాలను చెప్పి, వేరే చందస్సు లోకి వెళ్తాను.
మీరు అసలు ముందుగా ఒక పద్యం రాయాలి అనే పట్టుదల పెట్టుకోండి.
ఉదా: ఒక వనం మీద ఒక పద్యం రాయాలి. అనుకోండి.
మొదట గా మనకు తేటగీతి కి సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.
మొదట గా సూర్య గణం కదా... వనము ( III ) సరిపోయింది. తరువాత ఇంద్ర గణం కావాలి.జూడగ..( UII ) తర్వాత నామది.. ( UII)ఇక మనం సంతోషం పొందినదనో..ఆటలాడిందనో రాయాలి కదా? ఆటలాడె.. మరి ఇలా రాస్తే.. యతి .. సరిపోదు కదా.. వనము అంటే.. వ.. కానీ.. ప్రాస యతి ఐతే.. న. రావాలి.
అలాంటప్పుడు నా సలహా యేంటంటే.. యతి కి పనికి వచ్చే పదాలు వెదకడం ఒక పద్ధతి.లేదా యతి కి సరిపోయే పదం మొదటగా వేసుకోడం ఇంకో పద్ధతి. మీకు ఏది సులభం అనుకుంటే అదిచెయ్యండి.
మనం పై పద్యం లో యతి సరిపోలేదు కదా.. అందుకని .
వనము జూడగ నామది.. వరకూ వచ్చాక యతి సమస్య వచ్చింది..మనం ఆట లాడె అని రాయలనుకున్నము..
వనము బదులుగా తోట.. పెట్టుకున్నట్లైతే..తోట.. లోని "ట" ఆ"ట" లోని "ట"యతి సరిపోతుంది కదా.. అలాగే ప్రయత్నించండి. పద్యం రాయంటే ఆసక్తి ముఖ్యంపెద్దగా విద్వత్తు అవసరమేమీ లెదు అని ప్రారంభించండి..
ఇంకా సందేహాలు ఉన్నయా? ఉంటే రాయండి. మైల్ ఐనా ఇవ్వండి లేదా..కామెంటురూపం లో రాయండి.
ఈ పద్యం తో నా తేట గీతి అభ్యాసాలు ముగుస్తాయి.
తెలుగు భాషకు వెలుగును తెచ్చినట్టి
పద్య కవిత ను మరచుట పాడి గాదు.
ఆంధ్ర సోదర నా మాట ఆలకించి.
పాడు కొనుమయ్య పద్యమున్ పరవశించి.

ఇలా మీరు ప్రయత్నిచండి. తప్పులైనా సరే రాయండి.నేను మీకు సరి చేసి పంపుతాను. ఈ రోజు కు స్వస్తి.

23, జూన్ 2010, బుధవారం

పర్యాయ పదాలు.

పర్యాయ పదాలు ఎక్కువగా తెలుసుకోవడం వాళ్ళ, పద్యం లో ప్రాస కు ఒక పదం కాకపోయినా ఇంకో పదం వాడుకోవచ్చు.

ఒకే అర్ధమునిచ్చు వివిధ పదములను పర్యాయ పదములు అందురు. వీటిని తెలుసుకొనుట వలన ఒకే అర్ధము గల వివిధ పదములు పరిచయము కలుగును.
అంకురార్పణ - ఆరంభము, ప్రారంభము, శ్రీకారము, మొదలు, ఆముఖము, సమారంభము.
అధికారి - అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు.
ఆచారము - సంప్రదాయము, ధర్మము, అనుష్ఠానము, మరియాద, పాడి.
ఆజ్ఞ - ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, ఆదేశము.
ఆపద - గండము, ఇడుము, కష్టము, క్లేశము, పీడ, ప్రమాదము, కీడు, చిక్కు.
ఆవు - మొదవు, కపిల, ధేనువు, సురభి, పావని, బహుళ, మాహేయ, గోవు, పయస్విని.
ఆశీర్వాదము - ఆశీస్సు, ఆశీర్వచనము, సంబోధన, ఆక్రందన.
ఇల్లు - గృహము, ధామము, ఆవాసము, ఆలయము, స్వగృహము, కొంప, భవనము.
ఈశానము - రుద్రభూమి, మరుభూమి, వసకాడు, ప్రేతవనము, పరేతభూమి.
ఉదాహరణము - నిరూపణము, ఉపవృత్తి, ప్రామాణ్యము, ఉదాహృతి.
ఉప్పు - లవణము, క్షారము, కటకము.
ఋషి - తాపసి, ముని, సాధువు, జడధారి, తపస్వి.
ఎల్లప్పుడు - సర్వదా, నిత్యము, కలకాలము, సతతము, అనవరతము, అహర్నిశము, ఎల్లకాలము.
ఏనుగు - ఇభము, హస్తి, సారంగము, గజము, కరేణువు, కుంజరము, దంతి, మాతంగము, వారణము, సింధువు.
ఓదార్పు - సాంత్వము, అనునయము, ఊరడింపు, లాలన, బుజ్జగింపు, ఉపశాంతి.
కట్నము - శుల్కము, వరదక్షిణ, అరణము, వీడు.
కడుపు - కుక్షి, ఉదరము, పొట్ట, కంజరము.
కన్ను - చక్షువు, అక్షిన, లోచనము, నయనము, ఈక్షణము, అవలోక్యము.
కర్పూరము - కప్రము, కుముదము, నెల, ముక్తాఫలము, హిమాంశువు, శ్వేతధామము.
కలువ - ఉత్పలము, కువలయము, పున్నాగము, తోవ, కపాలము.
కాంతి - వెలుగు, మినుకు, ప్రకాశము, ద్యుతి, ప్రతిభ, రవణము, రోచిస్సు.
కవచము - ఆయుక్తము, తొడుగు, వారణము, కవసము.
కాముకుడు - శృంగారి, కామాచారి, స్త్రీపరుడు, కామి, వలకాడు.
కాయ - కసురు, శలాటువు, పసరుకాయ.
కారణము - హేతువు, తర్కము, నిమిత్తము, మిష, సాకు, వంక, భంగి.
కీర్తి - ఖ్యాతి, ప్రతిష్ఠ, యశము, ప్రకాశము, ప్రశస్తి, నెగడ్త, పేరు.
కూతురు - అంగజ, కుమారి, తనయ, సుత, పుత్రిక, తనూజ.
కొడుకు - సుతుడు, నందనుడు, కుమారుడు, తనయుడు, అంగజుడు, పుత్రుడు, ఆత్మజుడు.
కోపము - క్రోధము, ఆగ్రహము, ఉద్రేకము, కినుక, అలుక, నెగులు, చిందు, రోషము.
క్రమము - అనుక్రమము, యధాక్రమము, సరలి, పదకము, తరువాయి.
క్షణము - లిప్త, మాత్ర, త్రుటి, ముహూర్తము.
గ్రంధము - పుస్తకము, వహి, పొత్తము, కితాబు.
చర్మము - తోలు, తాట, తొక్క, అజనము.
తండ్రి - జనకుడు, అయ్య, నాన్న, పిత, పితరుడు.
తామర - పద్మము, అంబుజము, అరవిందము, సరసిజము, సరోజిని, కంజాతము, రాజీవము.
త్రాడు - పాశము, చామము, రజ్జువు, బంధువు, వటము.
దేవాలయము - ఆలయము, నగరు, కోవెల, గుడి.
దేశము - వర్షము, రాష్ట్రము, రాజ్యము, సామ్రాజ్యము, పాళెము, నీవృతము.
ధనము - ఆదాయము, డబ్బు, సొమ్ము, అర్ధము, నగదు, దుడ్డు, ద్రవ్యము, సొత్తు, లెక్క, కాసు, పైకము.
నారదుడు - కలహాశనుడు, త్రిలోకసంచారి, కలహభోజనడు, దేవలుడు, కలహ ప్రియుడు. నేడు - ఈనాడు, ఈప్రొద్దు, ఈరోజు.
పండితుడు - అభిజ్ఞుడు, కవి, కోవిదుడు, ధేమతుడు, విద్వాంసుడు.
పెండ్లి - వివాహము, పాణిగ్రహణము, మనువు, పరిణయము, స్వీకారము, కళ్యాణము.
పన్ను - కష్టము, సుంకము, కూలి, శిస్తు, శుల్కము, ఇల్లరి.
పరిశోధన - విచారించు, పలికించు, సోదించు, అరయు, ఎంచు, ఒరయు.
పరిశోధకుడు - పరీక్షకుడు, శోధకుడు, విచారకుడు, పరిశీలకుడు.
పాపము - దుష్కృతము, కీడు, కొడిమె, అఘము, కలక, దోషము, దురితము.
పిల్లి - బిడాలము, మార్జాలము, వ్యాఘ్రాదము, త్రిశంకువు.
ప్రాణము - ఓవము, ఉసురు, సత్త్వము, ఊపిరి, అసువులు.
బుద్ధి - ప్రతిభ, ప్రజ్ఞ, ప్రాజ్ఞ, ధౌ, ప్రజ్ఞానము, మనీష.
బ్రహ్మ - విధాత, కమలగర్భుడు, చతుర్ముఖుడు, హంసవాహనుడు, చతురాననుడు, కంజాతుడు, కమలాసనుడు, నలువాయి, సృష్టికర్త.
భక్తి - బత్తి, సేవ, ఇమ్ము, విరాళి, సొరత్వము, పోరామి.
భర్త - వల్లభుడు, ప్రాణేశుడు, ఈశుడు, నాధుడు.
భార్య - అర్ధాంగి, సతి, ఆలు, ఇల్లాలు, కళత్రము, పత్ని, గృహిణి.
భోజనము - విందు, భుక్తి కడుపు, అన్నము, ఓగిరము, బోనము, భిక్ష, పబ్బము.
మనస్సు - హృదయము, ఉల్లము, మనము, ఎరచిత్తము, ఎడద, అంతరంగము, డెందము.
మాట - వాక్కు, పలుకునుడి, ఉకిత, వనము, ఆలాపము, సుద్ది, భాషణము.
ముఖము - మూతి, వదనము, మోము.
మెరుపు - సౌదామిని, అంబరాంశువు, నీలాంజన, చంచల, అశని, మేఘవహ్ని.
మేఘము - అబ్దము, వారిదము, పర్జన్యము, నీరదము, జలధరము, పయోధరము.
మేనము - అవాక్కు, అభాషణము.
యముడు - ధర్మరాజు, సమవర్తి కాలుడు, పాశి మృత్యువు, శమనుడు.
యుద్దము - రణము, సంగ్రామము, తగవు, పోరు, సమరము, భండనము, వైరము, విగ్రహము.
రక్షణ - శరణు, త్రాణము, రక్ష, అభయము, కాపుదల.
రహస్యము - గూఢము, గుప్తము, మంతనము, మర్మము, చాటు, గోపనము.
రాత్రి - అసుర, రజని, నిశీధము, నిసి, యామిని, అంజనము, మాలతి.
రైతు - సేద్యకాడు, కుటింబి, కర్షకుడు, హాలికుడు, కృషీవలుడు, కాపు.
రోగము - అనారోగ్యము, జబ్బు, అస్వస్థము, నలత, వ్యాధి, సుస్తి, అపాటము.
వరుస - అంచె, సరణి, దొంతర, క్రిమము, వళబారు, శ్రేణి, బొత్తి, సరళి
వర్తకుడు - వ్యాపారి, వణిజుడు, శ్రేష్ఠి, వ్యాపారస్థుడు, సెట్టి, వ్యవహారి.
వస్త్రము - అంబరము, చేలము, వలువ, కోక, గుడ్డ, శాటి.
వార్త - కబురు, గాద, వర్తమానము, సొద, సంగతి.
విద్యార్ధి - పాధకుడు, అద్యౌత, పాఠనుడు, అభ్యాసి.
విధము - ఒరవు, సొంపు, సూటి, క్రియ, క్రిమము, దారి, వెరవు, మార్గము.
వినోదము - వేడుక, హొయలు, వింత.
విమర్శ - సమీక్ష, పరామర్శ, అవలోకనము, విచారము, చర్చ.
విష్ణువు - శౌరి, హిర్ణగర్భుడు, అనంతుడు, గోవిందుడు, వైకుంఠుడు, చక్రాయుధుడు, పన్నగశయనుడు, జనార్ధనుడు, అక్షరుడు, శ్రీనివాసుడు, పద్మగర్భుడు.
వైతాళికుడు - ప్రబోధకుడు, ఉద్బోధకుడు, ఛాత్రికుడు
శపధము - వ్రతము, బిట్టు, బాస, పూనిక, ప్రతిన, పంతము, ప్రతిజ్ఞ
శరీరము - అంగము, బొంది, మేను, విగ్రహము, ఒడలు, దేహము.

తేట గీతి పద్యం.

వారం రోజులు అయినా సరైన సమాధానాలూ, ప్రయత్నాలు లేవు. ఐన నేను నా విధి గా పద్య పాదాన్ని పూరించి తర్వాతి విషయం లోకి వెళ్ళాలి.
సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి గదా..
తోట కూర పప్పు పులుసు తోడి పెరుగు
దీనిలో UI (తోట) కూర పప్పు పులుసు లో.... కూరపప్పుపులుసు.(UIUIIII)... లో...రగణం, నల గణం వరుసగా వచ్చాయి. రొండు ఇంద్ర గణాలు సరిపోయాయి. ప్పు అనే ద్విత్వాక్షరానికి ముందున్న ప గురువు గా మారిన విషయం గమనిచే వుంటారు. అలాగే ప్పు లఘువు గా మారడం కూడా. అలాగే మిగతా పాదాల్ని ఇస్తే గణ విభజన చేసి చూడండి.
తల్లి కరుణకు సరిసాటి ధరణి గలదె!... ౪ వ పాదం.. జన్మ జన్మ కు యామెకె జన్మ నిమ్ము.
ఇక మంచి తేట గీతి పద్యాలను చూసి గణవిభజన చేసుకుని రాయడం ప్రారంభించండి.
ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలను ఒకసారి మననం చేసుకుందాము.
తేటగీతి కి సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.
మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండాలి. ప్రాస యతి వాడ వచ్చు. ప్రాస నియమము లేదు. ఈ విషయాలు మనసులో సదా ఆడుతూ ఉండాలి. చిన్న చిన్న పదాలతో రాసుకోండి.
ముఖ్యంగా ప్రాస పదాలు తెలిసి ఉండాలి. ఈ కింద కొన్ని ప్రాస పదాలు ఇస్తున్నాను చూడండి. ఈ పదాలు నేను తెలుగు దానం అనే వెబ్ సైటు నుంచి తీసుకున్నవి. వారికి కృతజ్ఞతలు.
పాప గిలక తాత పిలక
సబ్బు మరకగడ్డి పరక
గుడి గంటవరి పంట
రంగు పలకకంటి నలక
పళ్ళ గంపముళ్ళ కంప
పిచ్చి కుక్కపూల మొక్క
చిట్టి తల్లిబుజ్జి చెల్లి
కాకి ఈకమేక తోక
తేలు కొండిరైలు బండి
బావి గట్టురావి చెట్టు
దోస పండుపూల చెండు
పట్టు కుచ్చుగొర్రె బొచ్చు
గండు పిల్లిబొడ్డు మల్లి
చీల మండుగోల కొండ
వెండి కొండనిండు కుండ
ఆల మందతీయ కంద
వరి అన్నంరాతి సున్నం
నీటి బుడుగపాము పడగ
ప్రాస వాక్యాలు
మంచి మాట ముద్దుకల్లలాడవద్దు
కీడు చేయ ముప్పువాదులాడ తప్పు
కట్టు లేని నోరుగట్టు తెగిన ఏరు
పెద్ద వారి మాటపెరుగన్నం మూట
కలసి మెలసి మెలుగుకలిమి బలిమి కలుగు
పొల్లుమాట విడువుగట్టిమాట నుడుపు
మాట తప్పబోకుమంచి విడువబోకు
అడుసు తొక్కుటేల?కాలు కడుగు టేల?
చదువురాని మొద్దుకదలలేని ఎద్దు
కీడుచేయ ముప్పువాదులాడ తప్పు
మంచివిద్య చదువుమంచిబుద్ధులొదవు
గట్టిమాట నుడువుగర్వమంత విడువు
ప్రియములేని విందునయముకాని మందు
పోరునష్టం పొందులాభం కలసి ఉంటే కలదు సుఖం.
ఇలాంటి పదాలు గమనించండి. ప్రాస ఆటోమాటిక్ గ పడాలంటే బాష మీద కొంచెం పట్టు సాధించండి.

16, జూన్ 2010, బుధవారం

తేట గీతి పద్యం.

పద్యాలగురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నా, సందర్భానుసారంగా చెప్పుకుంటే బాగుంటుందని భావిస్తూ, నేరుగా పద్యల్లోకి దిగుతున్నాను. ఇంకా మనం సందుల గురించి, సమాసాల గురించి తెలుసుకోవాలి. విసంధులు చేయడం, సంధి చేయ వలసిన చోట, చేయకుండా గానాలకోసం విడివిడి గా రాయడం, తప్పు, పైగా పద్యం అందం కూడా సన్నగిల్లుతుంది. అలాగే సమాసాలను సరిగా రాయక పోతే మనకే పద్యం చదువుతున్నప్పుడు, సరిగా అనిపించదు. అవన్నీ మనం సందర్భానుసారంగా చెప్పుకుందాము. మనం ప్రస్తుతం తేట తేట తెలుగు లో తేటగీతి ఎలా రాయాలో చూద్దాము.


పద్యాలు మన ఆర్యులు ౩ విధాలుగా చెప్పారు. ౧. వృత్తములు అంటే చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల మొదలైనవి. ౨. జాతులు అంటే కందము, ద్విపద మొదలైనవి. ౩. ఉప జాతులు..తేటగీతి, ఆటవెలది, సీసము.


అంటే ఇప్పుడు మనం రాయబోయే తేటగీతి ఉప జాతికి చెందినదని గుర్తుపెట్టుకోండి. తేటగీతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పదం లో ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణాలు, మళ్ళీ రొండు సూర్య గణాలు వరుసగా వస్తాయి. మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి ఉండాలి. ప్రాస యతి వాడ వచ్చు. ప్రాస నియమము లేదు.


ఇప్పుడు అన్ని నియమాలు వరుసగా చూద్దాము. ఇందులో కంగారు పడవలసిన పని లేదు. ఛందస్సు గురించి భయపడకండి. ఈ పద్యం లో ప్రతి పాదం లో వరుసగా, ఒక సూర్య గణమూ, తర్వాత.. రొండు ఇంద్ర గణాలూ, మళ్ళీ రొండు సూర్య గణాలు రావాలి అని అనుకున్నాం గదా వాటి సంగతేమితో మొదట గా చూద్దాము.

1.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.

౨.సూర్య గణాలు: గలము లేక హగణం: UI ., మరియూ.. III నగణం.

మనకు ఇవి కావాలి తేటగీతి రాయాలంటే అంతే..

సూర్య - ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య. ప్రతి పాదం లో ఉండాలి.

మనం విడి విడి అక్షరాలతో ఈజీ గా తేటగీతి రాసేయగలం.

చూడండి. మామూలు పదాలు పట్టుకోండి చాలు.
అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను...
అమ్మ.. ఇది (U I) "గలం" లేక "హగణం".. సూర్య గణము కదా.. అన్నము...( UII) "భ" గణము.. భా న స ...ఇది ఇంద్రగణము కదా.. పెట్టెను (UII ) "భ" గణము.. భా న స ఇదీ ఇంద్ర గణమే. ఇక మనం రొండు సూర్య గణాలు వాడాలి కదా.. కమ్మ (U I) గలం లేక హగణం ఇది సూర్య గణము.. అలాగే.. గాను (U I) గలం లేక హగణం ఇదీ సూర్యగణం. కాబట్టి మనకు సులభంగా తేటగీతి లోని పద్యం లో మొదటి పాదం వచ్చేసింది. యతి విషయానికి వస్తే అమ్మ లో ఉండే "మ్మ" కు కమ్మ లొ ఉందే "మ్మ" కు యతి సరిపోయింది. ఒక పాదం పూర్తి అయింది ఇలాగే మిగత పాదాలను పూరించడానికి ప్రయత్నించండి. మరి.. ఆలస్యం వద్దు. నాకు మెయిల్ చేసినా. లేక వ్యాఖ్యల రూపం లో రాసిన చూద్దాము. ఎంత మంది అసలు ఈ పద్యాలను ఫాలో అవుతున్నారో కూడా తెలుస్తుంది.





14, జూన్ 2010, సోమవారం

తెలుగులో మొదటి పదం.

ఎప్పుడూ, ఛందస్సు గురించి కాకుండా, అప్పుడప్పుడూ, తెలుగు భాష గురించి తెలుగు పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోడం ఆసక్తి కరంగా ఉంటుందని భావిస్తూ.. కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను.
ఆంద్ర సాహిత్యం లో మనకు మొదట లభిస్తున్న కావ్యం నన్నయ గారి " ఆంద్ర మహా భారతం" ఐనా, ఆయనకు ఒక శతాబ్దం ముందే మల్లియ రేచనుడు అనే కవి కవి జనాశ్రయము అనే లక్షణ గ్రంధాన్ని తెలుగు లో రాసాడు. కానీ అతని మాటల్లోని "తెలుగు" పదాన్ని సంసయించారు మన కవిపుంగవులు. ఇంకా ప్రాచీనుడు ఉద్యోతనుడు, ఆయన ఆంద్ర ప్రసక్తి చేసాడు తన రచనల్లో. ప్రాకృతం లో రాసిన ఆంద్ర ప్రసక్తి ఉంది చూడండి.
"పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణే రొద్దే,
అటుపుటు రటుం భణంతే ఆంధ్రే కుమారో సలోయేతి"
అంటే అర్ధం ఏమిటంటే.. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి ఇలా చెప్పారు.
"అందగత్తెలన్నా..అధవా.. యుద్ధరంగామన్నా..సమానంగా ప్రేమించే వాళ్ళు, అందమైన శరీరాలు గల వాళ్ళూ.. తిండి లో దిట్టలూ... అయిన ఆంధ్రులు... అటూ పుటూ, రటూ, అనుకుంటూ వస్తూ ఉండగా చూచాడు."
తొలి తెలుగు మాట?
మన అమరావతీ స్తూపం, చాలా ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ౨౦౦ మొదలుకుని క్రీ.స. ౨౦౦ వరకూ అనేక దశలలో దాని నిర్మాణం సాగింది. ఇక్కడ దొరికిన ఒక రాతి పలక మీద "నాగబు" అనే మాట కనపడింది. దీన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని మొదటగా గుర్తించారు.ఇదే మనకు లభించిన మొదటి తెలుగు మాట. దాని అసలు సిసలు ద్రావిడ పదం "చెంబు" అంటారు.



ప్రాస నియమము అంటే ఏమిటి?

ఒక పద్యం లో కనీసం నాలుగు పాదాలు ఉంటాయి కదా. పద్య పాదం లోని రోండవ అక్షరాన్ని ప్రాస అంటారని తెలుసుకున్నాము. పద్యం మొదటి పాదం రొండో అక్షరం ఏమి ఉంటె అదే అక్షరం రొండు, మూడు మరియూ నాలుగు పాదాలలో ఉండాలి.
ఉదా: మొదటి పాదం రొండో అక్షరం "ప" ఉంటె, రొండు, మూడు, నాలుగు పాదాలలో కూడా "ప" ఉండాలి. అంటే పు, పె, పి అనే హల్లులు కూడా ఉండవచ్చు.

10, జూన్ 2010, గురువారం

ప్రాస యతి అంటే ఏమిటి?

యతి అంటే ఏమిటో తెలుసుకున్నాము. అలాగే, ప్రాస యతి అంటే ఏమిటో తెలుసుకున్నాక మనం, ఈ యతులను ప్రాస యతులను పద్యాలలో ఎలా ఉపయోగించాలి అనే విషయం చూద్దాము. ప్రాస అంటే "పద్య పాదం లోని రొండో అక్షరం" అని గుర్తు పెట్టుకోండి నిన్న మనం యతుల విషయం లో , పద్య పాదం లోని మొదటి అక్షరానికి పద్యం లో నియమిత స్తానానికి (ఉదా: నాల్గవ గణం మొదటి అక్షరం) యతి చెల్లుతుంది అనుకుంటే, ప్రాస యతి విషయం లో "పద్య పాదం లోని రొండో (ప్రాస) అక్షరానికీ, పద్యం లో నియమిత స్తానానికి ప్రక్కన ఉండే అక్షరానికి (ఉదా: నాల్గవ గణం రొండో అక్షరానికీ) యతి చెల్లు విధంగా రాయడాన్ని ప్రాస యతి అంటారు." అంటే ప్రాస అక్షరాన్ని యతి కి వాడుకుని యదార్ధంగా ఉండాల్సిన యతికి బదులుగా, ఆ పక్కన ఉన్న అక్షరాన్ని వాడుకుంటారు. ఈ విధమైన ప్రాస యతి అన్ని పద్యాలలో పనికి రాదు కొన్ని రకాలైన పద్యాలలో మాత్రమే వాడుకోవచు. ఆవిషయాలు మనం తర్వాత వివరం గా చూద్దాము.

9, జూన్ 2010, బుధవారం

యతి, ప్రాస యతుల వివరణ.

ఈ నాలుగు రోజుల సమయం లో మీరు గణ విభజన గురించి, యమాతారాజభానసలగం గురించి అధ్యయనం చేసి ఉంటారనుకుంటాను. ఇక యతుల గొడవ ఏంటో చూద్దాము.
పద్యం లోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతికి పద్యం లో ఏదో ఒక నిర్దేశిత అక్షరం తో యతి కుదరాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఒక విరామ చిహ్నం గా భావించాలి. ఏక బిగిన పద్యం చదవకుండా, ఎక్కడో ఒక చోట విరామ చిహ్నంగా ఆపుదలకు, పద్యం అందగించడానికి పెద్దలు ఏర్పరచిన నియమం ఇది.
ఇక అక్షరాల మధ్యన ఉండే యతి మైత్రి చూద్దాము. ఒక గుణింతం తీసుకుని ఆ ప్రకారం యతి మైత్రి ని గమనించ వచ్చు.
క గుణింతం తీసుకుంటే....
క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.
కి, కీ, కె, కే ల మధ్యనా..
కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.
ఈ క్రింది యతి మిత్రులు కూడా గమనించండి.
1. అ, ఆ, ఐ, ఔ, య, హ...
2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ
5.చ,ఛ,జ,ఝ, శ, ష, స.
6. ట, ఠ, ద, ధ,
7, ప, ఫ,బ, భ, వ.
8.త, థ, ద, ధ
9.న, ణ, ఙ.
10, ల, ర, ళ .
ఈ అక్షరాల మధ్యన యతి మైత్రి ఉంది కాబట్టి, పద్యం లో నియమిత స్తానం లో ఈ అచ్చు, లేక హల్లుతో గూడిన అక్షరాలను వాడాలి. అవి ఎలాగో వచ్చే పోస్టింగు లో చెప్తాను. ఈ లోపు మీరు ఈ యతి మైత్రుఅలను గుర్తుపెట్టుకోడానికి ప్రయత్నిస్తారు గదా...

4, జూన్ 2010, శుక్రవారం

గణ విభజన వివరణ.

గణ విభజన అనేది, పద్య రచన లో చాల ముఖ్యమైన ఘట్టం. గణాలను సులభంగా గుర్చించడం, పదాన్ని చూడగానే, గణం చెప్పగలగడం, ప్రాక్టీసు మీద గానీ రాదు. ఐతే ధ్యాస అదే విషయం పై ఉంటే సులభం గానె మీరు గణ విభజన చెయ్య గలుగుతారు. చివరలో మీకు దీనిలో ఉన్న చిట్కాలు చెప్తాను.
మొదటగా గణ విభజన చూద్దాము.
1. ఏకాక్షర గణాలు: గ U , ల I
2. రెండు అక్షరాల గణాలు: గలము లేక హగణం: ఉదా: సీత U I
౩. వగణం లేక లగం. ఉదా: రమా. IU
౪.గగం. ఉదా: రామా. ఊఊ
౫. లలం. ఉదా: రమ. II
౬.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.
యమాతారాజభానసలగం. అనే సూత్రం ద్వారా గణాలను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో చూడండి.
1. యమాతా IUU యగణం.
2. మాతారా UUU మగణం.
3. తారాజ UUI తగణం.
4. రాజభా UIU రగణం.
5. జభాన IUI జగణం.
6. భానస UII భగణం.
7. నసల III నగణం.
8. సలగం IIU సగణం.
9. లగం IU వగణం.
10. గం U గగణం.
ఈ గణ విభజనను బాగా బట్టీ పట్టి సూత్రం ద్వారా గుర్తుంచుకోండి. తదుపరి కొన్ని పదాలతో మనం గణ విభజన చేద్దాము.

3, జూన్ 2010, గురువారం

గురు లఘువుల విషయం లో కీలకమైన అంశాలు (గుర్తుంచుకోదగ్గవి)

గురు లఘువుల విషయం చాల ముఖ్యమైనది కాబట్టి, ఒక సారి ముఖ్యమైన విషయాలను, మననం చేసుకుందాం.
౧. ఏక మాత్ర (ఒక చిటికె) సమయం లో పలుక గలిగేవి లఘువులు.
ఉదా: క,కి,కు, కృ, కె, కొ . మొదలైనవి.
౨. ద్వి మాత్రా కాలం లో పలుకగాలిగేవి గురువులు.
ఉదా: కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ, కం, క: మరియూ
సున్నా, విసర్గ, న కార పొల్లు, ఐత్వం, ఓత్వం తో కూడిన అక్షరాలూ, శ్రీ అనే అక్షరం గురువులు.
ఇంకా... ద్విత్వక్షరాలకు, సంయుక్తాక్షరాలకు ముందున్న ఆక్షరములు గురువులు అవుతాయి. ఒక వేళ, ఆ (ద్వి లేక సంయుక్త) అక్షరానికి దీర్ఘం ఉన్నట్టయితే, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. ఉదా: ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ).
పై విషయాలను జాగ్రత గా గమనించండి. వచ్చే పోస్టింగు లో గణ విభజన చేద్దాము.

2, జూన్ 2010, బుధవారం

గురు లఘువులను గుర్తించడం.

ఈ పదాలకు గురు లఘువులను గుర్తిద్దాము.
నస - రొండు లఘువులు - I I
అమల - మూడు లఘువులు. - I I I
కాకి - ఒక గురువు ఒక లఘువు. - U I
కైక - ఒక గురువు ఒక లఘువు.- U I
కోకిల - ఒక గురువు, రొండు లఘువులు.- U I I
కెంపు - ఒక గురువు ఒక లఘువు. - U I
కెల - రొండు లఘువులు. - I I
కౌలు - ఒక గురువు ఒక లఘువు. - U I
కృపాణము - ఒక లఘువు, ఒక గురువు, రొండు లఘువులు. IU II
ఇక సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు చూద్దాము.
ద్విత్వాక్షరాలు: ఒక గురువు మరియూ ఒక లఘువు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు, తర్వాతది లఘువు. - U I
అత్త - - U I
అమ్మ - - U I
అవ్వ -- U I
అక్క - - U I
అన్న - - - U I.

సంయుక్తాక్షరాల సంగతి కొంచెం చూద్దాము.
ఇవి కూడా ముందున్న అక్షరాన్ని గురువు గా మార్చి, ఆ సమ్యుక్తాక్షరం లఘువు గా ఉంటుంది.
రక్తము - U I I
అన్య _ U I
పుణ్య - U I
భ్రుగ్న - U I

ఈ సంయుక్తాక్షరాలలో ఇంకో ట్విస్ట్ చెప్తాను గమనించండి జాగ్రతగా..
ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ) ముందు పదాన్ని గురువు గా మారుస్తాయి, మళ్ళీ ఆ సంయుక్తాక్షరాలు దీర్ఘం తో కూడి ఉన్నాయి కదా అందుకని, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. అంటే రెండు అక్షరాలూ గురువులే నన్నమాట. వచ్చే టపా లో గురులఘువుల సారాంశాన్ని "ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయాలు" చెప్పి గురు లఘువుల గుర్తింపు ముగించి, గణ విభజన కు వెళ్దాము.

గురు లఘువులు.

ఈ గురు లఘువుల లో కొన్ని రకాల బీజాక్షరాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను.
అ,ఆ,ఎ,క,చ,ట,త,ప, య, ష... వీటిని వాయు బీజాక్షరాలు అంటారు.
ఇ,ఈ,ఐ,ఖ,ఛ,ఠ,ధ,ఫ,ర,స.... వీటిని అగ్ని బీజాక్షరాలు అంటారు.
ఉ, ఊ,ఓ,గ,జ,డ,ద,బ,ల,హ ... వీటిని భూ బీజాక్షరాలు అంటారు.
ఋ, ౠ,ఔ,ఘ,ఝ,ఢ,ధ,భ,వ,ళ ... వీటిని జల బీజాక్షరాలు అంటారు.
అం,ఙ,ఞ,ణ,న,మ,అ: ... వీటిని గగన బీజాక్షరాలు అంటారు.
వాయు, అగ్ని,గగన బీజాక్షరాలు పద్యమొదట పెడితే మంచిది కాదు అంటారు.
భూమి, జల బీజాక్షారాలు మొదట నిలిపితే శుభం అంటారు ఆర్యులు.
శ్రీ, కం,కః,నిన్,నున్, ఐత్వము,ఓ త్వములతో గూడినవి గురువులు గా భావించాలి.

ఇక, "కా" గుణింతము ద్వారా, గురు లఘువు లను గుర్తు పట్టగాలిగితే అదే మాదిరి మిగిలిన గుణింతాలను అభ్యాసం చెయ్యవచు.
లఘువులు: క,కి,కు, కృ, కె, కొ .
గురువులు: కా,కీ,కూ,కౄ,కే,కై,కో,కౌ, కం, క:
ఒత్తు ఉన్న అక్షరాలు రొండు రకాలు.
౧. సంయుక్తాక్షరాలు: ఒక హల్లు కింద వేరొక హల్లుకు సంబందించిన గుర్తు ఉంచడం.
ఉదా: ప్మ, క్య, వ్య, త్న మొదలైనవి.
౨.ద్విత్వాక్షరాలు: ఒక హల్లు కింద అదే హల్లు కు సంబందించిన గుర్తులు ఉంచడం.
ఉదా: క్క, ప్ప, మ్మ, య్య, త్త మొదలైనవి.
వీటి పరమార్ధం ఏమిటంటే, ఈ సంయుక్త మరియూ ద్విత్వాక్షరాల ముందు ఉన్న అక్షరాలూ గురువులు గా భావించాలి. మరి ఈ సంయుక్త, ద్విత్వక్షరాలను మాత్రం లఘువులు గా పరిగణించాలి. గురు లఘువులను గుర్తించడం ఎలాగో వచ్చే పాఠాల్లో చూద్దాము.

31, మే 2010, సోమవారం

గురు లఘువు ల గురించి.

పద్యాలు రాయాలంటే మొదట గురువులు, లఘువులు గుర్తించగలగాలి. పద్య రచన లో ఇది మొదటి అంశం. ఆంధ్ర బాషకు అక్షరాలు 56 వీటికి మళ్ళీ గుణింతాల ద్వారా లెక్కకు మించి అక్షరాలు తయారవడం మనందరికీ సుపరిచితమే!
అయితే గురువు అంటే ఎమిటి? లఘువు అంటే ఎమిటి? అనే విషయాన్ని చూద్దాము.
ఏక మాత్ర కాలం లో ఉచ్చరించ గలిగేది లఘువు అంటారు. ద్విమాత్రా కాలాన ఉచ్చరించ గలిగేది గురువు అంటారు. అర్ధం కలేదా? ఒక మాత్రా కాలం అంటే ఒక చిటిక వేసే కాలం అనుకోండి. చేతితో ఒక చిటిక వేసే కాలం లో లఘువు ను పలక వచ్చు. రొండు చితికలు వేసే కాలం గురువు పలకడానికి పడుతుంది.
లఘువు అంటే తేలికైనది, సులువైనది. గురువు అంటే కొంచెం కష్తమైనదీ, పలకడానికి దీర్ఘంగా ఉండి, కఠినంగా ఉన్నది అని కూడ అంటారు.
గురువు కు గుర్తు గా "U" అనే గుర్తును వాడుతారు.లఘువు కు గుర్తు గా "I" అనే గుర్తును వాడుతారు.
మొదట మన అక్షరమాల లోని అక్షరాలను చూద్దాము.
లఘువులు: అ,ఇ,ఉ,ఋ,ఎ,ఒ,క,ఖ,గ,ఘ,చ,ఛ,జ,ఝ,ట,ఠ,డ,ఢ,ణ మొదలుకొని క్ష వరకు.
గురువులు: ఆ,ఈ,ఊ, ౠ,ఏ, ఐ, ఓ, ఔ, అం, అః
మొదట వీటి వ్యవహారాన్ని కాస్తా గమనించండి.
తర్వాతి పాఠం లో గుణింతాలు వాటి ద్వారా వచ్చే, గురు, లఘువులు చూద్దాము.

పద్య రచన మొదలెడదామా?

పద్యం అనగానే కొన్ని కీలక విషయాలు ఉంటాయి.
౧. గురు లఘువుల నిర్దేశ్యం.
౨.గణ విభజన చేసుకోవాలి.
౩. యతి నియమం చూడాలి.
౪. ప్రాస నియమం చూడాలి.
౫. పాద నియమం.
వీటిని మనం విడి విడి గా నేర్చుకుందాము.

తెలుగు బాష కు కమ్మదనం పద్యమే!

మన తెలుగు బాష కు కమ్మదనం తెస్తుంది పద్యం. మనం పల్లెటూర్లలో జనం "జండాపై కపిరాజు" అని పాడుకోవడం ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. పండితులు కానీ, పామరులు కానీ, అందరికీ పద్యం అంటే ఇష్టమే. ఒక్క పద్యమైనా రాని తెలుగు వాడిని చూపించండి చూస్తాము. తెలుగు వారి వేయి సంవత్సరాల తార తరాల సంపద మన పద్యం. కానీ ఇటీవల గద్య కవితలు, హైకూలు, నానీలు, నానోలు వచ్చేసి, ఈ పద్యాన్ని కొంచెం వెనక్కు నెట్టాయి. ఛందో భూయిష్టమైన పద్యం అవడం తో దాన్ని విడిచి పెట్టారు.
క్రీస్తు పూర్వమే సంస్కృత శ్లోకాలు ఉన్నప్పటికీ, మన తెలుగు పద్యం లాగ వాటిల్లో యతి ప్రాసలు లేవు. ౧౦ వ శతాబ్దం లో నన్నయ్య తెలుగు లో ఆంధ్ర మహా భారతం రచించి
తెలుగు పద్యాలకు శ్రీకారం చుట్టాడు. అంతకు ముందు కూడా తెలుగు రచన వున్నది. అయితే తెలుగు పద్యాన్ని తీర్చి దిద్దిన ఘనత మాత్రం నన్నయ్య భట్టారకుల వారిదే అని చెప్పవచ్చు.

తెలుగు లో మొట్టమొదటి పద్యం.

తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందఱో పెద్దలు పద్యాలు రాసి ఉంటారు, అయితే శాసనాలు లభించిన మేరకు యీ పద్యం మొదటిది గ ఆర్యులు చెప్తూ ఉంటారు.
యీ తరువోజ రాసిన మహానుభావునికి నమస్కరాలర్పిస్తూ మనం పద్య రచనకు సాగుదాం.

12, మే 2010, బుధవారం

పద్యం రాయాలంటే ఏమి కావాలి?

మొదట మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు చెప్తాను. తెలుగు బాష మీద ఆసక్తి ఉండాలి. తెలుగు లో మంచి పదాలను వాడడం వాటి అర్ధాలు బాగా తెలిసి ఉండాలి. వేమన శతకం, సుమతి శతకం లాంటి శతకాలను బాగా చదవాలి. వీలైనన్ని పద్యాలను చదవండి. పద్య రచన అంత కష్టం ఏమీ కాదు. కొంచెం శ్రద్ధ, ఆసక్తి కావాలి. గణాలు, ఛందస్సు అంటూ భయపడకండి. అవన్నీ ఆసక్తి వుంటే అన్నీ వచ్చేస్తాయి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. తెలుగులో (వొకాబులరీ) వీలైనన్ని పర్యాయ పదాలు, నానార్ధాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఏదైనా గ్రంధం, ప్రభందం చదవండి. ఉదా: భారతం, భాగవతం లాంటి గ్రంధాలు, వాటి హృదయోల్లాస వ్యాఖ్యానాలూ, చదివి పద్య రచన లోని మాధుర్యాన్ని గమనించండి. అలాగే, చిన్నయ సూరి బాల వ్యాకరణం చదవండి. సంధులు, సమాసాలూ, వంట బట్టించుకోండి. అయితే ఇవేవీ లేకుండా, కూడా మీకొచ్చిన సులభ భాషలో కూడా రాయొచ్చు. వచ్చే పోస్టింగు లో కాస్తా వివరంగా చెప్తాను.