కంద పద్యం రాయడమే కష్తం అనుకుంటారు అందరూ.. కానీ కందం తో సాము గరిడీలు (వ్యాయామాలు), గారడీలు చేసిన వాళ్ళను చూస్తే ఒకింత ఆశ్చర్యం విస్మయం కలుగక మానదు. నన్నెచోడుడు ఆ విధమైన గారడీలు ఎన్నో చేసాడు. ఒక పద్యం ద్వారా మీకు ఆ గారడీ ఎమిటొ మనవి చేసుకుంటాను.
చతుర్విధ కందం అంటె కవి ఒక కంద పద్యాన్ని రాస్తాడు. దానిలో నుండి ఇంకో మూడు కంద పద్యాలను ఏ అక్షరమూ మార్చకుండా తయారు చేసుకోవాలి.అలా చేయ్యలంటే కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. మొదటి కంద పద్యం లోని రొండవ చరణం లోని రొండవ గణాన్ని తీసుకుని అక్కడనుండి చదివితే కొత్త పద్యం రావాలి. ఈ కొత్త పద్యం రొండవ గణాన్ని తీసుకుని అక్కడనుండి చదివితే మరలా ఇంకో కొత్త పద్యం రావాలి.
కుమార సంభవం లోని ఒక పద్యం చూద్దాము.
మొదటిది:సుజ్ఞాన యోగ తత్వవి - ధిజ్ఞుల్ భవ భందనముల ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక - ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచన భావన దవులన్.
రెండవది:రెండవ చరణం "భవభం" అనే అక్షరాలతో మొదలైంది.
భవ భందనముల ద్రెంచుచు - భువిలో నజ్ఞానపదము బొందక ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచన భావన - దవులన్ సుజ్ఞాన యోగ తత్వవిధిజ్ఞుల్.
చూసారా ఎంత తమాషానో: మొదట్లో ఉన్న పాదం మళ్ళీ చివరలో తగిలించేసాడు.
ఇంకా ఉంది ఈ గారడీ:
మూడవది: అజ్ఞాన అనే పదం తో మొదలవుతుంది.
అజ్ఞాన పదము బొందక - ప్రాజ్ఞుల్ శివుగొల్తు రచన భావన దవులన్సుజ్ఞాన యోగ తత్వవి - ధిజ్ఞుల్ భవ భందనముల ద్రెంచుచు భువిలో.
మళ్ళీ ఇంకో కందం ఇలాగే:
శివుగొల్తు రచన భావన-దవులన్ సుజ్ఞాన యోగ తత్వవిధిజ్ఞుల్ భవ భందనముల ద్రెంచుచు - భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్.
ఆది కవి అన్న బిరుదు లేకుండా పోయినా నన్నె చోడుడు మంచి మొనగాడు. ఆద్యుడు. కొన్నిటికి ఒరవడి పెట్టాడు. ప్రభందాలలో: ఇష్త దేవతా ప్రార్ధన, పూర్వ కవిస్తుతి, కుకవి నింద, గ్రంధ కర్త స్వవిషయాలు, కృతిపతి వర్ణన, షష్త్యంతాలు మొదలైనవాటికి ఆద్యుడు. ఈయన ఒరవడి తర్వాతి తరాల వారికి మార్గ దర్శకమైంది.
నన్నె చోడుడు మొదలెట్టిన విధానాలు తర్వాతి కాల కవులు విపరీతంగా అనుసరించడం తో వెర్రి వెయ్యి విధాలు అన్న రీతికి వచ్చింది. తర్వాతి కాలలో వచ్చిన చిత్ర కవిత్వం వింత గానే ఉంది. వేలం వెర్రీ అయింది.
ఇలాంటి చిత్ర కవిత్వ ప్రక్రియలను చేసిన గ్రంధాల పట్టిక చాలా పెద్దగానే ఉంది. మొత్తం ముప్పై నాలుగు గ్రంధాలు తేలాయి లెక్కకు. ఐతే చిత్ర కవిత్వం చిత్రాల కోసమేనా? నేతి బీర కాయలో నెయ్యి ఎంత వుందో వెదికినట్టు ఈ చిత్ర కవిత్వాలలో కవిత్వం కోసం వెదకడం కూడానా!

1 కామెంట్:
నేను మొదటిసారిగా మీ పేజీని సందర్శఇంచాను. మీరు నన్నెచోడుని గురించి వ్రాసింది చాల ప్రశంసనీయంగా ఉంది. ఈ బ్లాగ్ పోస్ట్ ను నా పాఠకులు కూడ చదవటానికి వీలుగా నా బ్లాగ్ లో మీకు లింకును ఉంచుతున్నాను.
నాబ్లాగ్ ప్రాబ్లెమ్స్ఆఫ్ తెలుగుస్ బ్లాగ్ స్పాట్.కామ్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి