మనం ఇంతకు ముందు నేర్చుకున్న పద్యాలన్నీ ఒక ఎత్తైతే, కంద పద్యం ఒక యెత్తు. కంద పద్యానికి నియమాలు ఎక్కువ. అందుకే కందం రాసిన వాడే కవి, పందిని (ముళ్ళ పంది/అడవి పంది) ని బొడిచిన వాడే బంటు అంటారు. ముఖ్యం గా శతకాలు ఈ చందస్సు లో ఉంటాయి. దీని నియమాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొవలసిన అవసరం ఉంది.
1. ఈ పద్యానికి చతుర్మాత్ర గణాలు మాత్రమే వాడాలి.
2. 1, 3 పాదాలలో మూడేసి గణాలూ..2, 4 పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి.
3. అంటే 1, 2 పాదాలలో 8 గణాలు, 3, 4 పాదాలలో 8 గణాలూ ఉంటాయి.
4. 2 పాదాలను ఒక "సెట్టు" గా (అంటే మొదటి 2 పాదాలలో ఉన్న 8 గణాలూ) భావించాలి.
5. 1, 3, 5, 7 గణాలలో "జగణం" ఉండరాదు.
6. 6 వ గణం లో తప్పనిసరిగా "జగణం" లేక "నలము" ఉండాలి.
7. 8 వ గణం లో చివర తప్పనిసరిగా గురువు ఉండాలి.
8. మొదటి పాదం గురువు తో మొదలైతే, అన్ని పాదాలూ గురువు తో, మొదటిపాదం లఘువు తో మొదలైతే, అన్ని పాదాలూ లఘువు తో మొదలవ్వాలి.
9. 2,4 పాదాలలో యతి మైత్రి ఉంది. ఈ పాదాలలో, మొదటి గణం మొదటి అక్షరానికీ..నాల్గవ గణం మొదటి అక్షరానికీ ఈ నియమము ఉన్నది.
10. ప్రాస నియమము ఉన్నది.
దీన్ని గురించి చాలా వివరంగా తెలుసుకోవలసి ఉన్నది.
ప్రస్తుతానికి చతుర్మాత్రా గణాలు అంటే ఎమిటో చెప్పి ముగిస్తాను.
అ. భగణం UII
ఆ. జగణం IUI
ఇ. సగణం IIU
ఈ.నలము IIII
ఉ.గగము. UU
పై ఐదు గణాలను మాత్రమే కంద పద్యం రాయడానికి ఉపయోగించాలి.
తరువాటి పాఠం లొ మరిన్ని వివరాలను చూద్దాము. స్వస్తి.
మీ స్పందన తెలియజేస్తారుగా!
4, ఆగస్టు 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
ఒక సందేహం: "ళ" కి, "ల" కి ప్రాస కుదురుతుందా? అంటే, యతి-మైత్రి ఉన్న అక్షరాలని ప్రాస కి వాడొచ్చా?
అసంఖ్య గారూ,
ల,ళ ప్రాస పండితామోదమే. వాడవచ్చు. ఇందుకు మహాకవుల ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.
శంకరయ్య గారూ..నా తరఫున శ్రమ తీసుకుని జవాబిచ్చినందుకు ధన్యవాదాలు!
చెల్లని కాసును నేనట
అల్లన మెలమెల్లంగా సాగెడి కందమునైనా
ఉల్లము రంజిల పాడెద
ఫుల్ల కుసుమ నయనీ, శారద దయగనుమా!
అయ్యా! నాకు ఉత్సాహం తప్ప నియమాలు ఎలా పాటించి నా భావం వచ్చేలా పద్యం రాయాలో తెలీలేదు.
దయచేసి కొంచెం సరిదిద్దమని ప్రార్థన.
అయ్యా! ఇలా పద్యాలు సరిదిద్దలంటే చాల సమయము పడుతుంది. మీరు
మొదట ఎవరైనా రాసిన కంద పద్యాలు బాగా పరిసీలించండి.
వాటిని నేను ఇచ్చిన పద్ధతి లో గణ విభజన చేసి చూడండి.
Please give me yr ID for sending corrected one and for comments at my liesure.
THANQ SIR! I WILL CONTACT YOU.
కామెంట్‌ను పోస్ట్ చేయండి