• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

23, ఆగస్టు 2010, సోమవారం

కంద పద్యము

కంద పద్యము ఎలా రాయలో చూసాము. ఇప్పుడు ఒక పద్యం గణవిభజన చేసి చూద్దాము.
బలవంతుల సొత్తాయెను స్తల జల తరునిధులు వసుధ సామ్మన్యులకున్.
ఇవి ఒకటి రొండు పద్య పాదాలు.
మొత్తం 8 గణాలు ఉండాలి కదా! చూద్దాము.
మొదటి పాదం - మూడు గణాలు ఉండాలి.
బలవం - సగణం
తులసొ - సగణం
త్తాయెను - .భగణం
చతుర్మాత్రా గణాలలోవి వచ్చాయి కదా! (భ, జ, స, నల, గగలు)
ఒకటి, మూడు, ఐదు, యేడు గణాలలో "జ" గణం ఉండ రాదు.ఒకటి, మూడు గణలలొ జగణం లేదు.
ఇక రొండో పాదం చూద్దాము.
స్తలజల - నలము తరునిధు - నలము లువసుధ - నలము సామా - గగము న్యులకున్ - సగణం
మిగతా నియమాలు చూద్దాము.ఒకటి, మూడు, ఐదు, యేడు గణాలలో "జ" గణం ఉండ రాదు.
ఐదు, యేడు లలో జగణం లేదు.
ఆరవ గణం జగణం లేక నలము కానీ ఉండాలిఆరవ గణం నలము ఉంది.ఎనిమిదవ గణం చివర గురువు ఉండాలి.ఎనిమిదవ గణం "కున్" కనుక గురువు, సరిపోయింది.
రొండవ పాదం లో మొదటి గణమైన "స్త" కు నాల్గవ గణమం లో మొదటి అక్షరం "స" కు యతి మైత్రి సరిపోయింది.
పాదాలలో ప్రాస నియమము "ల" సరిపోయింది.
ఇదే విధంగా కొన్ని పద్యాలు చూసి గణవిభజన చేసి, తర్వాత రాయడంప్రారంభించండి. స్వస్తి.

2 కామెంట్‌లు:

రాధేశ్యామ్ రుద్రావఝల చెప్పారు...

అయ్యా!,
మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. ఛందస్సు గురించి పెద్దగా తెలియని నా బోటి వారికి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు.

కందపద్యాల నియమాలను చదివిన మీదట ఈ క్రింది పద్యం వ్రాశాను. యతి ఎలా సాధించాలో తెలియలేదు. అసలు మిగిలిన నియమాలు కూడా సరిపొయాయా లేదా సరిచూచి మీ అభిప్రాయాన్ని చెప్పగోరుతాను.

నమ్మితి నిను యుల్లంబున
నమ్మితి చరణారవింద యుగ్మము నిజమున్
నమ్మితి సాగర సంసా
రమ్మును నడి లోతులోన దాటింప తగున్

నమ్మితి యుల్లంబందున
నమ్మితి శ్రీ వేంకటపతి పద పద్మములన్
నమ్మితి సాగర సంసా
రమ్మిలలో మొల లోతున దాటింతుననిన్

నమ్మితి యుల్లంబందున
నమ్మితి శ్రీ వేంకటపతి పల్లవ పదమున్
నమ్మితి సాగర సంసా
రమ్మిలలో మొల లోతున దాటింతుననిన్

(నాకు ఇదివరకు పద్యాలు వ్రాసిన అనుభవం లేదు. మొన్ననే శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి బ్లాగులో మత్తకోకిల వృత్తం గురించి చదివి ప్రయత్నించాను.అది కూడా వీలు చూసుకొని చదవమని ప్రార్ధన.
http://radhemadhavi.blogspot.in/2013/04/blog-post_6.html)
మీ సలహాకై ఎదురుచూస్తూ..
నమస్కారాలతో
- రాధేశ్యామ్

రాధేశ్యామ్ రుద్రావఝల చెప్పారు...

రమ్మిలలో మొల లోతున దాటింతు’వ’నిన్ అని వ్రాయాలి పొరపాటున దాటింతుననిన్ అని టైపు చేసాను.