• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

12, మే 2010, బుధవారం

పద్యం రాయాలంటే ఏమి కావాలి?

మొదట మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు చెప్తాను. తెలుగు బాష మీద ఆసక్తి ఉండాలి. తెలుగు లో మంచి పదాలను వాడడం వాటి అర్ధాలు బాగా తెలిసి ఉండాలి. వేమన శతకం, సుమతి శతకం లాంటి శతకాలను బాగా చదవాలి. వీలైనన్ని పద్యాలను చదవండి. పద్య రచన అంత కష్టం ఏమీ కాదు. కొంచెం శ్రద్ధ, ఆసక్తి కావాలి. గణాలు, ఛందస్సు అంటూ భయపడకండి. అవన్నీ ఆసక్తి వుంటే అన్నీ వచ్చేస్తాయి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. తెలుగులో (వొకాబులరీ) వీలైనన్ని పర్యాయ పదాలు, నానార్ధాలు తెలుసుకోండి. ముఖ్యంగా ఏదైనా గ్రంధం, ప్రభందం చదవండి. ఉదా: భారతం, భాగవతం లాంటి గ్రంధాలు, వాటి హృదయోల్లాస వ్యాఖ్యానాలూ, చదివి పద్య రచన లోని మాధుర్యాన్ని గమనించండి. అలాగే, చిన్నయ సూరి బాల వ్యాకరణం చదవండి. సంధులు, సమాసాలూ, వంట బట్టించుకోండి. అయితే ఇవేవీ లేకుండా, కూడా మీకొచ్చిన సులభ భాషలో కూడా రాయొచ్చు. వచ్చే పోస్టింగు లో కాస్తా వివరంగా చెప్తాను.

2 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
పద్యం ఎలా రాయాలొ చక్కగా వివరించారు. మీ సైటు చాలా బాగుంది ఇంకా బోలెడు ఉన్నాయి అన్నీ చూడాలి కద ఫొటోలు కుదా చాలా ఉన్నయి అన్నీ చూసాక మళ్ళీ రాస్తాను సెలవు

Dr.R.P.Sharma చెప్పారు...

మీ బ్లాగ్ బాగుంది.సహితీ జిజ్ఞాసువులకు ఉపయోగకరం.

కవిత్వ రచనకు 1. ప్రతిభ 2.వ్యుత్పత్తి 3. అభ్యాసం అనే మూడు అవసరమని మన పెద్దలు చెప్పారు.

కవిత్వాన్ని ఎలా అభ్యసించాలో మునుముందు మీ టపాల్లో చదవాలని ఆసక్తిగా ఉంది.