• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, మే 2010, సోమవారం

తెలుగు లో మొట్టమొదటి పద్యం.

తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందఱో పెద్దలు పద్యాలు రాసి ఉంటారు, అయితే శాసనాలు లభించిన మేరకు యీ పద్యం మొదటిది గ ఆర్యులు చెప్తూ ఉంటారు.
యీ తరువోజ రాసిన మహానుభావునికి నమస్కరాలర్పిస్తూ మనం పద్య రచనకు సాగుదాం.

2 కామెంట్‌లు:

rākeśvara చెప్పారు...

చాలా మంచి సమాచారం। నావి కొన్ని ప్రశ్నలు।
దీనిని ప్రదమముగా లభించిన పద్యం అంటే బాగుంటుంది। దీని ముందరి పద్యాలు శాసనాలకు ఎక్కకపోవడమో, ఎక్కిన శాసనాలు కాలగర్భంలో కలసిపోవడమో జరిగివుంటాయి।
కన్డుకూర్ అనే వుందా లేదా కణ్డుకూర్ అని వుందా?
మెచ్ఛి అని వ్రాసారు రెండవ చ కి వత్తు వుండదేమో। మీరు ఆంగ్లంలో టైపడి దానిని తెలుఁగులోనికి మారుస్తున్నట్టున్నారు।

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

సర్, రాకేశ్వర రావు గారూ..లేఖిని ద్వారా టైపు చెయ్యడం వల్ల వచ్చే పొరబాట్లు అవి. సరి చేస్తాను.