• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

22, జులై 2010, గురువారం

తెలుగు భాష చరిత్ర.

నేను ఇటీవల తెలుగు బ్లాగులు చూస్తూ ఉంటె, "వసంత మాలిగై" అనే బ్లాగు లో ఉన్న ఆంధ్రుల చరిత్ర వ్యాసం నన్ను బాగా ఆకర్షించింది. మీతో పంచుకుందామని మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాను. చదివి ఆనందించండి.

తెలుగు,భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు.తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు. క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.

తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు వెళ్తే తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినది.
ఆంధ్రులగురించి చెప్పిన పద్యములలో ఒక పద్యం
"పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి"
(ఈ విషయం నేను ఇంతకూ ముందే నా బ్లాగు లో ఇచ్చాను)
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.
అజ్ఞాత యుగము: క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:
ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం లబ్ధ సారస్వతము: క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం క్రీ.పూ. 28 ముందు:ఆంద్రదేశం అనే పదం ఎలా వచ్చిందంటే: ఈ కాలంలో "ఆంధ్ర" అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలలో ఉంటున్నది గాని "తెలుగు" అనే పదం ఎక్కడా లభించడంలేదు. అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కాని భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు.
అయితే ఆంధ్రులు, తెలుగులు కలసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపు దిద్దుకొన్నది గనుక "ఆంధ్ర దేశం" ప్రస్తావననే కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు. తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణా గోదావరీ ప్రాంతం తెలుగు దేశమని పిలువబడేదని,తమిళ,మళయాళ,కన్నడ భాషలలాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. క్రమంగా మిగిలినవానికి భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటివారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏమైనా తెలుగు భాష తక్కిన (మాతృక) భాషలనుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కాలేదు.
మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతోంది.
తెలుగుబాష వ్యవాహారం :భాషనుబట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాఙ్మయం పుట్టదు. ఇలా చూస్తే క్రీ.శ. 1000 ప్రాంతంలో పరిణత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాలనుండి వ్యవహారంలో ఉండి ఉండాలి. భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనినిని ఉపయోగించాలని వ్రాశాడు. పై కారణాల వలన "ఆంధ్ర భాష" లేదా "తెలుగు భాష" క్రీ.పూ. నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది
"తెలుగు భాష వయస్సెంత?" అనే ప్రశ్నకు సరైన జవాబు లేదు కాని కొంతమంది రచయితలు తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశారు.
క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు (అజ్ఞాత యుగ0):క్రీ.పూ. 500 - క్రీ..త. 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మతోన్నతులు, పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్ర కారుల అభిప్రాయం.
ఈ కాలానికి సబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
***ఇప్పటికి తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. "లిపికి ముందే సారస్వతము ఉండవచ్చును గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానములో, మోహపుం గాసట బీసట యల్లికలో యై శృతి పరంపరాగతములై యుండును. లిపి మూలమున వాఙ్మయము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందునను తెనుగున వాఙ్మయము లిపి నిర్మాణానంతరమే ఆరంభమై యుండును". కనుక ఈ కాలంలో తెలుగు సారస్వతం లేదనే భావించవచ్చు.
***శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చు.
***బౌద్ధ జైన మతాలు విలసిల్లిన కాలలో ఎంతో కొంత సాహిత్యం లిఖితంగా కాని, మౌఖికంగా గాని ఉండి ఉండాలి. అయితే తరువాత విజృంభించిన శంకరవాదము, వీరశైనం కాలంలో మతోద్రేకాల కారణంగా బౌద్ధ జైన మత సంస్థల నాశనంతో పాటు ఎంతో సారస్వతం కూడా దగ్ధమైయుండవచ్చును. మతోద్రేకము ఎంతకైనా దారి తీయగలదు. కాకుంటే నన్నయ భారతం వంటి ఉద్గ్రంధం ఒక్కమారు ఆకసంనుండి ఊడిపడదు కదా? జైనపండితులు ఆ సమయంలో కన్నడ దేశానికి తరలిపోయి ఉండవచ్చు.
***ప్రాచీనాంధ్ర వాఙ్మయం లభించకున్నాగాని పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి మొదలైన తెలుగువారు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలను బట్టి చూస్తే తెలుగు భాషలో సాహిత్య పరంపర ఉండదనుకోవడం అసహజంగా కనిపిస్తుంది.
ఆంధ్రులు కవులుగా నున్నయెడల ఆంధ్రమున కవిత్వము లేదనుట ఆశ్చర్యం. అయితే అప్పటిమత ఘర్షణలలో "విజయం" సాధించిన స్థానిక బ్రాహ్మణులకు సంస్కృతమే ఆదరణీయంగా ఉండేది గనుక తెలుగు లిఖిత సాహిత్యం పూర్తిగా నిరాదరణకు గురై ఉండవచ్చు.
మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదములు:
""అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం""అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ "" పూర్వాంధ్రభాష (తెళుగు) లక్షణాలు ఇవి కావచ్చు: 1.ఆర్యావర్తంలో సామ్రాజ్యం స్థాపించి సప్తశతివంటి ప్రాకృత గ్రంధాలు వ్రాసిన "కర్ల తెల్లంగు" రాజుల మాతృభాష కనుక శుద్ధ సంస్కృతంకంటే ప్రాకృత పదాలే ఎక్కువగా ఉండవచ్చును. 2.అప్పటికి బౌద్ధ జైన ప్రాబల్యమే తెలుగు సీమలో అధికం గనుక సారస్వతం కూడా వారిదే అయిఉండవచ్చును. 3.అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు. క్రీ.త. 500 నుండి 1000 వరకు (శాసనాధారాలు): సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు. వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో, లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు. కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది.కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశొకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి. తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు.నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలియ జేస్తాను. సెలవు.

17 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

అద్భుతమైన వ్యాసం అందించారండీ. ఇంతకీ నాగబు అనే పదానికి అర్థమేమిటి, మీకు తెలిస్తే చెప్పగలరు?

అలాగే వసంత మాలిగై బ్లాగు లింకు ఇవ్వగలరు.

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడ బూర్జువా వాళ్ళ గురించి రాయకపోవడం కడు శోచనీయం

తార చెప్పారు...

వెంకటప్పయ్యగారు,
చాలా బాగా రాసారు,
తెలుగు, తమిళ బాషలకి మూల బాష ఒకటి ఉన్నది, అది ఏమిటొ కుడా ఎవరికీ తెలియదు.
అవశేషాలని బట్టి బాష ప్రాచీనతను నిర్ణయించటం భావ్యం కాదు, ఎందుకో మనకి సంసృత బాష విషయంలో తెలిసినది, ఎంత ఐనా మనమే మన బాషాభివృద్దికి పాటుపడాలి, దాని మూలాలని వెతుక్కోవాలి అంతే తప్ప ఎవరో వస్తారని, ఎదో చేస్తారని మనం చేతులు కట్టుకు కుర్చోకూడదు.

అజ్ఞాత చెప్పారు...

పూర్వాంధ్ర అబ్బాయి మరియు
ఒక పచ్చిమగోదావరి అమ్మాయి
ఓట్ల తోట లో కూర్చుని ఏం మాట్లడుకున్నారంటే…

“ఇక్కడ మట్టి అంత సారవంతమైనది కాదులే, అందుకే చెట్లు అంత ఏపుగా పెరగలేదు అని అన్నాడు తలనిండా చుండ్రామణి. మా కోనసీమలో ఓట్లు అంతగా పెరగదు. గోట్లు, బూట్లు ఎక్కువగా పెరుగుతాయి అని అంది మందమతి. మీ కోనసీమలో ఎక్కువగా పండేది మచ్చల గోట్లు. మా విజయనగరం ఓట్ల కంటే చాలా ఖరీదైనది కదా, అందుకే మీ కోనసీమ అంత రిచ్ అన్నాడు తలనిండా చుండ్రామణి.

చుండ్రామణి తల బరుక్కుంటూ దేవుడు ఓట్లను పుట్టిస్తే ఓట్లను తినే మనుషులను ఎందుకు పుట్టించాడు? ఇది ప్రకృతి సహజం. ఓట్లే మనుషులను తింటే అది దేవుడి సృష్టి అని నమ్ముతాను. మనుషులను తిను అని ఓట్లకు, గోట్లకు చెప్పక పోవడం దేవుడి తప్పుకాదా? అని పిడికిలి బిగించాడు. అతని పిడికిలి నిండా వచ్చిన చుండును అపురూపంగా చూసింది మందమతి.

ఏంటి మీకు ఈ విద్యలు కూడా వచ్చా? విబూధి సృష్టించారా? అని సంబరంగా అడిగింది.

థూ అలాంటి పనికిమాలిన విద్యలు ప్రదర్శించేది బాబాలు బైరాగులు. ఇది చుండు, అందుకే నా పేరు తలనిండా చూడామణి అని గర్వంగా అన్నాడు.

మందమతి వ్యాయామం చేయకపోయినా గంటకు 30 కిలోమిటర్ల వేగంతో ఒరిస్సా అడవుల వైపు దూసుకుపోయింది

అజ్ఞాత చెప్పారు...

ఇలా నిఖార్సుగా నిగ్గతీసే మీ లాంటి తెలుగు వాళ్ళు కావాలి

రాజు సైకం చెప్పారు...

// 3.అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు. //


గురువు గారు,
అంటే ఇప్పుడు మొత్తం తెలుగు లో ఉన్న పదాలు 14,814 అనా??
తత్సమ శబ్దాలు, తద్బవాలు , శుద్ద దేశ్య పదాలు అంటే వివరించగలరు..

మంచి వ్యాసం .. ధన్యావాదాలు

రాజు సైకం

guruvu gaaru

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

సౌమ్య గారూ.

క్రీ.శ. ఒకటో శతాబ్దికి చెందినదిగా భావిస్తున్న అమరావతి బౌద్ధస్థూపంపై నున్న ''నాగబు'' అనేది మొట్టమొదటి తెలుగు పదంగా భావించబడుతోంది. 'నాగబు' అంటే 'నాగము' అని అర్థం.

నాగబును తెలుగు పదం అని మొదటిసారిగా గుర్తించినవారు వేటూరి ప్రభాకర
శాస్త్రి. అయితే దీన్ని పురాతత్వవేత్తలు సమర్థించరు. అమరావతిలో దొరికిన శాసనాల లో చాలాచోట్ల 'నాగబుధనికా' 'నాగబుధనో' వంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాట తో దొరికినది ఒక రాతి ముక్క అని, అది 'నాగబుధనో' లేదా ' నాగబుధనికా' వంటి మాట కల శాసన శిల పగిలిపోగా 'నాగబు' అన్న భాగం మాత్రమే ఉన్న ముక్క మనకు లభించి
ఉండవచ్చ నీ వారు అంటారు. అయితే వేటూరి వారి అభిప్రాయాన్ని పూర్తిగా
కొట్టిపారవేయలేము. ఎందు కంటే నివబు (నెపం), వక్రబు, పట్టణబు వంటి మాటలు మనకు 575 నించి దొరుకుతున్న తెలు గు శాసనాలలో కనిపిస్తూనే ఉన్నాయి. కనుక బు-ప్రత్యయం కల పదాలు ఆనాడు వాడుకలో ఉండేవి అనటానికి ఇవి సాక్ష్యం అవుతై. అందువల్ల నాగబు తెలుగు మాట కాదు అనలేము.

సురేష్ బాబు చెప్పారు...

##మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతోంది##
ఇదొక్కటి కొద్దిగా సరైనది కాదనిపిస్తోంది.
ఋగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదటిసారిగా "ఆంధ్ర దేశం" అని ఉపయోగించబడింది.
ఇందుకు సంబంధించిన శ్లోకం

"తుంగా కృష్ణా తథా గోదా సహ్యాద్రి శిఖరావధి|
ఆ ఆంధ్రదేశ పర్యంతం బహ్వృచశ్చాశ్వలాయనీ" (33.6)

ఋగ్వేదం క్రీ.పూ 2000 సంవత్సరాల క్రితంది కదా.

చాలా బాగా చెప్పారు. ఇలాగే కొనసాగండి.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

రాజు సైకం గారూ...

సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అంటారు. ఇలాంటి తత్సమ, తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత మరియు ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.

తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు నిఘంటువులు వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు

ప్రకృతి............వికృతి
అంబ ........... అమ్మ
అక్షరము............ అక్కరము
అగ్ని............ అగ్గి
అద్భుతము............ అపూర్వము, అబ్బురము
అనాధ............ అనద
అమావాస్య............ అమవస
ఆకాశము............ ఆకసము
ఆధారము............ ఆదరువు

gaddeswarup చెప్పారు...

From the discussion in Telugupadam

"నాగబు అనే మాటను మొదటగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆవిష్కరించారు.
అది వొక విరిగిన రాతి పలక మీద కనుగొన్నారు. ...
తరువాతి కాలంలో విరిగిన రెండవ ముక్కని కూడా కలిపి చూస్తే అది నాగబు కాదు నాగబుద్ధ అని తెలుసుకొన్నారు.
నాగబు సుమారు ౨౦౦౦ ఏళ్ళనాటిది అయితే దానికంటే పాతది అయిన గాధా సప్తశతి లో అనేకమైన తెలుగు పదాలు వున్నాయని తిరుమల రామచంద్ర గారు నిరూపించారు. కనుక నాగబు అంటే అర్థం లేదు. నాగబుద్ధగా చదువుకోవాలి."

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

గద్దె స్వరూప్ గారూ!
నేను సౌమ్య గారికి ఇచ్చిన వ్యాఖ్య లో మీరు చెప్పినదంతా చెప్పాను. గమనించ లేదనుకుంటాను. ఒక సారి చదవండి.

ధన్యవాదలతో...

gaddeswarup చెప్పారు...

నిజమే చూడలేదు.
వేరే సందేహం తెలుగులో మూలపదాలనుంచి వేరే వేరే మాటలు చేసే సూత్రాలు ఉన్న పుస్తకాలు మంచివి ఏమైనా చెప్పగలరా. ఎందుకంతే త్వరలో హైదరాబాదు వసున్నాను. వీలైతే అలాంటి పుస్తకాలు కొనుక్కొని తెలుగు కొంచెము అభివ్రుద్ధి చేసుకుందామని ఉంది.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

గద్దె స్వరూప్ గారూ.. మీ ప్రశ్న నిజంగానే నాకు అర్ధం కాలేదు."మూలపదాలనుంచి వేరే వేరే మాటలు చేసే సూత్రాలు ఉన్న పుస్తకాలు " అంటే ఎమిటి? నాకు తెలిసినంత వరకూ వ్యాకరణ గ్రంధాలు చెప్తాను ప్రయత్నించండి.

1. కేతన రాసిన "ఆంధ్ర బాషా భూషణం"
2. విన్నకోట పెద్దన రాసిన "కావ్యాలంకార సంగ్రహము"
3. ఆనంతుని "ఛందో దర్పణం"
4. ముద్దరాజు రామన రాసిన "కవి జన సంజీవని"

ఈ పుస్తకాలు చూడండి. ఇందులో తత్సమాలు, తధ్భవాలు, గ్రామ్యాలు, దేశ్యాలు వివరించ బడ్డాయి. నేను పలువురు అడుగుతున్న కారణం గా "తత్సమాలు, తధ్భవాలు, గ్రామ్యాలు, దేశ్యాలు" మీద ఒక పోస్టింగు రాస్తాను త్వరలో. సెలవు.

gaddeswarup చెప్పారు...

Venkatappaiah garu,
Thanks and apologies. Mine was a vague question. I was wondering about forming words from roots like in Sanskrit. I found two blogs bt Tadepalli Balasubramaniam which give some information like the post సంస్కృతం-9 in http://www.naasaahityam.blogspot.com/
and more information in
http://telugubhaasha.blogspot.com/
in posts under the title తెలుగులో క్రియాకల్పన సాధనాలు .
That is the sort of information I have been looking for though I am not sure whether the information in the posts is widely accepted. My apologies again for a vague question and thanks for patiently answering it.
Gadde Anandaswarup

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

ఇంతా బాగా వ్రాసి - శీర్షికలో " తెలుగు బాష చరిత్ర " అని వ్రాయడం బాగా లేదు. " తెలుగు భాషా చరిత్ర " అని మార్చండి.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

డా.ఆచార్య ఫణీంద్ర గారూ.. నమస్తే..
నేను బరహా వాడడం లేదు కొన్ని కారణాలవల్ల. లేఖిని లో టైపు చేసి కాపీ, పేస్టు చేయడం. హడావిడి వీటివల్ల కొన్ని సార్లు ముద్రారాక్షసాలు దొర్లడం మామూలే కదా! సరి చేసాను. ధన్య వాదాలు

RUKMINIDEVI JAKKULA చెప్పారు...

వెంకట్ గారూ,,,,సాగించండి ప్రయాణం ముందుకు,,,బాగుంది మీ భాషా పరిచయం.. మున్ముందు ఇంకా మంచి రచనలు అందింస్తారని ఆశిస్తూ....................