ఆటవెలది పద్య పాదం లో నాలుగు పాదాలు ఉంటాయి. ౧, ౩ పాదాలలో..వరుసగా ౩ సూర్య గణాలు, ౨ ఇంద్ర గాణాలూ ఉంటాయి. ౨, ౪ పాదాలలో..ఐదేసి సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ, నాల్గవ గణం మొదటి అక్షరానికీ యతి మైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ప్రాస యతి వాడవచ్చు.
సూర్య, సూర్య, సూర్య, ఇంద్ర, ఇంద్ర.
సూర్య, సూర్య, సూర్య, సూర్య, సూర్య.
మొదటి రొండు పాదాల గణాలు పై విధంగా ఉంటాయి. అలాగే తర్వాతి రొండు పాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక పద్యం చూద్దామా?
వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినురవేమ!
వేష బాషలను చూసి భ్రమ పడవద్దు అని చెప్తున్నాడు వేమన.
మొదటి పాదం లో.. వేష, ధారి, నెపుడు...అనేవి మూడు సూర్య గణాలు కదా..(UI, UI, III).. విశ్వసిం. పగరాదు.. అనేవి. ఇంద్ర గణాలు.. కదా.. ( UIU...IIUI...) ర గణం, సల.. అనేవి సరిపోయాయి. అలాగే.. రొండవ పాదం లో.. చూద్దాము.
వేష, దోష, ములొక,విధయె, యగును. ఇవన్నీ సూర్య గణాలే కదా...(UI, UI, III, III, III) కాబట్టి రొండో పాదం సరి పోయింది కదా.. ఇలాగే ౩, ౪ పాదాలు చూడండి.
ఆటవెలది సులభంగా రాయాలంటే ఎలా అనే విషయం రేపటి టపా లో చూద్దాము.
మీ స్పందన తెలియజేస్తారుగా!
1, జులై 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
స్వగోత్రీకా! (మాది మీ గోత్రమే) బావున్నాయండి మీ పాఠాలు. కొనసాగించండి.
మా ఋషులూ వాళ్ళేనండొయ్. గోత్రం మాత్రం మౌన భార్గవస.
రవి గారూ.. ప్రసన్న కుమార్ గారూ.. ధన్య వాదాలు. మీరింత ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టే.. ఎంత బిజీ గా ఉన్నా రొజూ ఎదో ఒకటి రాయ గలుగుతున్నాను. ధన్యవాదాలు.
నమస్కారములు వెంకట్ గారు మీ పాఠాలు చక్కగా తేలికగా అర్ధమౌతున్నాయి.నేనూ పద్యం రాయగలను అనిపించేలా ! మరి మీ అందరు గోత్రాలు చెప్పారు కదా అందుకని " మా గొత్రం కౌండిన్యస . " [ సరదాగా చెప్పానంతె ]
Aataveladi only 4 lines a vuntaaya malika undadaa plz reply
కామెంట్‌ను పోస్ట్ చేయండి