ఈ పదాలకు గురు లఘువులను గుర్తిద్దాము.
నస - రొండు లఘువులు - I I
అమల - మూడు లఘువులు. - I I I
కాకి - ఒక గురువు ఒక లఘువు. - U I
కైక - ఒక గురువు ఒక లఘువు.- U I
కోకిల - ఒక గురువు, రొండు లఘువులు.- U I I
కెంపు - ఒక గురువు ఒక లఘువు. - U I
కెల - రొండు లఘువులు. - I I
కౌలు - ఒక గురువు ఒక లఘువు. - U I
కృపాణము - ఒక లఘువు, ఒక గురువు, రొండు లఘువులు. IU II
ఇక సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు చూద్దాము.
ద్విత్వాక్షరాలు: ఒక గురువు మరియూ ఒక లఘువు. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు, తర్వాతది లఘువు. - U I
అత్త - - U I
అమ్మ - - U I
అవ్వ -- U I
అక్క - - U I
అన్న - - - U I.
సంయుక్తాక్షరాల సంగతి కొంచెం చూద్దాము.
ఇవి కూడా ముందున్న అక్షరాన్ని గురువు గా మార్చి, ఆ సమ్యుక్తాక్షరం లఘువు గా ఉంటుంది.
రక్తము - U I I
అన్య _ U I
పుణ్య - U I
భ్రుగ్న - U I
ఈ సంయుక్తాక్షరాలలో ఇంకో ట్విస్ట్ చెప్తాను గమనించండి జాగ్రతగా..
ఇడ్లీ , కిళ్ళీ వంటి పదాలు, ( U U ) ముందు పదాన్ని గురువు గా మారుస్తాయి, మళ్ళీ ఆ సంయుక్తాక్షరాలు దీర్ఘం తో కూడి ఉన్నాయి కదా అందుకని, ఆ అక్షరం కూడా గురువు అవుతుంది. అంటే రెండు అక్షరాలూ గురువులే నన్నమాట. వచ్చే టపా లో గురులఘువుల సారాంశాన్ని "ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయాలు" చెప్పి గురు లఘువుల గుర్తింపు ముగించి, గణ విభజన కు వెళ్దాము.
మీ స్పందన తెలియజేస్తారుగా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
>> పద్యాలు రాయడం చాలా సులువు..
ఇవాళే చూసాను మీబ్లాగును. చాలా బావుంది. ధన్యవాదములు.
>>కృపాణము - ఒక గురువు, ఒక గురువు, రొండు లఘువులు. - U U I I.
కృ లఘువుకదా.
నిజమే. కృపాణములో కృ లఘువే. కృపాణము ( IUII ) నాలుగక్షరాల గణం జలము (జగణం ప్రక్కన లఘువు) అవుతుంది.
నాగేశ్వర రావు గారు, శంకరయ్య గార్లకు, ధన్యవాదాలు.
తొందరలో అలా టైపు అయింది. మీరు చెప్పింది నిజమే.
ఇప్పుడు సరి చేసాను చూడండి.
టేకుమళ్ళ వెంకటప్పయ్య.
వెంకటప్పయ్య గారికి,
మీరు మొదలుపెట్టిన పద్యమంజుష బ్లాగు, నాలా ఆసక్తి ఉన్న వారికి బహు ఉపయోగకరం. నాకు సంస్క్రుతాన్ధ్రములలో బాగా పట్టు సాదించాలని ఆశ. ఇప్పుడు ఎవరి దగ్గరకైన వెళ్లి నేర్చుకోవాలని తపన ఉన్న, దానికి కావలసిన సమయం లేదు. మీలాంటి పెద్ద వారు ఇలాంటి బ్లాగు ద్వారా మంచి విషయాలను తెలియచేయడం బహు సంతోషకరం. దయచేసి ఛందస్సు మరియు సంధులు, సమాసాల గురించి విపులముగా వ్రాయవలసినదిగా మనవి...!
blog chaala baagundi. padya manjuusha kothaa prayogam.
dvs somayajulu
Dhanyavaadaalu. Mee andari protsaham to modalettanu. Digvijayam cheyyandi. Salahalanu pampandi. T.Venkatappaiah
కామెంట్‌ను పోస్ట్ చేయండి