గణ విభజన అనేది, పద్య రచన లో చాల ముఖ్యమైన ఘట్టం. గణాలను సులభంగా గుర్చించడం, పదాన్ని చూడగానే, గణం చెప్పగలగడం, ప్రాక్టీసు మీద గానీ రాదు. ఐతే ధ్యాస అదే విషయం పై ఉంటే సులభం గానె మీరు గణ విభజన చెయ్య గలుగుతారు. చివరలో మీకు దీనిలో ఉన్న చిట్కాలు చెప్తాను.
మొదటగా గణ విభజన చూద్దాము.
1. ఏకాక్షర గణాలు: గ U , ల I
2. రెండు అక్షరాల గణాలు: గలము లేక హగణం: ఉదా: సీత U I
౩. వగణం లేక లగం. ఉదా: రమా. IU
౪.గగం. ఉదా: రామా. ఊఊ
౫. లలం. ఉదా: రమ. II
౬.ఇంద్ర గణాలు: నల IIII, నగ IIIU, సల IIUI, భ UII, ర UIU, త UUI గణాలు.
యమాతారాజభానసలగం. అనే సూత్రం ద్వారా గణాలను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో చూడండి.
1. యమాతా IUU యగణం.
2. మాతారా UUU మగణం.
3. తారాజ UUI తగణం.
4. రాజభా UIU రగణం.
5. జభాన IUI జగణం.
6. భానస UII భగణం.
7. నసల III నగణం.
8. సలగం IIU సగణం.
9. లగం IU వగణం.
10. గం U గగణం.
ఈ గణ విభజనను బాగా బట్టీ పట్టి సూత్రం ద్వారా గుర్తుంచుకోండి. తదుపరి కొన్ని పదాలతో మనం గణ విభజన చేద్దాము.
మీ స్పందన తెలియజేస్తారుగా!
4, జూన్ 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్లు:
ఇంద్ర గణాలు చెప్పారు..ఇనగణాలేవో కూడా చెప్తే బాగుండేదేమో....
నాకు చాలా ఆనందంగా ఉందండీ,మీ బ్లాగు చూస్తుంటే...చక్కగా అందరికీ ఒక వేదాంగాన్ని నేర్పేస్తున్నారు..చిన్నప్పుడు ఛందస్సు బట్టీ పెట్టి, ఏదో వచ్చిన ఊహల్తో వరుసలు కట్టుకుని పద్యాలు రాసుకున్న రోజులు గుర్తొస్తున్నాయి....మళ్ళా ఇప్పుడు పురుగు తొలుస్తోంది...కానీ ఆ సృజనాత్మకత ఉందో,లేదో చూడాలి....ఈ యాంత్రిక జీవితాల్లో అది ఎటో కొట్టుకుపోయినట్టుంది,తిరిగి వెతుక్కోవాలి...
చాలా బాగా వివరించారు
చాలా బాగా వివరించారు
సురచిరతా కాకుసుమశోభి నభోంగణభూమి గాలము
కామెంట్‌ను పోస్ట్ చేయండి