• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

9, జూన్ 2010, బుధవారం

యతి, ప్రాస యతుల వివరణ.

ఈ నాలుగు రోజుల సమయం లో మీరు గణ విభజన గురించి, యమాతారాజభానసలగం గురించి అధ్యయనం చేసి ఉంటారనుకుంటాను. ఇక యతుల గొడవ ఏంటో చూద్దాము.
పద్యం లోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతికి పద్యం లో ఏదో ఒక నిర్దేశిత అక్షరం తో యతి కుదరాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఒక విరామ చిహ్నం గా భావించాలి. ఏక బిగిన పద్యం చదవకుండా, ఎక్కడో ఒక చోట విరామ చిహ్నంగా ఆపుదలకు, పద్యం అందగించడానికి పెద్దలు ఏర్పరచిన నియమం ఇది.
ఇక అక్షరాల మధ్యన ఉండే యతి మైత్రి చూద్దాము. ఒక గుణింతం తీసుకుని ఆ ప్రకారం యతి మైత్రి ని గమనించ వచ్చు.
క గుణింతం తీసుకుంటే....
క, కా, కై, కౌ ల మధ్యన యతి మైత్రి ఉంది.
కి, కీ, కె, కే ల మధ్యనా..
కు, కూ, కొ, కో. ల మధ్యనా మైత్రి చెల్లును.
ఈ క్రింది యతి మిత్రులు కూడా గమనించండి.
1. అ, ఆ, ఐ, ఔ, య, హ...
2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ, ౠ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ
5.చ,ఛ,జ,ఝ, శ, ష, స.
6. ట, ఠ, ద, ధ,
7, ప, ఫ,బ, భ, వ.
8.త, థ, ద, ధ
9.న, ణ, ఙ.
10, ల, ర, ళ .
ఈ అక్షరాల మధ్యన యతి మైత్రి ఉంది కాబట్టి, పద్యం లో నియమిత స్తానం లో ఈ అచ్చు, లేక హల్లుతో గూడిన అక్షరాలను వాడాలి. అవి ఎలాగో వచ్చే పోస్టింగు లో చెప్తాను. ఈ లోపు మీరు ఈ యతి మైత్రుఅలను గుర్తుపెట్టుకోడానికి ప్రయత్నిస్తారు గదా...

10 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇంత వివరంగా అర్థమయ్యేలా వ్యాకరణం అందించిన సహృదయులకు ధన్యవాదములు

శేషాద్రి సోమయాజులు చెప్పారు...

లెక్క ‌.....ముఖ‌ ....(క్క‌...ఖ‌) ప్రాస‌ యతి కుదిరిందా?

Sri[dharAni]tha చెప్పారు...

యేమో యేమో యిది యేయేమో ఆవుతూ నదీ

తిరివీధి శ్రీమన్నారాయణ చెప్పారు...

సరిపోదు ..క్క ద్విత్వాక్షరము ..ఖ ద్విత్వాక్షరము కాదు ( రెండు ద్విత్వాక్షరములు ఉంటెనే ప్రాస యతి సరిపోతుంది.. ఉదా..క్కె, క్కి, క్కీ, క్కే మొదలగు ద్విత్వాక్షరములు సరిపోతాయి)

ప్రాస యతి గూర్చి పద్య విద్య నేర్పు గురవర్యులు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి నోట్స్...

ప్రాసయతి: 
ఇది తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములందు
యతి స్థానంలో కాకుండగ దాని తరువాత స్థానంలో (ప్రాసము నందు) యతిచెప్పుట.
ఈ యతి చెప్పునపుడు పాదం మొదటి అక్షరం గురువైనచో గురువు, లఘువైనచో లఘువు ప్రాసయతి అక్షరం ముందు అక్షరం అవ్వాలి. అలాగే ప్రాస ద్విత్వ, సంయుక్త , బిందు పూర్వకంగా ఉన్నచో ప్రాసయతిలో కూడ అలాగే ఉండవలెను. ప్రాసయతికి అచ్చుతో పనిలేదు ప్రాస అక్షరం యొక్క గుణింతాక్షరం ఏదైనా వాడవచ్చు.

శ్యామలీయం చెప్పారు...

>> .. యతి చెప్పునపుడు పాదం మొదటి అక్షరం గురువైనచో గురువు, లఘువైనచో లఘువు ప్రాసయతి అక్షరం ముందు అక్షరం అవ్వాలి....
అటువంటి నియమం యేమీ లేదండీ. కాని అలా వాడటం సాధారణంగా చేస్తాము. అనేకమంది కవులకు ఈఅపోహ ఉన్నది.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ప్రాస పూర్వాక్షరం హ్రస్వ మైన హ్రస్వమని దీర్ఘమైన దీర్ఘము ఉండాలని చెప్పుట పొరబాటు. గురువైన గురువు లఘువైన లఘువు అని చెప్పుటయే సరియైనది. ప్రాస పూర్వాక్షర నియమ భంగము అన్నదానికి నిరూపణ ఎట్లా? కనుక శ్యామలరావుగారు మరో సారి పరిశీలించండి

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

ల, డ లకు యతి కుదురుతుంది కదా

కె వై రత్నం, 9908436641 చెప్పారు...

కృ అనే అక్షరమునకు యతి తెలుపగలరు

ఓ అభిమాని చెప్పారు...

కృ అక్షరమునకు యతి మైత్రి కుదిరే అక్షరములు తెలుపగలరు

అజ్ఞాత చెప్పారు...

ప్రాసయతికి అక్షరాలమైత్రి చెల్లుతుందా
ఉదా: ద, త
దిట్ట, గడ్డ