పర్యాయ పదాలు ఎక్కువగా తెలుసుకోవడం వాళ్ళ, పద్యం లో ప్రాస కు ఒక పదం కాకపోయినా ఇంకో పదం వాడుకోవచ్చు.
ఒకే అర్ధమునిచ్చు వివిధ పదములను పర్యాయ పదములు అందురు. వీటిని తెలుసుకొనుట వలన ఒకే అర్ధము గల వివిధ పదములు పరిచయము కలుగును.
అంకురార్పణ - ఆరంభము, ప్రారంభము, శ్రీకారము, మొదలు, ఆముఖము, సమారంభము.
అధికారి - అధినేత, దొర, పాలకుడు, అధిపతి, అధ్యక్షుడు.
ఆచారము - సంప్రదాయము, ధర్మము, అనుష్ఠానము, మరియాద, పాడి.
ఆజ్ఞ - ఉత్తరువు, సెలవు, ఆనతి, శాసనము, అనుమతి, ఆదేశము.
ఆపద - గండము, ఇడుము, కష్టము, క్లేశము, పీడ, ప్రమాదము, కీడు, చిక్కు.
ఆవు - మొదవు, కపిల, ధేనువు, సురభి, పావని, బహుళ, మాహేయ, గోవు, పయస్విని.
ఆశీర్వాదము - ఆశీస్సు, ఆశీర్వచనము, సంబోధన, ఆక్రందన.
ఇల్లు - గృహము, ధామము, ఆవాసము, ఆలయము, స్వగృహము, కొంప, భవనము.
ఈశానము - రుద్రభూమి, మరుభూమి, వసకాడు, ప్రేతవనము, పరేతభూమి.
ఉదాహరణము - నిరూపణము, ఉపవృత్తి, ప్రామాణ్యము, ఉదాహృతి.
ఉప్పు - లవణము, క్షారము, కటకము.
ఋషి - తాపసి, ముని, సాధువు, జడధారి, తపస్వి.
ఎల్లప్పుడు - సర్వదా, నిత్యము, కలకాలము, సతతము, అనవరతము, అహర్నిశము, ఎల్లకాలము.
ఏనుగు - ఇభము, హస్తి, సారంగము, గజము, కరేణువు, కుంజరము, దంతి, మాతంగము, వారణము, సింధువు.
ఓదార్పు - సాంత్వము, అనునయము, ఊరడింపు, లాలన, బుజ్జగింపు, ఉపశాంతి.
కట్నము - శుల్కము, వరదక్షిణ, అరణము, వీడు.
కడుపు - కుక్షి, ఉదరము, పొట్ట, కంజరము.
కన్ను - చక్షువు, అక్షిన, లోచనము, నయనము, ఈక్షణము, అవలోక్యము.
కర్పూరము - కప్రము, కుముదము, నెల, ముక్తాఫలము, హిమాంశువు, శ్వేతధామము.
కలువ - ఉత్పలము, కువలయము, పున్నాగము, తోవ, కపాలము.
కాంతి - వెలుగు, మినుకు, ప్రకాశము, ద్యుతి, ప్రతిభ, రవణము, రోచిస్సు.
కవచము - ఆయుక్తము, తొడుగు, వారణము, కవసము.
కాముకుడు - శృంగారి, కామాచారి, స్త్రీపరుడు, కామి, వలకాడు.
కాయ - కసురు, శలాటువు, పసరుకాయ.
కారణము - హేతువు, తర్కము, నిమిత్తము, మిష, సాకు, వంక, భంగి.
కీర్తి - ఖ్యాతి, ప్రతిష్ఠ, యశము, ప్రకాశము, ప్రశస్తి, నెగడ్త, పేరు.
కూతురు - అంగజ, కుమారి, తనయ, సుత, పుత్రిక, తనూజ.
కొడుకు - సుతుడు, నందనుడు, కుమారుడు, తనయుడు, అంగజుడు, పుత్రుడు, ఆత్మజుడు.
కోపము - క్రోధము, ఆగ్రహము, ఉద్రేకము, కినుక, అలుక, నెగులు, చిందు, రోషము.
క్రమము - అనుక్రమము, యధాక్రమము, సరలి, పదకము, తరువాయి.
క్షణము - లిప్త, మాత్ర, త్రుటి, ముహూర్తము.
గ్రంధము - పుస్తకము, వహి, పొత్తము, కితాబు.
చర్మము - తోలు, తాట, తొక్క, అజనము.
తండ్రి - జనకుడు, అయ్య, నాన్న, పిత, పితరుడు.
తామర - పద్మము, అంబుజము, అరవిందము, సరసిజము, సరోజిని, కంజాతము, రాజీవము.
త్రాడు - పాశము, చామము, రజ్జువు, బంధువు, వటము.
దేవాలయము - ఆలయము, నగరు, కోవెల, గుడి.
దేశము - వర్షము, రాష్ట్రము, రాజ్యము, సామ్రాజ్యము, పాళెము, నీవృతము.
ధనము - ఆదాయము, డబ్బు, సొమ్ము, అర్ధము, నగదు, దుడ్డు, ద్రవ్యము, సొత్తు, లెక్క, కాసు, పైకము.
నారదుడు - కలహాశనుడు, త్రిలోకసంచారి, కలహభోజనడు, దేవలుడు, కలహ ప్రియుడు. నేడు - ఈనాడు, ఈప్రొద్దు, ఈరోజు.
పండితుడు - అభిజ్ఞుడు, కవి, కోవిదుడు, ధేమతుడు, విద్వాంసుడు.
పెండ్లి - వివాహము, పాణిగ్రహణము, మనువు, పరిణయము, స్వీకారము, కళ్యాణము.
పన్ను - కష్టము, సుంకము, కూలి, శిస్తు, శుల్కము, ఇల్లరి.
పరిశోధన - విచారించు, పలికించు, సోదించు, అరయు, ఎంచు, ఒరయు.
పరిశోధకుడు - పరీక్షకుడు, శోధకుడు, విచారకుడు, పరిశీలకుడు.
పాపము - దుష్కృతము, కీడు, కొడిమె, అఘము, కలక, దోషము, దురితము.
పిల్లి - బిడాలము, మార్జాలము, వ్యాఘ్రాదము, త్రిశంకువు.
ప్రాణము - ఓవము, ఉసురు, సత్త్వము, ఊపిరి, అసువులు.
బుద్ధి - ప్రతిభ, ప్రజ్ఞ, ప్రాజ్ఞ, ధౌ, ప్రజ్ఞానము, మనీష.
బ్రహ్మ - విధాత, కమలగర్భుడు, చతుర్ముఖుడు, హంసవాహనుడు, చతురాననుడు, కంజాతుడు, కమలాసనుడు, నలువాయి, సృష్టికర్త.
భక్తి - బత్తి, సేవ, ఇమ్ము, విరాళి, సొరత్వము, పోరామి.
భర్త - వల్లభుడు, ప్రాణేశుడు, ఈశుడు, నాధుడు.
భార్య - అర్ధాంగి, సతి, ఆలు, ఇల్లాలు, కళత్రము, పత్ని, గృహిణి.
భోజనము - విందు, భుక్తి కడుపు, అన్నము, ఓగిరము, బోనము, భిక్ష, పబ్బము.
మనస్సు - హృదయము, ఉల్లము, మనము, ఎరచిత్తము, ఎడద, అంతరంగము, డెందము.
మాట - వాక్కు, పలుకునుడి, ఉకిత, వనము, ఆలాపము, సుద్ది, భాషణము.
ముఖము - మూతి, వదనము, మోము.
మెరుపు - సౌదామిని, అంబరాంశువు, నీలాంజన, చంచల, అశని, మేఘవహ్ని.
మేఘము - అబ్దము, వారిదము, పర్జన్యము, నీరదము, జలధరము, పయోధరము.
మేనము - అవాక్కు, అభాషణము.
యముడు - ధర్మరాజు, సమవర్తి కాలుడు, పాశి మృత్యువు, శమనుడు.
యుద్దము - రణము, సంగ్రామము, తగవు, పోరు, సమరము, భండనము, వైరము, విగ్రహము.
రక్షణ - శరణు, త్రాణము, రక్ష, అభయము, కాపుదల.
రహస్యము - గూఢము, గుప్తము, మంతనము, మర్మము, చాటు, గోపనము.
రాత్రి - అసుర, రజని, నిశీధము, నిసి, యామిని, అంజనము, మాలతి.
రైతు - సేద్యకాడు, కుటింబి, కర్షకుడు, హాలికుడు, కృషీవలుడు, కాపు.
రోగము - అనారోగ్యము, జబ్బు, అస్వస్థము, నలత, వ్యాధి, సుస్తి, అపాటము.
వరుస - అంచె, సరణి, దొంతర, క్రిమము, వళబారు, శ్రేణి, బొత్తి, సరళి
వర్తకుడు - వ్యాపారి, వణిజుడు, శ్రేష్ఠి, వ్యాపారస్థుడు, సెట్టి, వ్యవహారి.
వస్త్రము - అంబరము, చేలము, వలువ, కోక, గుడ్డ, శాటి.
వార్త - కబురు, గాద, వర్తమానము, సొద, సంగతి.
విద్యార్ధి - పాధకుడు, అద్యౌత, పాఠనుడు, అభ్యాసి.
విధము - ఒరవు, సొంపు, సూటి, క్రియ, క్రిమము, దారి, వెరవు, మార్గము.
వినోదము - వేడుక, హొయలు, వింత.
విమర్శ - సమీక్ష, పరామర్శ, అవలోకనము, విచారము, చర్చ.
విష్ణువు - శౌరి, హిర్ణగర్భుడు, అనంతుడు, గోవిందుడు, వైకుంఠుడు, చక్రాయుధుడు, పన్నగశయనుడు, జనార్ధనుడు, అక్షరుడు, శ్రీనివాసుడు, పద్మగర్భుడు.
వైతాళికుడు - ప్రబోధకుడు, ఉద్బోధకుడు, ఛాత్రికుడు
శపధము - వ్రతము, బిట్టు, బాస, పూనిక, ప్రతిన, పంతము, ప్రతిజ్ఞ
శరీరము - అంగము, బొంది, మేను, విగ్రహము, ఒడలు, దేహము.
మీ స్పందన తెలియజేస్తారుగా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
35 కామెంట్లు:
పద్యాలు రాయాలని ఉత్సాహం చూపే కొత్తవారికి మీ రిచ్చిన పర్యాయపదాలు చాలా ఉపయోగపడతాయి. బాగుంది. మీ ఛందోపాఠాలను కూడ కొనసాగించండి.
http://www.kasstuuritilakam.blogspot.com/ ఓ సారి చూడగలరు
పూర్వం పర్యాయ పదాల నిఘంటువు కూడా ఒకటి ఉండేదట. దాన్ని సంపాదించాలి ఎలాగైనా.
వేదుల బాల కృష్ణ మూర్తి గారూ.. మీ అన్నమయ్య సైటు చాలా బాగుంది. ధన్య వాదాలు. వెంకటప్పయ్య.
నరసింహ గారూ,
ఆచార్య జి.ఎన్. రెడ్డి గారు వ్రాసిన పర్యాయ పద నిఘంటువు ఇప్పుడు కూడా లభిస్తోందడీ. విశాలాంధ్ర లో.
ఒకసారి ఈ బ్లాగు ను చూడగలరు
http://newjings.blogspot.com/2010/06/blog-post_24.html
అవీ,ఇవీ వెతుకుతూ, నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి పర్యాయ పద సూచి నాకు ఎంతైనా ఉపయోగపడుతున్నది. మనసారా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీ పర్యాయ పద సూచినుపయోగిస్తూ శ్రీ కంది శంకరయ్య గారి బ్లాగులో సమస్యాపూరణానికి ప్రయత్నిస్తున్నాను.
ఉద్యోగ రీత్యా నేను ఢిల్లీలో ఉండటం వల్ల శ్రీ జి.ఎన్.రెడ్డి గారి పుస్తకం తెప్పించుకోవటానికి కొంచెం సమయం పడుతున్నది. ఈలోపు మీ సూచి నాకు ఊపిరిలాగా లభించింది. ధన్యవాదములు.
అవీ,ఇవీ వెతుకుతూ, నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి పర్యాయ పద సూచి నాకు ఎంతైనా ఉపయోగపడుతున్నది. మనసారా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీ పర్యాయ పద సూచినుపయోగిస్తూ శ్రీ కంది శంకరయ్య గారి బ్లాగులో సమస్యాపూరణానికి ప్రయత్నిస్తున్నాను.
ఉద్యోగ రీత్యా నేను ఢిల్లీలో ఉండటం వల్ల శ్రీ జి.ఎన్.రెడ్డి గారి పుస్తకం తెప్పించుకోవటానికి కొంచెం సమయం పడుతున్నది. ఈలోపు మీ సూచి నాకు ఊపిరిలాగా లభించింది. ధన్యవాదములు.
అవీ, ఇవీ వెతుకుతూ నేను కూడా చివరికి ఇక్కడికి చేరుకున్నాను. శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి పర్యాయ పద సూచి నాకు సరియైన సమయానికి లభించటం నా అదృష్టం. శ్రీ వెంకటప్పయ్యగారికి సదా కృతజ్ఞుడను. ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండటం వల్ల, ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పుస్తకం తెప్పించుకోవటానికి కొంత సమయం పడుతున్నది. ఈ లోపు ఈ సూచి నాకు పని చేసి పెడుతున్నది.
ధన్యవాదములు.
వ్యర్థం
బాగుందండీ! పద్య రచనాభ్యాసం చేసే వారికి యిది యెంతో ఉపయోగపడుతుంది. చాలా సంతోషం.
Arjunudu
కీర్తి
కీర్తి
కీర్తి
సానరాయి కి పర్యాయాలు
"సానఱాయి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report an error about this Word-Meaning
గీటురాయి, చక్రభ్రమము, నికషము, మెరుగుఱాయి, శా(ణ)(న)ము, శాణి, సాన."
Source :- http://andhrabharati.com/dictionary/index.php
ప్రథిగ్న
సంతోషం పర్యాయ పదాలు
చాటు
కవులకు ఎంతో ఉపయోగకరము..పండితులైన వారు ఇందులో తప్పులేమైనా ఉంటే సవరిస్తే..సలహాలిచ్చి సహకరిస్తే ఎంతో బావుంటుంది.
పండితులు కాని కవులకు ఇది వరం.
బ్లాగరువారి ప్రయత్నం అభినందనీయం.శిరసానమామి.
Kalladhalu
Kaaranam
అసువు
నమస్కారాలు కు పర్యాయ పదాలు
Kapotham
PH an I
Pavuram
నమస్కారము
Tandry
పూర్వము పర్యయ పందం
ఉద్యోగం అనే పదానికి పర్యాయపదం
Thilam
thanks for sharing I have written modern Baby Names
Kumaarthe
కామెంట్‌ను పోస్ట్ చేయండి