• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

27, జూన్ 2010, ఆదివారం

పద్యానికి యతి ప్రాసలే హృద్యం, హృదయమూ....

పద్యానికి యతి, ప్రాస.. హృద్యం,ప్రాణం,అందం.. ఇవి ఏదోవిధంగా పెట్టడం కాదు. సరిగా ఉండాలి. అప్పుడే పద్యం అందగిస్తుంది. తిక్కన సోమయాజి తన నిర్వచనోత్తర రామాయణం లో (1-7)... యతి ప్రాసల గురించి ఇలా చెప్పాడు.
తెలుగు కవిత్వము చెప్పందలచిన కవి యర్ధమునకు దగి యుండెడు మాటలు గొని వళులం బ్రాసంబులు నిలుపక యొగిని బులిమి పుచ్చుట చదురే!
తిక్కన ఎంత చక్కగా చెప్పడో చూడండి. పులమొద్దు అంటున్నదు. కనుక యతి ప్రాసలు ఏవో వేసేసి పద్యాన్ని లాగించెయ్యడం సరి కాదు. అర్ధవంతం గా ఉండాలి. అలాగే వేరొక చోత "ప్రాసము ప్రకారం వేరగు నక్షరంబులన్ శృత్య రూప మంచు నిడ" అన్నాడు. దాని అర్ధం ఏమిటంటె.. బండి "ఱ" మామూలు "ర" పలకడానికి వొకే విధంగా ఉన్నయి కదా అని ప్రాస లో వాడడం సరి కాదు అని సున్నితం గా ప్రభోదించాడు. అలాగే పెద్దలు వాడారు కదా అని మనం వాడడం కూడ సబబు కాదు అని పరవస్తు చిన్నయ సూరి "ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు" అన్నడు.
కనుక యతి ప్రాసలకు పనికి వచే పదాలు తెలుసుకోంది అర్ధవంతం గా వాడండి. ఒకే పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి కదా? మీకు ఒకే పదాన్ని అన్ని గణాలకు పనికి వచ్చే విధంగా ఎలా ఉపయోగించాలో రేపు చెప్తాను.

6 కామెంట్‌లు:

రవి చెప్పారు...

బావుంది. తదుపరి టపా కోసం ఎదురు చూస్తాను. పద్యంలో శ్రవణ సుభగత్వం పాటించాలంటే ఏవైనా ఉపాయాలున్నాయా? చెప్పగలరు.

అలాంటి పద్యాలు నాకు ఇష్టం కాబట్టి అడుగుతున్నాను.

Unknown చెప్పారు...

ఓ సారి క్రింది లింకును చూడగలరు.
http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF%28%20%E0%B0%9B%E0%B0%82%E0%B0%A6%E0%B0%83%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%20%29

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

అయ్యా! నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారూ..మీ బ్లాగు అత్యధ్భుతం. నేను చెప్పే వన్నీ మీ బ్లాగు లొ ఇది వరకే ఉండొచ్చు గాక. నేను చెప్పే సందర్భాలు కేవలం చందస్సు కు సంబంధించి, మనం చదివిన దంతా చెప్పి, వారి బుర్రలు పాడు చేయడం కంటే, స్పూన్ ఫీడింగ్ లాగా కొంచెం కొంచెం తినిపిస్తే వారికి.. ఎక్కుతుందన్న భావన నాది. మీ బ్లాగు విద్వత్తు ఉన్న వారికోసం. నా బ్లాగు పద్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉండి, రాయడం కస్టమేమొ అన్న భావన ఉన్న్నవారికి. దాన్ని పోగొట్టడం నా బాధ్యత. ధన్యవాదాలు.

ఆ.సౌమ్య చెప్పారు...

మీ బ్లాగు చాలా బావుందండీ...ముఖ్యంగా మీరు చెప్పే విధానం. నేను బాగా నేర్చుకుంటున్నాను. త్వరలో పద్యం రాయగలనని ఆశిస్తున్నాను.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

Sowmya garoo.. rayandi. tappulostayani bhayapadakandi. rayandi. kaavalante doubts vaste naaku mail cheyyandi. tekumalla.venkatappaiah@gmail.com

ఆ.సౌమ్య చెప్పారు...

మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు. తప్పక మిమ్మల్ని సంప్రదిస్తాను.