1. ఛందో భంగము (గణ భంగము): గురువు బదులు లఘువు వేసినా.. లఘువు బదులు గురువు వేసినా ఈ రకమైన దోషం వస్తుంది.
మీ స్పందన తెలియజేస్తారుగా!
15, మార్చి 2012, గురువారం
అనంతుని ఛందో దర్పణం లో చెప్పిన ఛందస్సు లోని దశ దోషాలు
1. ఛందో భంగము (గణ భంగము): గురువు బదులు లఘువు వేసినా.. లఘువు బదులు గురువు వేసినా ఈ రకమైన దోషం వస్తుంది.
12, మార్చి 2012, సోమవారం
దృత విలంబితము, మానిని, కవిరాజ విరాజితము
ఈ దృత విలంబితము జగతీ ఛందము లోని జన్యము అంటారు.
న, భ, భ, ర అనే నాల్గు గణాలూ..12 అక్షరాలు ఉంటాయి. 7 వ అక్షరం యతి స్తానం.ప్రాస నియమం ఉంది.
నన్నయ్య భట్టారకుని రచనల్లో ఈ దృత విలంబితము ఒక్కటే ఉంది. అది ఆది పర్వం చతుర్ధాశ్వాసం లో చివరి పద్యం.
త్రిభువనాంకు శ దీప్తి నిధీ! సమ
స్తభువనా శ్రయ ధర్మ ధురంధరా!
శుభ యశ: పరిశోభిత పూర్వది!
క్పృభు విలాస! కృపారస బంధురా!
అని ఆశ్వాసాంతం లో రాజరాజ నరేంద్రుడిని కీర్తించాడు నన్నయ్య.
అలాగే నన్నయ్య చమత్కృతి ఇంకోతి చూద్దాము.
అరుదైన ప్రయోగాలైన మానిని, కవిరాజ విరాజితం అనే చందస్సులు చూద్దాము.
ఆది పర్వం లోనే.. ఒక "మానిని" వృత్తము చూద్దాము.
"ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశో కములన్, సుర పొన్నల, బొన్నల, గేదగులం,
గాచి బెడంగుగ బండిన యా సహకారములం, గదళీ తతులం
జూచుచు, వీనుల కింపెసగన్ వినుచున్ శుక కోకిల సుస్వరముల్!"
దుష్యంతో పాఖ్యానం లో పద్యం ఇది. ఈ మనిని ప్రతి పాదం లో
7 భగణాలపైన ఒక గురువు వుంటుంది. 1-13-19 అక్షరాలకు ఒక యతి
ప్రకారం 3 యతులు ఉంటాయి. నన్నయ్య మాత్రం 13 వ అక్షరం మాత్రమే
యతి గా గ్రహించాడు.
6, మార్చి 2012, మంగళవారం
మధ్యాక్కరలు - ఛందస్సు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIIUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII
5. మధ్యాక్కరలో ... 2 ఇంద్ర గణాలూ,1 సూర్య గణమూ..2 ఇంద్ర గణములూ మళ్ళీ 1 సూర్య గణమూ .. కలిపి మొత్తం 6 గణాలు ఉంటాయి.యతి మూడు గణము ల పై ఉంటుంది. ప్రాస ఉంది.
ఇం ఇం సూ ఇం ఇం సూ
తిరుపతికింబోయి యొడలి నగలెల్ల దీసి ఇచ్చెదరు
అనే పాదం లో నన్నయ వలె ఐదవ గణము ప్రధమాక్షరం యతి గా పాటించడం గమనార్హం!
కాబట్టి యతి విషయంలో ఖచ్చితం గా వ్యవహరించలేకపోతున్నాము.
ఈ "అక్కర"ల విషయంలో ప్రొఫెసర్ కోవెల సంపత్కుమారాచార్య విశేష కృషి చేసారు. వారి అనుభవాలను ఉదాహరణలను నేను కొన్ని పైన పేర్కోనడం జరిగింది.
ఈ పోస్టింగు మీకు నచ్చిందా! తెలియజేస్తారుగా...