• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

12, మార్చి 2012, సోమవారం

దృత విలంబితము, మానిని, కవిరాజ విరాజితము


ఈ దృత విలంబితము జగతీ ఛందము లోని జన్యము అంటారు.
న, భ, భ, ర అనే నాల్గు గణాలూ..12 అక్షరాలు ఉంటాయి. 7 వ అక్షరం యతి స్తానం.ప్రాస నియమం ఉంది.
నన్నయ్య భట్టారకుని రచనల్లో ఈ దృత విలంబితము ఒక్కటే ఉంది. అది ఆది పర్వం చతుర్ధాశ్వాసం లో చివరి పద్యం.

త్రిభువనాంకు శ దీప్తి నిధీ! సమ
స్తభువనా శ్రయ  ధర్మ ధురంధరా!
శుభ యశ: పరిశోభిత పూర్వది!
క్పృభు విలాస! కృపారస బంధురా!

అని ఆశ్వాసాంతం లో రాజరాజ నరేంద్రుడిని కీర్తించాడు నన్నయ్య.


అలాగే నన్నయ్య చమత్కృతి ఇంకోతి చూద్దాము.

అరుదైన ప్రయోగాలైన మానిని, కవిరాజ విరాజితం అనే చందస్సులు చూద్దాము.

ఆది పర్వం లోనే.. ఒక "మానిని" వృత్తము చూద్దాము.


"ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశో కములన్, సుర పొన్నల, బొన్నల, గేదగులం,
గాచి బెడంగుగ బండిన యా సహకారములం, గదళీ  తతులం
జూచుచు, వీనుల కింపెసగన్ వినుచున్ శుక కోకిల సుస్వరముల్!"

దుష్యంతో పాఖ్యానం లో పద్యం ఇది.  ఈ మనిని ప్రతి పాదం లో
7 భగణాలపైన ఒక గురువు వుంటుంది.  1-13-19 అక్షరాలకు  ఒక యతి
ప్రకారం 3 యతులు ఉంటాయి.  నన్నయ్య మాత్రం 13 వ అక్షరం మాత్రమే
యతి గా గ్రహించాడు.

విశేషం ఏమిటంటే...
మానినీ వృత్తపాదం లో మొదటి గురువును రొండు లఘువులుగా
మారిస్తే కవిరాజ విరాజితం అవుతుంది.  

చమత్కారం ఏమిటంటే.. చతుర్ధాశ్వాసం లో 20 వ పద్యం మానిని రాసి
21 వ పద్యం గా కవిరాజ విరాజితం రాయడమే.. 

చని చని ముందట నాజ్య హవిర్ధృత సౌరభ ధూమ లతాతతులం
బెనగిని మ్రాకుల కొమ్మలమీద నపేతలతాంతములైనను బా
యని మధుప ప్రకరంబుల జూచి జనాధిపుదెంతనెఱింగె దపో
వనమిది యల్లదె దివ్యమునీంద్రుని  నివాసము దానగు నంచు నెదన్.

ప్రతి చరణం లో 1 నగణం, 6 జగణాలు, 1 నగణం ఉంతాయి.
1-14-18-20 యతి స్తానాలుంటాయి. కనీ నన్నయ్య మాత్రం 14 వ స్తానం
యతిగా పరిగణించాడు.

మానినీ, కవి విరాజితాలు జంట గా వాడి.. శకుంతలా దుష్యంతుల
భావి కళ్యాణాన్ని సూచించాడేమో. అందుకే నన్నయ్యది అక్షర రమ్యత
అన్నారు. 



5 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంచి పద్య లక్షణాలను పరిచయం చేసారు వెంకట్ గారూ ! ధన్య వాదములు

రవి చెప్పారు...

అయిగిరి నందిని - ఈ స్తోత్రం కూడా కవిరాజవిరాజితము కు ఉదాహరణ. ఆదిత్య 369 సినిమాలో కృష్ణదేవరాయల పాత్ర పాడిన పద్యం - జయజయ దానవ దారణ కారణ సార్ఞ రథాంగ గదాసిధరా.. కూడా కవిరాజవిరాజితము. (ఆముక్తమాల్యద లోనిది)

గాదిరాజు మధుసూదన రాజు చెప్పారు...

కవి రాజవిరాజితము 1నగణము 6 జ గణములు తరువాత 1నగణముఅని వ్రాశారు తప్పు కదా ?

గాదిరాజు మధుసూదన రాజు చెప్పారు...

గురువుండాలి

గాదిరాజు మధుసూదన రాజు చెప్పారు...

కవి రాజవిరాజితము 1నగణము 6 జ గణములు తరువాత 1నగణముఅని వ్రాశారు తప్పు కదా ?