చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
బంగరు మొల త్రాడు పట్టుదట్టి
సందె దాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు !
ఈ పద్యం అందరం చిన్నప్పుడు చదువుకున్నదే కానీ, మనలో చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇది తాళ్ళపాక అన్నమాచార్యుడు వ్రాసిందని. "చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు" అంటూ ఒక శతకాన్ని వ్రాసాడట ఆ మహానుభావుడు. కానీ అందులో ఇప్పుడు మనకు దొరికిన పద్యాలు కేవలం ఎనిమిదేనట. మిగిలినవి ఏమయ్యాయో ఇంకా తెలియదు. ఇది ఆటవెలది కి ప్రారంభం. ఇంకా మన వేమన గురించి చెప్పాలంటే మన హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద చూసే ఉంటారు ఆయన విగ్రహం. కింద ఆయన గురించి.. "ఆటవెలది ని ఈటె గా విసరిన దిట్ట. చాందస భావాలకు తొలి అడ్డు కట్ట." ఆయన ఆటవెలది లో దిట్ట. అయన రాసిన సరళ ఆటవెలదులు మనం ఎ గ్రంధం లోనూ చూచి ఉండము కూడా.
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
లక్షణములు
ఆ.ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబునుహంస పంచకంబు ఆటవెలది.'
పాదాల సంఖ్య నాలుగు 1, 3 పాదాలు మెదటి 3 గణాలు సూర్య గణాలు ,తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి 2, 4 పాదాల్లో 5 సూర్య గణాలు ఉంటాయి యతి ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం. ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ఉదా:- 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే. ఇదీ స్తూలంగా ఆటవెలది కి ప్రారంభం. ఇక మనం పద్యం లో ప్రవేశించి, గణవిభజన తో సహా నేర్చుకుందాము.

9 కామెంట్లు:
చిన్న అచ్చుతప్పు. రెండో పాదములో..
'బంగరు' మొలత్రాడు పట్టుదట్టి...
అయ్యా.. తెలుగు యాంకీ గారూ.. సరి చేస్తాను.. తొందరలో టైపింగ్ మిస్టేక్ అది.
చాలా బాగుందండీ నాకు కూడా ఈ పద్యం అన్నమాచార్యులు రాసినదని తెలియదు కానీ వేమన పద్యాలన్నీ ఆటవెలదులే అవుటవలన ఇది ఆయనే మొదటగా దీనిని రాసి ఉంటారు విశ్వదాభి రామ వినుర వేమా అని లేకుండా అనుకున్నాను. మంచి విషయాలని తెలియచేస్తున్నారు. ధన్యవాదములు
చాలా బాగుందండి వివరంగా ఇచ్చారు.
కాకినంద వాడ అనెడి రెండవ మద్రాసు
మంజరీ ద్విపద:-
మొన్ననిన్నో పక్షము మరుఁగున పడి!
కంటికి కానకా కటువుగా మారి!
నేడు మార్చిరి కండువాలు నేర్పరులు?
విశ్వమానవ తేజ వినుడు అన్నయ్య !!
ఆటవెలది:-
గుణము ఘనము లేక గుర్తించ రెవ్వరూ!
గానవచ్చు కడకు ఘనము ఫలము!
హెచ్చు ధనము ఉన్న ఎగతాళి ఔనురా!
తల్లి చౌడమాంబ తమకు తెలుసు !!
మంజరీ ద్విపద:-
ఉన్నావు నీవంటు ఉరుకు నా వస్తి!
వద్దు పొమ్మనకయ్య వరద రాజయ్య!
అభయంబు నీవిచ్చి ఆదుకోవయ్య!
శ్రీ తిరుమల వాస శ్రీ వేంకటేశ!!
పై పద్యములలో అక్షర దోషములుంటే తెలియ జేయగలరని మనవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి