సీ. మదనాగ యూధ సమగ్ర దేశముగాని
కుటిల వర్తన శేష కులము గాదు
ఆహ వోర్వీజయ హరి నివాసము గాని
కీశ సముత్కరాంకితము గాదు
సుందర స్యందన మందిరం బగుఁగాని
సంతత మంజులాశ్రయము గాదు,
మోహన గణికా సమూహ గేహము గాని
యూథికా నికర సంయుతము గాదు.
తే. సరస సత్పుణ్యజన నివాసమ్ముగాని
కఠిన నిర్దయ దైత్య సంఘమ్ముగాదు,
కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి
పుర వరాగ్రమ్ము సాకేత పుర వరమ్ము. ||3||
సీ. భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై
గణుతింప సత్య లోకమ్ము వోలె,
మహనీయ గుణ సర్వమంగళావాసమై
పొగడొందు కైలాస నగము వోలె,
లలిత సంపచ్ఛాలి లక్ష్మీ నివాసమై
యురవైన వైకుంఠ పురము వోలె,
విరచిత ప్రఖ్యాత హరిచంద నాఢ్యమై
యారూఢి నమరాలయమ్ము వోలె,
తే. రాజ రాజ నివాసమై తేజరిల్లి
నరవ రోత్తర దిఘ్భాగ నగరి వోలె
సకల జనములు గొనియాడ జగములందుఁ
బొలుపు మీరును సాకేత పుర వరమ్ము. ||4||
ప్రతి పద్యానికి అర్ధ తాత్పర్యాలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ.. హృదయోల్లాస వ్యాఖ్యలు అరుదుగా ఉంటాయి. అలా మీ హృదయాలకు ఆహ్లాదము కలిగించాలనే నా ఉద్దేశ్యము మరియూ నా ప్రయత్నం ఇందులో ఎంతవరకూ సఫలీకృతుడ నవుతానో వీక్షకులే సాక్షి.
అయోధ్యా నగరం ఎలా ఉందో వర్ణించి చెపుతోంది మొల్ల తల్లి. మొదట సత్యలోకం అంది, తర్వాత కైలాసం అంది, తర్వాత వైకుంఠ పురం అంది, చివరకు అమరావతి తో పోల్చింది. సాకేత పురం ఎలా ఉందో చెప్పింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి