ఒక విషయము మీకు చెప్పాలి. సంయుక్తాక్షరానికీ, ద్విత్వక్షరాలకీ ముందున్న లఘువు, గురువు గా మారుతుందని ఇంతకూ ముందు అనుకున్నాం కదా! అక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక పదం లో మొదటి అక్షరమే, సంయుక్త లేక ద్విత్వాక్షరం అయింది అనుకోండి. అప్పుడు, దాని కన్నా ముందు లఘువు వేరొక పదం లో ఉంటే, గురువు అవదు. ఎట్టి మార్పూ ఉండదు. గమనించండి.
చంపక మాల లోని ఒక పాదం ద్వారా మీకు ఆ విషయం చెప్తాను.
కలిపి - నద్రాక్ష - పాకమ - నాకమ్మ - దనంబు - నకమ్ము - యౌచురా.
న జ భ జ జ జ ర
III, IUI, UII, IUI, IUI,IUI, UIU.
"ద్రా" అనే సంయుక్తాక్షరం ముందు "న" లఘువు ఉన్నప్పటికీ, కలిపిన - ద్రాక్ష వేరు వేరు పదాలు అవడం వల్ల, న లఘువు గానే ఉండి పోయింది. ఇలాంటి విషయాలు గమనించుకోవాలి.
3 కామెంట్‌లు:
మీ బ్లాగ్ బాగుందండీ. పర్యాయ పదాలు చాలా నాలాంటి వారికి ఎంతో ఉపయోగ పడతాయి.
ప్రణీత గారూ! మీ అదరాభిమానాలతో, బ్లాగు
కొనసాగిస్తున్నాను. మీ లాంటి వారి సలహాలు
నాకు ఎంతో అవసరం. ధన్యవాదాలు.
వెంకటప్పయ్య గారూ,
మీ ప్రయత్నం బహుదా ప్రశంసనీయం...పద్యం అంటే ఆసక్తి ఉన్నవాళ్ళందరికీ మీ బ్లాగు గురించి చెప్తున్నాను...ఒక చిన్న విషయం....ఈ పద్యనియమాలకి చిన్న చిన్న పద్యాలు ఉంటాయి కదా..(ఉదాః సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు...ఇలా)..అవి కూడా చెప్పండి,అందరూ సరదాగా,ఇంకా ఉత్సాహంగా నేర్చుకుంటారు...బాగా గుర్తుంటాయి కూడా...ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి