• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

6, జులై 2010, మంగళవారం

ఆటవెలది రాద్దాం ఇలాగా..

పద్యాలు రాయడంలో, ఆటవెలది గానీ, తేటగీతి కానివ్వండి, మన మనసులో ఒకట్యూనింగు లాగా ఏర్పడే వరకూ ప్రాక్టీసు చెయ్యాలి. మీరేమి అనుకున్న విరామ సమయంలో, మనసులోనే గణ విభజన చేసుకోండి. ఉదా: ఆటవెలది అయితే, మొదట ఒక సూర్య గణం రావాలి కదా. మూడు లఘువులతో గానీ.. (III) లేక UI తో ప్రారంభించాలి అనే విషయం మనసులో పెట్టుకోండి. అంటే, పద్యం చెప్తూ ఉన్నప్పుడే , సరిగా వెళ్తోందా మన ఆటవెలది బండి అని ఆలోచించుకుంటూ వెళ్ళండి.
ఒక ఉదాహరణ చూద్దాము. ఆటవెలది గురించి ఒక పద్యం రాయాలనుకుంటే మొదట, ప్రారంభం.. "ఆట" అని చేద్దాము తర్వాత, మళ్ళీ ఇంకో రొండు సూర్య గణాలు రావాలి. "వెలది" సరిపోతుంది. "రాయ" సరిపోతుంది. ఇక ఇంద్ర గణాలు రొండు ఎన్నుకోవాలి. నల, నగ, సల, భ, ర, త ఉండాలి కదా. ఇక యతి చూచుకుంటూ.. ఇంద్ర గణము రాయాలి. "ఆదరను" మళ్ళీ.. "బెదరను". అనే మాట వేద్దాము. కాబట్టి మనకు మొదటి పాదం తయారయింది. ఇలా పదాల అటూ ఇటూ తిప్పుతూ.. గణాలు చెదరకుండా.. యతి భంగం కాకుండా.. రాయడం ప్రాక్టీసు చేసుకోవాలి.

మొదట సంధులు సమాసాల గొడవ వదిలేసి, చిన్న చిన్న పదాలతో. ప్రారంభించండి. పదాలు పద్యం లో అటూ ఇటూ మార్చుకోవచ్చు. భావం చెడకుండా చూసుకోవాలి అంతే. .. ఇవాల్టికి ఇది ప్రాక్టీసు చేయండి. రేపు ఇంకో ఛందస్సు తో కలుద్దాము. స్వస్తి.

5 కామెంట్‌లు:

చందు చెప్పారు...

excellent gurugaaru!!!!

కంది శంకరయ్య చెప్పారు...

వెంకటప్పయ్య గారూ,
మీ ఛందోపాఠాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అభినందనలు.

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

శంకరయ్య గారికీ, సావిరహే గారికీ... నమస్కారాలు. మీ ప్రోత్సాహం ఉన్నంత కాలం.. నా శక్తి వంచన లేకుండా.. బ్లాగు ఉన్నతి కి నిరంతర సేవలు అందిస్తాను.

డా.బిరుదు గంటి చెప్పారు...

కాకినంద వాడ అనెడి రెండవ మద్రాసు

Unknown చెప్పారు...

బొమ్మకు పద్యం....
ఆ.వె.చెరకు విల్లు బట్టి కరకుటమ్ములదేల
పట్ట బోవ దగదు పడతి నీవు
చూపు తూపులుండె రూపుమాపంగను
చక్రవాకములవి చంపుచుండె
దీనికి భావం తెలుపరా గురువు గారు 🙏🙏🙏🙏plz