ఈ మధ్య భవభూతి మహాకవి గురించి చదువుతూ ఉంటే.. మహాకవి కాళిదాసు ను గూర్చిన కొన్ని అద్భుతమైన శ్లోకాలు కనిపించాయి. అవి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీకూ అవి తెలిసే ఉంటాయి కానీ నా ఉత్సాహం కొద్దీ మళ్ళీ రాస్తున్నాను.అంతే!
శ్లో! కవిర్దండీ! కవిర్దండీ భవభూతి స్తు పణ్దిత:
కోహం రణ్డే త్వమేవాహం త్వమేవాహం న సంశయ:
తెలుగు లో శ్రీనాధ మహాకవి కి వలె సంస్కృతం లో మహాకవి కాళిదాసు గురించి అనేక చాటువులు జనం లో ఉన్నాయంటారు.ఇంతకీ ఈ శ్లోకం ఏమిటంటే..ఒక సారి సరస్వతీ దేవి "దండి మహాకవి దండి మహాకవి" "భవభూతి పండితుడు" అన్నదట. వెంటనే కాళిదాసు రండా మరి నేనెవరు అని అడగ్గా ఆ మహా తల్లి ఓరి పిచ్చి వాడా.. నువ్వే నేను.. నేనే నువ్వు అన్నదట.
మహా కవి పండితుడు, మహా మేధావి, మహా వ్యాఖ్యాత "మల్లినాధ సూరి" కాళి దాసును గూర్చి అన్న మాటలు ఎమిటో కూడా చెప్తాను ఈ సంధర్భం లో...
శ్లో! కాళిదాస గిరాం సారం కాళిదాస: సరస్వతీ
చతుర్ముఖో దవా సాక్షాద్విదు ర్నాన్యేతు మాదృశా:
అంటే.. కాళిదాసు వాక్కుల సారాంశం తెలిసిన వారు కాళిదాసు, సరస్వతీ దేవి, నలువ మాత్రమే.. నావంటి వారికి అది ఎన్నటికీ తెలియదు. సాక్షాత్తూ..మల్లినాధ సూరి ఈ మాటలన్నడాంటే..కాళిదాసు కవితా వైభవం ఏమిటో మనం గ్రహించవచ్చు.
కవికులశేఖరుడైన కాళిదాసు కవితా వైభవం ఏమిటో ఒక్క సారి ఆయన శ్లోకంలోనే చూద్దాం.
రఘువంశం అనే కావ్యం లో చతుర్ధ సర్గ లో ఆయన మహారాజు గా పట్టాభిషిక్తుడైన సందర్భం లో ఒక శ్లోకం చెప్పి ఈ పోస్టింగు ముగిస్తాను.
శ్లో! సరాజ్యం గురుణా దత్తం ప్రతి పద్యాధికం భబౌ!
దినాంతే నిహితం తేజ: సవిత్రేవ హుతాశన:
ఈ శ్లోకాన్ని చదువుతుంటే.. ఇక్కడ కొన్ని శ్రుతి వాక్యాలను ఙప్తి కి వస్తున్నాయి. అవి ఏమిటంటారా...
సౌర్యం తేజ: సయమగ్నిం సంక్రమతే! ఆదిత్యోవా అస్తం యన్నగ్ని మనుప్రవిశతి. అగ్నివా ఆదిత్య: సాయం ప్రవిశతి. అంటే సూర్య సంభంధమైన తేజస్సు సాయం సమయం లో అగ్ని లో ప్రవేసిస్తుందని సారాంశం.
ఆ రఘు మహా రాజు తండ్రి దిలీపుడు ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించి ఎలా ఉన్నాడయ్యా అంటే..అస్తమాన సమయం లో సూర్యుడు నిక్షేపించే అగ్ని ని స్వీకరించిన వాని వలె ప్రకాశిస్తున్నాడు.
ఇందులో మంచి ఉపమానాలంకారం ఉంది. దిలీపుడు-సూర్యుడు, రఘువు-అగ్ని రాజ్యానికి-తేజస్సు వీటి మధ్యన పోలిక ఎంత అందం గా ఉందో చూడండి.
ఇందులో రఘు వంశ రాజుల ఉదాత్తత, వంశ ప్రతిష్ట, పితృ భక్తి, ధర్మం, శ్రద్ధ మొదలైనవన్నీ ఉన్నాయి.
ఇటువంటి ఎన్నో ఉపమలను కావ్యాలలో నిక్షేపించడం వలననే కాళిదాసును "ఉపమా కాళిదాసస్య" అన్నారు.

5 కామెంట్‌లు:
First poem is not a poem. It is regarding arguement between Dandi and Bhavabhuti. Once Dandi and Bhavabhuti argue with each other who is the best between two. They go to Kalidasa and Kalidasa is in dilemma as he himself is one of the greatest poets and drama writers. Then trio (Bhavabhuti, Dandi and Kalidasa) go to Goddess Kali temple and pray mother Kali. A divine voice (Mother kali's) says that "kavirdandi, bhavabhutistu panditaha" (Dandi is poet and Bhavabhuti is well versed). Then Kalidasa gets angry and asks/shouts "Koham rande" (who am I (with explective word)) ?. Then mother Kali says "tvamevaaham tvamevaaham naatra samsayaha" (I am you and you are me, no doubt in this). Then Kalidasa feels happy and apoligizes to Mother kalaidasa.
అఙ్ఞాత గారూ... మీరు చెప్పిన కధ వినడానికి బాగానే ఉంది కానీ..నేను అది పద్యం (poem)అని ఎక్కడా చెప్పలేదు. అది శ్లోకం అని చెప్పాను.అయినా మీరు తెలుగు విశ్వవిద్యాలయం వారి "రఘు వంశం" కూడా ఒకసారి చూడండి. అదే కాకుండా నేను ఇదివరకు విన్నదానికి కూడా మీరు చెప్పింది సరిపోవడం లేదు. ఈ "వృత్తాంతం" ఎక్కడ చదివారో చెపితే నేనూ చూస్తాను. ధన్యవాదాలతో..
వెంకటప్పయ్యగారూ, హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలో కాళిదాసు రఘు వంశం సంస్కృత మూలం తో బాటు తెలుగులో అర్ధాలు దొరుకుతుందా.. అలాగే వాల్మీకి రామాయణం గురించి కూడా లభ్యమయ్యే చోటు తెలుపగలరు
వెంకటప్పయ్యగారూ, హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలో కాళిదాసు రఘు వంశం సంస్కృత మూలం తో బాటు తెలుగులో అర్ధాలు దొరుకుతుందా.. అలాగే వాల్మీకి రామాయణం గురించి కూడా లభ్యమయ్యే చోటు తెలుపగలరు
అయ్యా
మేము మెల్బోర్న్ నగరంలో ఉంటాము. వచ్చే మూడు నెలల్లో కాళిదాసు నాటకం వేయాలని అనుకుంటున్నాము. మీ వద్ద నాటక ప్రతి ఉంటే తెలియజేయగలరు. నా పేరు మల్లికేశ్వర రావు కొంచాడ నా whatsapp నంబరు 61422116542
కామెంట్‌ను పోస్ట్ చేయండి