• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

19, నవంబర్ 2012, సోమవారం

సంస్కృతం లో వృక్షాల పేర్లు


మనం చాలా సందర్భాలలో..చెట్ల పేర్లను సంస్కృతం లో వింటూ ఉంటాము. ఆయుర్వేద మందుల విషయంలో.. వినాయక చవతి సందర్భంగా.. ఇలా ఎన్నొ సందర్భాలలో.. అన్నీ మనకు తెలిసినవే అయినా ఎవో కొత్త పేర్లు వింటున్న అనుభూతి కలగడం సహజం. సమయం ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని చూడండి.  మీ కోసం...

సంస్కృతం లో వృక్షాల పేర్లు కొన్ని చూద్దాము సరదాగా..

కదంబ: = కడిమి
ఆమలక: = ఉసిరి
విష్ణుక్రాంతా = విష్ణు క్రాంత
బృహజ్జం బీర: = దబ్బ
మధూక: = ఇప్ప
అరిష్ట: = కుంకుడు
ఆమ్ర = మామిడి
నింబ: = వేప
పలాశ: = మోదుగ
పర్కటీ = జువ్వి
చించా = చింత
అశ్వధ్ధ: = రావి
అర్జున: = మద్ది
అర్క: = జిల్లేడు
భృంగరాజ: = గుంట గలగర
శమీ = జువ్వి
జంబూ = నేరేడు
శల్మలీ = బూరుగ
లతా = తీగ
స్కంధ: బోదె
శాఖా = కొమ్మ
మాచీ = మాచికాయ
కపిత్త: = వెలగ
గుల్మ: = పొద
నికుంజ: = పొదరిల్లు
కాండ: = కాండము
శిఫా = ఊడ
కింజల్క: = పుప్పొడి
వట: = మర్రి
వరాటక: = విత్తనాల కోశము
దూర్వా = గరిక
కుస: = దర్భ
తృణం = గడ్డి
ఘాస: = పచ్చి గడ్డి
వేణు: = వెదురు
బదరీ = రేగు
అపామార్గ: = ఉత్తరేణి
వృంతం = తొడిమె
దళం = రేకు
అంకుర: = మొలక
బీజం = విత్తనం
తాల: = తాడి
బర్బర: = తుమ్మ.

ఇవి కూడా మీకు ఆసక్తి దాయకమని భావిస్తూ...శెలవ్.

11 కామెంట్‌లు:

Jagadeesh Reddy చెప్పారు...

thank u

durgeswara చెప్పారు...

baaguMdi
dhanyavaadamulu

అజ్ఞాత చెప్పారు...

With Pictures please!
A good site for telugu tree names:

http://vaividyamu.blogspot.com/

రసజ్ఞ చెప్పారు...

దర్భని "కుశ" (కుస కాదనుకుంటాను) అంటారు కదండీ!

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...

రసఙ్ఞ గారూ... మీరు చెప్పింది నిజమే.. లేఖిని లో దొర్లిన ముద్రా రాక్షసం సుమా.. సరిచేస్తాను. త్వరలో.. ఈ మధ్య మీ సలహాలూ సూచనలూ లేవు. పంపండి అన్ని పోస్టింగుల మీదా...

Dr.Tekumalla Venkatappaiah చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

శీర్ష వృక్షము అనగా ఏమి చెట్టు

అజ్ఞాత చెప్పారు...

గోరింటాకు నీ ఏమంటారు

Zilebi చెప్పారు...

కురంటకపత్రః

Zilebi చెప్పారు...

*కురవకపత్రః

అజ్ఞాత చెప్పారు...

Samee - Jammi chettu?