• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

26, నవంబర్ 2012, సోమవారం

సంస్కృతంలో... శరీరాంగాని - శరీరాంగములు.


1.అంగుళీ = వ్రేలు
2.అంగుష్టం = బొటనవ్రేలు
3.అనామికా = దర్భ వ్రేలు
4.కనిష్టా = చిటికిన వ్రేలు
5.మధ్యమా = నడిమ వ్రేలు
6.తర్జని = చూపుడు వ్రేలు
7.అంజలి = దోసిలి
8.కూర్పర: = ముంజేయి
9.కరభ: = చిటికినవ్రేలు మొదలు మణికట్టు వరకూ గల భాగము.
10.అరత్ని: = చాచిన చిటికినవ్రేలుగల పిదికిలి తో కూడిన మూర
11.ఉర: = వక్షస్తలం
12.ఊరు: తొడ
13.ఓష్ట: = పెదవి
14.కక్ష: = చంక
15.కట: = మొల
16.కటి: = పిరుదు
17.కంఠ: = కుత్తుక
18.కంధరా = మెడ
19.కపోల: = చెక్కిలి
20.కర్ణ: = చెవి
21.కూర్చం = కనుబొమ్మల నడుమ
22.కూర్పర: = ముంజేయి
23.గాత్ర: = శరీరం
24.గుల్ఫ: = చీలమండ
25.చపేట: = చాచిన వ్రేళ్ళుగల అరచేయి
26. చిబుకం = గడ్డం
27.చూచుకం = చనుమొన
28.జంఘా = పిక్క
29.జత్రు = మూపుసంధి
30.జాను = మోకాలు
31.జిహ్వ = నాలుక
32.తారకా = కంటి నల్ల గ్రుడ్డు.
33.తాలు = దౌడ
34.దశన: = దంతము
35.నఖ: గోరు
36.నాసికా = ముక్కు
37.నేత్రం = కన్ను
38.ప్రకోష్ట: = ముంజేయి
39.బాహు: = భుజము
40.భ్రూ: = కనుబొమ్మ
41.వంక్షణ: = గజ్జలు
42.వస్తి: = పొత్తి కడుపు
43.స్కంద: = మూపు

ఇంకా కొన్ని విశేషాలు వచ్చే పోస్టింగులో చూద్దాము. శెలవ్.




2 కామెంట్‌లు:

Chandrasekar చెప్పారు...

Thank you verymuch for your
Sanskrit word and telugu meanings.

అజ్ఞాత చెప్పారు...

ఆంగ్‌ళీ: వేలు
అంగూటా: బొట్టన వేలు
పసి: దోసిలి
హోట్: పెదవులు
కాంక్: చంక
కడ్: మొల
నల్‌డి: మెడ
కాన్: చెవి
గాల్: చెంప
డ్వాడి: గడ్డం
జీబ్: నాలుక