11.సౌభాగ్య యతి: ఉభయ యతి చెల్లునట్టి శబ్దములు రెండు ఒకే పాదమున నుండి, వాని సంధిని వేరు చేసినప్పుడు కనపడె అచ్చులకు యతి మైత్రి చెల్లించడాన్ని సౌభాగ్యయతి అంటారు.
ఉదా: ప్రాంచి తామర వినుత వేదండ వరద
ప్ర+అంచిత= ప్రాంచిత, పకార రేఫములగు వానిపై ఉన్న అ కారమునకు యతి చెల్లించ వచ్చును.ఇది ఉభయ యతి చెల్లే శబ్దం. ఇట్లే వేదండ అనే శబ్దం లో (వేద+అండ = వేదండ) దవర్ణానికి దాని పై ఉన్న అకారమునకు కబట్టి ఇదీ ఉభయ యతి అవుతుంది.ఇట్టి శబ్దాలు రెండూ ఒకేపాదం లో ఉండి యతి చెల్లిస్తే అది సౌభాగ్య యతి అవుతుందని అర్యోక్తి.
12.ప్రాది యతి: ప్ర, పరా, ప్రతి, పరి, అతి, అధి, అభి, అవ, అన, ఉప, సం,ను, అప,ని,వి, నిర్, దుర్, ఉత్, అపి, అఙ్ - వీటిని ప్ర్రదులు అంటారు.వీటినే ఉపసర్గలు అనికూడా అంటారు. ఈ ప్రాదులకు అచ్చు పరమై సంధి జరిగేటప్పుడు అచ్చుకు, హల్లుకూ ఉభయములకూ యతి మైత్రి చెల్లును.
ఉదా: ప్రాణ సంకటమైన పుణ్యాంగనలకు. ఇందులో ప్రాణ లొని "అ" కు పుణ్య అంగన లోని "అ" కు యతి మైత్రి చెల్లింది.
13. అబేధ యతి: "పరయో రభేద:" అన్న అర్యోక్తి ని అనుసరించి వకార పకారములకు బేధము లేదు.కనుక వకారమునకు ప,ఫ,బ, భ లతో యతి చెల్లును. అలాగే "లడయో రబేధ:" అన్న అర్యోక్తి కూడా ఉంది. కాబట్టి ల-డ లకు ర-ల లకు కూడా అభేద యతి చెల్లును.
తే!గీ! ల లిత వీణా రవంబు తో ఢక్క సరియె - ఇక్కడ ల కు ఢ కు యతి చెల్లినది.
మరికొన్ని తర్వాతి పోస్టింగుల లో చూద్దాము. శెలవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి